Brahmamudi, January 18th episode: కావ్యే టార్గెట్‌గా అనామిక కన్నింగ్ ప్లాన్స్.. రచ్చ రచ్చ చేసేసిందిగా!
ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. అనామిక వల్ల దుగ్గిరాల ఇంట్లో రచ్చ మొదలవుతుంది. దీంతో ధాన్యం ఒక రేంజ్‌లో రెచ్చి పోతూ ఉంటుంది. మాట్లాడితే కళ్యాణ్ అప్పూ, కావ్య ప్రస్తావన తీసుకొస్తున్నాడంటూ కావాలనే గొడవ మొదలవుతుంది. అమ్మా మహా తల్లీ నా కొడుకు, కోడలు సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా.. పెళ్లికి ముందు రాహుల్‌తో లేచి పోయిన నువ్వు.. ముసుగేసుకుని రాజ్‌ని పెళ్లి చేసుకుని నీ చెల్లెలు వచ్చారు. కానీ నా కోడలు అలా రాలేదు. ప్రేమించి ఇంట్లో వాళ్లందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకుందని అంటుంది ధాన్య లక్ష్మి. దీంతో రాజ్ సహనం కోల్పోయి..
ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. అనామిక వల్ల దుగ్గిరాల ఇంట్లో రచ్చ మొదలవుతుంది. దీంతో ధాన్యం ఒక రేంజ్‌లో రెచ్చి పోతూ ఉంటుంది. మాట్లాడితే కళ్యాణ్ అప్పూ, కావ్య ప్రస్తావన తీసుకొస్తున్నాడంటూ కావాలనే గొడవ మొదలవుతుంది. అమ్మా మహా తల్లీ నా కొడుకు, కోడలు సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా.. పెళ్లికి ముందు రాహుల్‌తో లేచి పోయిన నువ్వు.. ముసుగేసుకుని రాజ్‌ని పెళ్లి చేసుకుని నీ చెల్లెలు వచ్చారు. కానీ నా కోడలు అలా రాలేదు. ప్రేమించి ఇంట్లో వాళ్లందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకుందని అంటుంది ధాన్య లక్ష్మి. దీంతో రాజ్ సహనం కోల్పోయి.. రేయ్ కళ్యాణ్ ఏంట్రా ఇది.. ఈ గొడవలు ఏంటి? అసలు ఒక్కదానికైనా సంబంధం ఉందా? ఏ విషయం దేనికి ముడి పెడుతున్నారు? అనామికను గదిలోకి తీసుకెళ్లి సర్ది చెప్పుకో అని రాజ్ ఆవేశంగా అంటాడు. రాజ్.. ముందు నువ్వు నీ పెళ్లానికి చెప్పుకో.. తర్వాత నీ తమ్ముడి భార్య గురించి తర్వాత చెబుదువు కానీ.. అసలు ఇంతకు ముందు ఈ ఇంట్లో గొడవలు ఉన్నాయా.. స్వప్న వచ్చాక కొన్ని రోజులు.. ఈ కావ్య వచ్చాక మరి కొన్ని రోజులు. ఇప్పుడు అప్పూతో ఇంకెన్ని రోజులు.. ఆ కుటుంబం వల్లే ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. లేకుంటే ఉండేవా.. నీ పెళ్లానికి చెప్పు అన్నింట్లో తల దూర్చవద్దని అపర్ణ ఫైర్ అవుతుంది.
భార్యను ఎలా ఓదార్చాలి అని అడగడం ఈ ఇంట్లోనే జరుగుతుంది..
దీంతో బాధతో ఏడుస్తూ పైకి వెళ్లి పోతుంది కావ్య. తనవెంటే రాజ్ కూడా వెళ్లిపోతాడు. ఎక్కడి గొడవ ఎక్కడికి దారి తీసింది. అనామిక భార్య భర్తల గొడవ గది వరకే ఉండాలి.. రేయ్ కళ్యాణ్ తనని తీసుకెళ్లు.. అందరూ వెళ్లండి ఇక అని ఇందిరా దేవి అంటుంది. పైకి వెళ్లిన కావ్య బెడ్ పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. దీంతో రాజ్ కూడా తన పక్కన కూర్చుని.. నాకు నిన్ను ఏడిపించడం తప్ప.. ఓదార్చడం తెలీదు. ఇప్పుడు నేను నీకు ఏం చేస్తే ప్రశాంతంగా ఉంటుందో చెప్పు అని రాజ్ అడుగుతాడు. భార్య బాధలో ఉంటే భర్త వచ్చి ఏ పద్దతిలో ఓదార్చాలి అని అడగడం ఈ ఇంట్లోనే జరుగుతుంది అని కావ్య అంటుంది.
నేనూ మీ ఫిలాసఫీనే ఫాలో అవుతాను..
నీకు ముందే చెప్పాను కదా నాకు తెలీదు అని.. ఒకరితో మాట్లాడటానికి ఒక్కో కొలమానం ఉంటుంది. బంధం వద్దనుకుంటే గట్టిగా సమాధానం చెప్పొచ్చు. అందుకే ఎవరినీ ఏమీ అనలేమని రాజ్ అంటే.. మీరు ఇలా మాట్లాడతారని నాకు ఇప్పుడే తెలిసింది. నేనూ ఇదే ఫిలాసఫీ ఫాలో అవుతాను. స్వప్న అక్కలా తొందర పడి మాటలు అనను అని కావ్య అంటుంది. ఇప్పుడు అనామిక నా తమ్ముడి భార్య. నేను బావగారిని. మా డాడీ మా పిన్నిని ఏమీ అనలేనట్లే.. నేనూ అనామికను ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నాను. కళ్యాణ్‌కి ఈ పరిస్థితి కొత్త. ఇన్నాళ్లూ జరిగేవి ప్రేక్షకుడిగా చూసేవాడు. ఇప్పుడు బాధ్యత వహించే స్థానంకి వచ్చాడు. వాడు ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతాడో నాకు తెలుసు. ఇక మా ధాన్య లక్ష్మి పిన్ని.. ఆవిడ ఇలా కూడా మాట్లాడగలదని నాకూ ఈ మధ్యే తెలిసింది. వీళ్లందర్నీ సర్దుకు పోతేనే ఉమ్మడి కుటుంబం నిలబడతుందని రాజ్ అంటాడు.
రాజ్ భుజంపై ప్రేమగా వాలిన కళావతి..
ఆ తర్వాత కృష్ణుడి గొప్పతనం గురించి చెబుతూ.. తనకు కృష్ణుడు అంటే ఎంత ఇష్టమో వివరిస్తుంది. ఆయన వేణుగానం మనసును శాంత పరుస్తూ ఉంటుంది. ఆయనకు నైవేథ్యంగా పెట్టిన నవనీతం.. గాయంపై రాస్తున్నట్టు ఉంటుంది. అందుకే ఈ రోజు జరిగిన గాయాన్ని ఈ రోజే మాన్పుకుంటాను. చూస్తాను ఇంకా ఎన్ని గాయాలు అవుతాయో అని రాజ్ భుజంపై ప్రేమగా వాలుతుంది కళావతి. మీరు అండగా ఉంటే.. గోవర్థన గిరినైనా గోటితో ఎత్తగలనన్న ధైర్యం వస్తుంది. రాజ్ భుజాన్ని గట్టిగా పట్టుకుంది. రాజ్ కూడా ఏమీ అనకుండా అలా చూస్తూ ఉంటాడు.
దుగ్గిరాల ఇంట్లో మరో రుద్రాణిగా మారిన అనామిక..
మరోవైపు ఎవరూ చూడకుండా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. కావ్యను ఇరికించిన విషయం చెబుతుంది అనామిక. మనం అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. నా ఫస్ట్ నైట్ చెడగొట్టుకున్నా.. అని అనామిక అంటుంది. అత్తయ్యా.. రుద్రాణి ఆంటీ కావ్య వల్లే ఇలా అయిందని అనుకుంటున్నారని అనామిక అంటే.. అదే బేబీ మనకు కావాల్సింది అని శైలు అంటుంది. కాకపోతే మిగిలినవాళ్లు కావ్యకు సపోర్ట్ చేస్తున్నారు. అవును డాడ్.. ఇప్పుడు వెళ్లి అందరి ముందూ కావ్యకు సారీ చెప్తాను. ఇప్పటివరకూ మీరు చెప్పింది చేశాను. ఇకపై నేను అనుకున్నది చేస్తాను. అందరూ నన్ను మంచిదాన్ని అనుకుంటారు. అది చెడ్డది అవ్వాలి.. కానీ నా వల్ల అయినట్టు ఉండకూడదు. అయ్యేలా చేస్తాను.. అని అనామిక అంటుంది.
సింపతీ డ్రామా మొదలు పెట్టి.. కావ్యను లాక్ చేసిన అనామిక..
హాలులో అందరూ కాఫీ తాగుతూ ఉంటారు. కావ్య పని చేసుకుని పైకి వెళ్తుంది. కావ్యని ఆపి సారీ చెప్తుంది అనామిక. నువ్వు నన్ను క్షమిస్తేనే కళ్యాణ్ భార్యగా నన్ను అంగీకరిస్తాడు. నేను శోభనం గది నుంచి వచ్చేస్తే.. అక్కడితో గొడవ ఆగిపోతుంది అనుకున్నా.. కానీ ఇంత జరుగుతుందని తెలీదని అనామిక అంటుంది. అది విన్న ధాన్య లక్ష్మి.. నువ్వు పెద్ద మనసుతో సారీ చెప్తే అర్థం చేసుకునే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరు అని అంటుంది. దానికి ఎగ్జాంపుల్ నువ్వే కదా అని ప్రకాశం అంటాడు. ఇన్నాళ్లకు దుగ్గిరాల ఇంటికి కరెక్ట్ కోడలు వచ్చిందని అపర్ణ అంటే.. అంటే ఇంతకు ముందు వచ్చిన కోడళ్లు కాదనే కదా అని స్వప్న అంటుంది. అదే కదా అర్థం అని అపర్ణ అంటుంది. మరి మా కంటే ముందు వచ్చిన మీరిద్దరూ కోడళ్లుగా అడుగు పెట్టారు అంటే మీరూ అంతేనా అని స్వప్న అంటే.. ఏయ్ ఏమంటున్నావ్ అని అపర్ణ లేస్తుంది. అర్థం అదే కదా.. అని స్వప్న పంచ్ ఇస్తుంది.
నా జోక్యం ఇక ఉండదని చెప్పేసిన కావ్య..
చూడండి ఇప్పటివరకూ జరిగిన చర్చ అనవసరం. నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. కవి గారూ మీకు కూడా.. నా గురించి కానీ.. అప్పూ గురించి కానీ.. ఈ ఇంట్లో ఎవరూ మాట్లాడుకునే అవకాశం ఇవ్వొద్దు. ఎందులోకీ మమ్మల్ని లాగొద్దు. ఈ రోజు నుంచి అనామికకు సంబంధించిన ఏ విషయంలోనూ నా జోక్యం ఉండదు అని చెప్పి వెళ్లి పోతుంది కావ్య. దీంతో లోలోపల సంతోష పడుతుంది అనామిక.
పట్టుదలతో ఉన్న అప్పూ..
ఈ సీన్ కట్ చేస్తే.. కనకం, కృష్ణ మూర్తులు పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడే బెడ్ పై నుంచి లేస్తుంది అప్పూ. అది చూసి అంతా షాక్ అవుతారు. అప్పూ మెల్లిగా నడుచుకుంటూ వస్తూ పడబోతుంది. అప్పుడే అందరూ వెళ్లి పట్టుకుంటారు. వద్దు ఎవరూ రాకండి.. నేను నడవగలను అని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు నడవడం అవసరమా.. నేను పట్టుకుంటా.. ఏంటక్కా ఇది.. తగిలిన చోటే దెబ్బ తగిలితే మళ్లీ తట్టుకోలేవే అని కనకం అంటుంది. అవసరమే.. నేను నడవగలను.. రేపు పరిగెత్తుతా.. ఎల్లుండి సైకిల్ తొక్కుతా అని అప్పూ అంటుంది. నువ్వు ఎప్పుడు మా మాట విన్నావే.. మగరాయుడిలా పెరుగుతావ్ అనుకుంటే చివరికి ఆడ పిల్ల అయిపోయావ్.. నీకూ మాకూ ఈ నరకం ఉండేది కాదని కనకం అంటుంది. నువ్వు ఎందుకు మళ్లీ ఆ పాత గాయాన్నే గుర్తు చేస్తావ్ అని అప్పూ అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.