AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధితులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేసింది. ఈ ఘటన తరువాత, సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గాయపడిన భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 52 మందికి ఈ అవకాశం కల్పించారు.

Tirumala: తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం
Tirupati Stampede Victims
Ram Naramaneni
|

Updated on: Jan 10, 2025 | 1:12 PM

Share

తిరుపతి తొక్కిసలాట బాధితులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించారు అధికారులు. సీఎం ఆదేశాల మేరకు క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ. తొక్కిసలాటలో గాయపడి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వారందరికీ ఈ అవకాశం కల్పించారు. తొక్కిసలాట బాధితులతోపాటు వాళ్ల కుటుంబసభ్యులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ.  మొత్తం 52మందికి వైకుంఠ ద్వార ప్రత్యేక దర్శనం కల్పించారు.  సీఎం చంద్రబాబు, మంత్రుల పరామర్శ సమయంలో ఇదే కోరుకున్నారు తిరుపతి తొక్కిసలాట బాధితులు.  తమకు వైకుంఠ ద్వార దర్శనం చేయించి.. ఇంటికి పంపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వారికి ఆ వెసులుబాటు కల్పించారు. క్షతగాత్రులు కోరిన మేరకు మొత్తం 52మందికి ప్రత్యేక దర్శనం చేయించారు టీటీడీ అధికారులు.

తిరుపతి స్విమ్స్‌లో ఇంకా 16మంది తొక్కిసలాట బాధితులకు చికిత్స కొనసాగుతోంది. క్షతగాత్రుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. డిశ్చార్జ్‌ అయిన 33మందికి 2లక్షల రూపాయల చొప్పున పరిహారం అంజేయనున్నారు. బాధితులను ఇంటికి చేర్చే బాధ్యతను కూడా  ప్రభుత్వమే తీసుకుంది.

మరోవైపు తిరుపతి తొక్కిసలాటలో మరణించిన భక్తుల మృతదేహాలను వాళ్లవాళ్ల స్వస్థలాలకు తరలిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత డెడ్‌బాడీస్‌ను కుటుంబసభ్యులకు అప్పగించారు అధికారులు. తిరుపతి తొక్కిసలాటలో ఉమ్మడి విశాఖకి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.  నలుగురిలో లావణ్య, శాంతి, రజనీది విశాఖకాగా.. నాయుడుబాబుది నర్సీపట్నం. నలుగురి మృతదేహాలనూ.. వాళ్ల స్వగృహాలకు తరలించారు. మృతదేహాలు చూసి  కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

కాగా తిరుమలలో శుక్రవారం టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం కానుంది.  తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనుంది. సాయంత్రానికి పరిహారం చెక్కులు అందించే యోచనలో ఉంది టీటీడీ బోర్డు. వైకుంఠ దర్శనాలు మూడురోజులకే పరిమితం చేయాలా.. మిగిలిన వారం రోజులకు టికెట్లు ఇవ్వాలా? అన్న అంశంపై అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

పండుగ తర్వాత కూడా తగ్గని చికెన్ ధరలు.. మళ్లీ షాక్..
పండుగ తర్వాత కూడా తగ్గని చికెన్ ధరలు.. మళ్లీ షాక్..
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి