Brahmamudi, January 10th Episode: కావ్యే టార్గెట్‌గా రుద్రాణి ప్లాన్.. టెన్షన్‌లో రాజ్!
స్వప్న సీమంతం చేయడానికి రుద్రాణి ప్లాన్ సిద్ధం చేస్తుంది. అందుకు కావ్య కూడా ఒప్పుకుంటుంది. దీంతో రాజ్ టెన్షన్ పడతాడు. ఇప్పుడు అంత డబ్బు ఎలా తీసుకొస్తావని అడుగుతాడు. నేను మరో ప్లాన్ వేశానని కావ్య అంటుంది. కనకం ఇంటికి వెళ్లి.. స్వప్న అక్క సీమంతం ఇక్కడ చేయాలని అడుగుతుంది. అందుకు కనకం కూడా ఒప్పుకుంటుంది..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. స్వప్న సీమంతాన్ని ఎంతో ఆర్భాటంగా చేయాలని.. రిటర్న్ గిఫ్ట్స్‌గా వెండి కుంకుమ భరిణెలు, రకరకాల పిండి వంటలు ఉండాలి అంటూ పెద్ద లిప్ట్ చెబుతుంది రుద్రాణి. దీంతో కావ్య, రాజ్‌లు టెన్షన్ పడతారు. నాకు సీమంతం అంటే ఎవ్వరైనా వస్తారని స్వప్న సంతోష పడుతుంది. సీమంతం జరగాలని మనం అనుకుంటే సరిపోదు.. అనుకునే వాళ్లు అనుకోవాలని ప్రకాశం అంటే.. అబ్బా మన పెళ్లైన ఇన్నాళ్లకు సత్యం చెప్పారు. ఇప్పటికైనా కళ్లు తెరుచుకున్నాయని ధాన్యలక్ష్మి అంటుంది. ఇప్పుడు ఇంత గ్రాండ్‌గా చేయడం అవసరమా.. బారసాల ఎలాగో గ్రాండ్‌గా చేస్తాం కదా అని రాజ్ అంటే.. అదేం కుదరదు.. అందరూ రావాల్సిందేనని రుద్రాణి పట్టుబడుతుంది. ఏం కావ్యా నువ్వు ఏం మాట్లాడటం లేదని అడిగితే.. మా అక్క సీమంతం జరుగుతుంది అంటే నాకూ సంతోషమే కదా.. నేనెందుకు అడ్డు పడతానని కావ్య అంటుంది. ఇక పంతులు ముహూర్తం పెడతాడు. కావ్యని గదిలోకి తీసుకెళ్తాడు రాజ్.
రాజ్ బాధ..
మా అత్త కోరిన కోర్కెలను తీర్చడానికి ఒప్పుకున్నావేంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ చేయగలమా అని రాజ్ అంటే.. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు చేయను అంటే.. నన్ను అందరూ ఆడుకుంటారు. దీంతో అసలు విషయం బయట పడుతుందని కావ్య అంటుంది. మన శక్తికి మించి ఖర్చు చేయాలంటే ఎలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తామని రాజ్ కంగారు పడతాడు. మీ అత్తగారి ప్లాన్ నీకు తెలీడం లేదా? అందరి ముందు బ్యాడ్ చేయాలని మీ అత్త ప్లాన్. కావాల్సినంత గొడవ చేస్తారు. అందుకే మీ అత్త ఈ ప్లాన్ వేసిందని కావ్య అంటే.. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావ్? అని రాజ్ అంటే.. తీసుకొచ్చేదే లేదు.. నేను ఇంకో ప్లాన్ వేశానని కావ్య అంటుంది.
కావ్యే టార్గెట్‌గా రుద్రాణి ప్లాన్..
మరోవైపు ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్తుంది రుద్రాణి. ఏంటి సడెన్‌గా కోడలి మీద ప్రేమ పుట్టుకొచ్చింది? అని ధాన్యలక్ష్మి అంటే.. ప్రేమా లేదు.. దోమా లేదు.. ఇది కూడా నీ కోసమే అని రుద్రాణి అంటే.. సీమంతం చేసేది నువ్వు.. చేయించుకునేది నీ కోడలు.. మధ్యలో నాకేంటి? అని ధాన్యలక్ష్మి అంటే.. ఆ కావ్య అందరికీ ఒక న్యాయం.. వాళ్ల అక్కకి మాత్రం మరొక న్యాయం అంటుందని చెప్పాలి. మనకు ఫుడ్, కార్లు అన్నీ కట్ చేసి.. అక్కకి మాత్రం ఇంత ఖర్చు పెట్టి సీమంతం చేస్తుందా? ఇదే పాయింట్ నేను హైలెట్ చేసి.. కావాలనే చేస్తానని అంటుంది. ఖర్చు లేకుండా సింపుల్‌గా చేద్దామంటే అప్పుడు ఏం చేస్తావు? అని ధాన్యలక్ష్మి అంటే.. సింపుల్ ఏముంది? తను డబ్బు మనిషి అని, డబ్బులు అంతా దాచుకుంటుందని రివర్స్ అయిపోవచ్చు. కాబట్టి నువ్వు, ప్రకాశం అన్నయ్య ఇద్దరూ జత కడితే ఆ కావ్యని మరింతగా ఆడుకోవచ్చని రుద్రాణి అంటుంది. దీనికి ధాన్యలక్ష్మి కూడా సై అంటుంది.
కళ్యాణ్‌కు లిరిక్ లక్ష్మీ వార్నింగ్..
మరోవైపు కళ్యాణ్ ఆస్పత్రిలో ఉంటాడు. అప్పుడు లిరిక్ లక్ష్మీ ఫోన్ చేస్తాడు. కళ్యాణ్ ఫోన్ ఎత్తకుండా ఆలోచిస్తాడు. నమస్కారం సర్ అని అంటాడు. అసలు నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావ్ అయ్యా? అవకాశం కావాలని కాళ్లా వేళ్లా పడతారు. పోనీలే అని అవకాశం ఇవ్వడం నా తప్పు. ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని లిరిక్ లక్ష్మీ ఫైర్ అవుతాడు. సారీ సర్ మా తాతయ్య గారు కోమాలో ఉన్నాను. ఆయన దగ్గరే ఉన్నానని కళ్యాణ్ అంటే.. పాటలే కాదు.. మాటలు కూడా నేర్చావు.. నీ లాంటి వాడికి అవకాశం ఇచ్చినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఆ ప్రొడ్యూసర్ వాళ్లు నా తల అంటుతున్నాడు చెప్పు ఏం చేయమంటావ్? అని లిరిక్ లక్ష్మీ అంటే.. సర్ నాకు కొంచెం సమయం ఇవ్వమని కళ్యాణ్ అంటే.. ఏదో ఒకటి చేయి.. నాకు సాయంత్రం వరకు పాట ఇవ్వమని లిరిక్ లక్ష్మీ అంటే.. సరే అని అంటాడు కళ్యాణ్.
కనకం సహాయం కోరిన కావ్య..
కనకం ఇంటికి వస్తుంది కావ్య. కావ్యని చూసి కనకం షాక్ అవుతుంది. ఇదేంటి ఇప్పుడు వచ్చింది అంటూ కళ్లు తిరిగి పడిబోతుంది కనకం. వెళ్లి కనకాన్ని పట్టుకుని.. ఏమైందే ఎందుకు కంగారు పడుతున్నావ్ అని కావ్య అడిగితే.. నీ కోసమే.. నువ్వు ఇంటికి వచ్చావంటే ఏ చేధు వార్త మోసుకొచ్చావని అర్థం. ఈసారి బ్యాగ్ కూడా లేకుండా వచ్చావు? కట్టుబట్టలతోనే తరిమేశారా అల్లుడు గారు? అని అడుగుతుంది. ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని కనకం అడుగుతుంది. నేను శుభవార్త చెప్పడానికి వచ్చానని కావ్య అంటే.. శుభవార్త అంటే ఇదేనా అని కడుపు పట్టుకుంటుంది కనకం. అదేం లేదు మేము కలిసి ఉంటున్నాం అంతే.. కాపురం చేయడం లేదు. స్వప్న అక్కకి సీమంతం చేయాలని మా ఇంట్లో వాళ్లు అనుకుంటున్నారని కావ్య అంటే.. కనకం సంతోష పడి తెగ హైరానా పడుతుంది.
రుద్రాణికి చెక్ ఇచ్చి.. చెక్ పెట్టిన కావ్య..
నేను చెప్పేది పూర్తిగా విను. ఆ సీమంతం అక్కడ కాదు.. ఇక్కడ జరగాలి.. అది కూడా నువ్వే చేయాలని కావ్య అంటే.. అదేంటే సీమంతం అత్తారింట్లో కదా చేస్తారని కనకం అంటుంది. కానీ ఇప్పుడు అక్కడ చేయడం కరెక్ట్ కాదు.. నువ్వు వచ్చి మా అత్తారింట్లో అందర్నీ ఒప్పించాలని కావ్య అంటే.. అదే ఎందుకు? అని కనకం అడుగుతుంది. అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుందని కావ్య అంటుంది. మన గురించి తెలిసి కూడా ఇక్కడే ఎందుకు చేయమంటున్నావు ఎందుకు? అని కనకం అంటే.. నన్ను ఏమీ అడగొద్దు అమ్మా నేను చెప్పినట్టు చేయి. నువ్వు సీమంతం ఇక్కడ చేస్తే నాకు మేలు జరుగుతుందని కావ్య అంటుంది. సరే నువ్వు చెబుతున్నావు కదా చేస్తానని కనకం మాట ఇస్తుంది. సరే అని ఊపిరి పీల్చుకుంటుంది కావ్య. మరోవైపు రుద్రాణి.. ఫుడ్ 5 స్టార్ హోటల్ నుంచి తెప్పించాలి.. అది అలా చేయాలి.. ఇలా చేయాలి అంటూ లిస్ట్ రెడీ చేస్తుంది. మొత్తం 20 లక్షల వరకు బడ్జెట్ వేస్తారు. అది తీసుకెళ్లి కావ్య చేతికి ఇస్తుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌లో రుద్రాణికి చెక్ పెడుతుంది కావ్య.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..