OYO: ప్రేమికులకు షాకిచ్చిన ఓయో.. ఈ కొత్త రూల్స్ ఫాలో అవ్వాల్సిందే
ఓయో.. ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చే విషయం ఒకటే. మేజర్లు.. అంటే పద్దెనిమిదేళ్లు నిండిన ఎవరైనా సరే ఆధార్ కార్డ్ చూపించి రూమ్ బుక్ చేసుకోవచ్చు. ప్రేమ జంటలు ఏకాంతంగా గడిపేందుకు అవకాశం ఉండేది. ఇకపై అలా కుదరదు. ఓయో రూమ్స్ విషయంలో సదరు సంస్థ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త చెక్-ఇన్ పాలసీ తీసుకొచ్చింది. ఇప్పటివరకు రూమ్ బుక్ చేసుకునే జంటలకు పెళ్లి అయిందా కాలేదా అనే విషయం పట్టించుకోని ఓయో.. తాజాగా అలా కుదరదని స్పష్టం చేస్తూ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. గతంలో ఇద్దరూ మేజర్లు అయితే చాలని భావించి వారికి రూమ్ ఇచ్చేది. ఏమైందో ఏమోకానీ ఇప్పుడు దీనికి చెక్ పెట్టాలని ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ నిర్ణయించారు. ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్ ఇచ్చేది లేదని బుకింగ్ సదుపాయాన్ని ఎత్తేశారు. బుకింగ్ సమయంలోనే వివాహానికి సంబంధించి తగిన ఆధారాన్ని చూపించాలని స్పష్టం చేశారు. ఈమేరకు ఓయో చెక్ ఇన్ రూల్స్ లో మార్పులపై కంపెనీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మారిన రూల్స్ ప్రకారం. ఇకపై పెళ్లికాని జంటలు రూమ్ బుక్ చేసుకునే అవకాశం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos