Brahmamudi, November 13th episode: దుగ్గిరాల ఫ్యామిలీకి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్.. వీలునామాలో ఏముందో తెలుసుకున్న రుద్రాణి!

ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో అనామిక అలుగుతుంది. అనామిక మాట్లాడటం లేదని.. కళ్యాణ్ మాటల్లో పెట్టి మాట్లాడిస్తాడు. అయినా అనామిక ఫైర్ గా ఉంటుంది. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు గానీ.. అప్పూ ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేశావు.. అయినా నువ్వు చెప్పిన ఆ కారణమే నాకు మరింత బాధను కలిగిస్తుంది. అప్పూ అర్థం చేసుకున్నంత కూడా నేను అర్థం చేసుకోలేనా.. తను కేవలం నీ ఫ్రెండ్ మాత్రమే. కానీ నేను నీ మనసుకు తెలిసినదాన్ని. జీవితాన్ని పంచుకోవాలని అనుకున్న దాన్ని అని అనామిక అంటే.. నేను కాదన్నానా..

Brahmamudi, November 13th episode: దుగ్గిరాల ఫ్యామిలీకి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్.. వీలునామాలో ఏముందో తెలుసుకున్న రుద్రాణి!
brahmaudi
Follow us
Chinni Enni

|

Updated on: Nov 13, 2023 | 10:51 AM

ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో అనామిక అలుగుతుంది. అనామిక మాట్లాడటం లేదని.. కళ్యాణ్ మాటల్లో పెట్టి మాట్లాడిస్తాడు. అయినా అనామిక ఫైర్ గా ఉంటుంది. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు గానీ.. అప్పూ ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేశావు.. అయినా నువ్వు చెప్పిన ఆ కారణమే నాకు మరింత బాధను కలిగిస్తుంది. అప్పూ అర్థం చేసుకున్నంత కూడా నేను అర్థం చేసుకోలేనా.. తను కేవలం నీ ఫ్రెండ్ మాత్రమే. కానీ నేను నీ మనసుకు తెలిసినదాన్ని. జీవితాన్ని పంచుకోవాలని అనుకున్న దాన్ని అని అనామిక అంటే.. నేను కాదన్నానా.. అని కళ్యాణ్ అంటాడు. నాకు కారణాలు వద్దు.. నువ్వు నాకు మాత్రమే సొంతం.. ఎవర్ని ఎక్కువ చూసినా తట్టుకోలేను. నీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నాకు చెప్పు నేను అర్థం చేసుకుంటానని అనామిక అంటే.. కళ్యాణ్ నవ్వుతాడు. మనల్ని మనకంటే ఎక్కువ ఎవరైనా ప్రేమించి ఉంటారంటే అది అమ్మ మాత్రమే. కానీ ఈ రోజు అదే ప్రేమ నీలో చూస్తున్నా అని కళ్యాణ్ అంటాడు. ఆ ప్రేమ నీలో కూడా చూడాలి అని అనామిక అంటే.. ఏ కనిపించడం లేదా అని కళ్యాణ్ అంటాడు. కనిపిస్తుంది కానీ అప్పూ విషయం రాగానే ముందు తన వైపు వెళ్తున్నావ్ అని అనామిక అంటుంది. నేను ఎవరి దగ్గరికీ వెళ్లను.. ఎక్కడికి వెళ్లినా తిరిగి నీ దగ్గరకే వచ్చి ఆగుతాను అని కళ్యాణ్ అంటాడు. ఇక ఆ తర్వాత పెళ్లి గురించి అడుగుతుంది అనామిక. దీనికి సైటర్స్ వేస్తుంది అనామిక.

వీలునామాలో ఏ ముందో తెలుసుకోవాలని ఆతృతలో రుద్రాణి, రాహుల్:

ఈ సీన్ కట్ చేస్తే.. సమయానికి రాజ్ వచ్చి మొత్తం చెడగొట్టాడని ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతుంది రుద్రాణి. నిజంగానే నాన్న నా పేరు మీద ఆస్తి రాశారా.. ఎలా తెలుస్తుంది. నాన్న రాసిన ఆ వీలునామా తిరిగి అతికిస్తే ఏం రాసి ఉందో తెలుస్తుంది కదా అని రుద్రాణి అనుకుంటుంది. రాజ్ చింపేసిన ఆ వీలునామా పేపర్స్ కోసం కిందకు వస్తుంది. ఈలోపు పని మనిషి వచ్చి ఆ ఇంటిని ఊడ్చి.. చెత్త పారేస్తుంది. ఇది గమనించిన రుద్రాణి.. ఆ పేపర్స్ తీసుకోవాలని కిందకు వెళ్తుంది. చెత్త బుట్టలో పడేసిన పేపర్స్ తీస్తుంది. ఈ లోపు రాహుల్ వచ్చి సూపర్ మామ్ అని అంటాడు. రాహుల్ మాటలకు షాక్ అవుతుంది రుద్రాణి. నీకు కామెడీగా ఉందా.. అని రుద్రాణి అంటే.. అయినా ఈ వేస్ట్ పేపర్స్ అన్నీ ఏం చేసుకుంటావ్ అని రాహుల్ అడుగుతాడు. తాతయ్య రాయించిన వీలునామా. ఆ పేపర్స్ ని మొత్తం అతికించి.. తాతయ్య ఏం రాస్తాడో తెలుస్తుందని రుద్రాణి చెబుతుంది. ఇక రుద్రాణి, రాహుల్ లు ఇద్దరూ కలిసి వీలునామా పేపర్స్ ని అతికిస్తారు.

ఇవి కూడా చదవండి

వీలునామాలో ఏం రాశావు బావా అని పెద్దాయన్ని అడిగిన ఇందిరా దేవి:

ఈలోపు వీలునామా కోసం పెద్దాయన, పెద్దావిడ ఇద్దరూ మాట్లాడుకుంటారు. వీలునామ గురించి ఇంట్లో తెలిస్తే ఎన్ని ఇబ్బందులు వస్తాయో.. నీకు తెలీదా. అయినా వీలునామలో ఏం రాశావ్ బావా అని ఇందిరా దేవి.. సీతా రామయ్యని అడుగుతుంది. ఈ సీన్ కట్ చేస్తే.. మొత్తానికి రాహుల్, రుద్రాణిలు కలిసి.. వీలునామాను అతికించేస్తారు. ఆ తర్వాత అందులో రాసిన తెలుగు చదవడానికి రాహుల్ ఇబ్బంది పడుతూ ఉంటే.. రుద్రాణి తిడుతుంది. ఆ తర్వాత పేపర్స్ తీసుకుని చదువుతుంది రుద్రాణి. ఈలోపు చెప్పు బావా అని పెద్దావిడ అడిగితే.. ప్రస్తుతం ఆస్తులన్నీ నా పేరు మీద ఉన్నాయి కాబట్టి.. అమ్మటానికి.. ఇతరుల పేరు మీద మార్చుకోవడానికి గానీ ఎవ్వరికీ ఎలాంటి హక్కు ఇవ్వడం లేదని సీతా రామయ్య చెబుతాడు. ఈ ఆస్తులు ఎప్పటిలాగే అందరూ అనుభవించాల్సిదేనని ధృవీకరిస్తున్నాను. ఇది వారసత్వ సంపదగా నా ముని మనవళ్లకు చెందుతుంది. ఈ ఉమ్మడి కుటుంబం నుంచి ఎవరు వేరైనా వారికి ఆస్తిలో చిల్లిగవ్వ కూడా చెందదు. ఇప్పటిలాగే ఎప్పటికీ అందరూ ఒకే కుటుంబంలా కలిసి మెలిసి ఉండాలని సీతా రామయ్య వీలునాలో రాస్తాడు. ఇది చదివిన రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. రుద్రాణి అయితే కింద పడి పోతుంది. రాహుల్ నీళ్లు చల్లి లేపుతాడు. ముసలోడు చచ్చే ముందు కూడా నా నోట్లో మట్టి కొట్టాడని ఇద్దరూ ఫీల్ అవుతారు. ఆ వీలునామా పేపర్స్ ని దాచి పెట్టమని రాహుల్ కి చెబుతుంది రుద్రాణి. ఆ తర్వాత ఏడుస్తుంది.

దుగ్గిరాల ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. ఇండియాకి వచ్చిన డాక్టర్:

రాజ్ కి ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది అపర్ణ. ఫోన్ లో రాజ్ ఫ్రెండ్ మాట్లాడుతూ.. డాక్టర్ వస్తున్నారని చెబుతాడు. ఆ తర్వాత ఏమైందని అపర్ణ అడిగితే.. లండన్ లో క్యాన్సర్ ని నయం చేయడంలో స్పెష్పలిస్ట్ డాక్టర్.. ఇండియాకి వస్తున్నారని చెబుతాడు రాజ్. దీంతో అపర్ణ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇంట్లోని వారందర్నీ పిలిచి డాక్టర్ విషయం చెబుతుంది అపర్ణ. దీంతో అందరూ ఎంతో సంతోష పడతారు. ఇక ఎప్పటిలాగే రుద్రాణి నోరు జారుతుంది. దీంతో అపర్ణ, ధాన్య లక్ష్మి అందరూ ఒకరి తర్వాత మరొకరు చివాట్లు పెడతారు. ఈలోపే డాక్టర్ భరద్వాజ్ వస్తారు. ఈలోపు కావ్య వెళ్లి రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇస్తుంది. డాక్టర్ ఏం చెబుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లోని వాళ్లు. రిపోర్ట్స్ చూసిన డాక్టర్.. సీతా రామయ్యని తీసుకు రమ్మంటాడు. పెద్దాయనను తీసుకొస్తుంది ఇందిరా దేవి. సీతా రామయ్యని చూసిన డాక్టర్ భరద్వాజ్.. క్రిటికల్ కండీషనే కానీ మీ తాతయ్య గారు జబ్బుకు లొంగే మనిషి కాదు. ట్రీట్మెంట్ గురించి నాకు వదిలేయండి. ఆయనకు ఏం కాకుండా నేను కాపాడతానని డాక్టర్ చెప్పగానే అందరూ సంతోష పడతారు. మీరందరూ ఆయన్ని సంతోషంగా చూసుకోవాలని డాక్టర్ చెప్తాడు. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.