ఒకప్పుడు భార్య సంపాదనపై..ఇప్పుడు స్టార్స్‌గా ఎదిగిన సెలబ్రిటీస్ వీరే?

10 January 2025

samatha

స్టార్స్‌గా ఎదగడమంటే చిన్న విషయం కాదు. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటేనే వారు స్టార్ స్టేటస్ అందుకుంటారు.

అయితే ఇప్పుడు కోట్లు సంపాదించే సెలబ్రిటీలు కూడా తమ జీవితంలో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కున్నారంట.

ఒకప్పుడు వారు తమ భార్యల సంపాదన పైన బతికిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు చూద్దాం?

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే, బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు

ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న ఈ దర్శకుడు ఒకప్పుడు తన భార్య రమా సంపాదనపై ఆధారపడాల్సి వచ్చిందని, ఓ ఈవెంట్‌లో ఆయన చెప్పుకొచ్చారు

 ఇక ఇప్పుడు వరస సినిమాలతో చాలా బిజీ అయిపోయి, కోట్లు సంపాదిస్తున్న అజయ్ ఘోష్ కూడా ఒకప్పుడు భార్య సంపాదనపైనే ఆధారపడ్డాంట.

బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

యానిమల్ సినిమాతో ఈ హీరోకు ఒక్కసారిగా మంచి క్రేజ్ వచ్చింది. కాగా, ఈ హీరో కూడా ఒకప్పుడు తన భార్య తాన్యా డియోల్ సంపాదనపైనే ఆధారపడ్డాంట.