బ్లాక్ శారీ లో ఎస్త‌ర్.. బొమ్మ అదిరిందయ్యా 

Phani CH

10 January 2025

Credit: Instagram

ఎస్త‌ర్ నోరోన్హా ఈ పేరు వినడానికి కొత్తగా ఉండచ్చు కానీ  ఆమెను చూస్తే ఇట్టే గుర్తుపడతారు. ఈ అమ్మడు కన్నడ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది.

దర్శకుడు తేజ తెరకెక్కించిన 1000 అబద్దాలు (2013) లో నటించింది ఎస్త‌ర్. సునీల్ సరసన భీమవరం బుల్లోడు చిత్రాల్లో నటించింది ఎస్త‌ర్.

అలాగే సినిమాలో నటిస్తూనే, నిర్మాతగానే కాకుండా, దర్శకత్వం, రచన, నేపధ్యగానం, సంగీతం ఇలా అన్ని రంగాల్లో తన ప్రతిభని చూపింది ఎస్తర్.

అలాగే చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుంది ఈ చిన్నది ఇటీవలే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాలో నటించింది.

ఈ చిన్నదానికి తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆమె బోల్డ్ రోల్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.

2019 జనవరిలో గాయకుడు మరియు రాపర్ నోయెల్ సీన్‌ను వివాహం చేసుకుంది ఈ చిన్నది. కానీ ఈ ఇద్దరూ ఒక ఏడాదిలోనే విడిపోయారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్త‌ర్ నోరోన్హా ఆసక్తికర కామెంట్స్ చేసింది. రెండో పెళ్లి గురించి ఎస్త‌ర్ నోరోన్హా షాకింగ్ కామెంట్స్ చేసింది.