Bigg Boss 7 Telugu: శివాజీ అండ చూసుకొని రెచ్చిపోయిన రతికా.. నామినేషన్స్‌లో రచ్చ రచ్చ
ఈ ప్రోమోలో ముందుగా కెప్టెన్ శివాజీ రతికాకు సలహాలు సూచనలు ఇస్తూ కనిపించాడు. నామినేషన్స్ లో ఎలా ఉండాలో ఎలా నామినేట్ చేయాలో రతికాకు చెప్పాడు శివాజీ. "నువ్వేమనుకుంటావో నాకు తెలియదు.. నామినేషన్స్ లో నీ టాలెంట్ చూపించు. ఆలోచించుకొని అవతలి వాడు నిన్ను డిఫెండ్ చేసేటప్పుడు నిన్ను ప్రశ్నించే పరిస్థితి రాకుండా చూసుకో..
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ హంగామా మొదలైంది. సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ముందుగా కెప్టెన్ శివాజీ రతికాకు సలహాలు సూచనలు ఇస్తూ కనిపించాడు. నామినేషన్స్ లో ఎలా ఉండాలో ఎలా నామినేట్ చేయాలో రతికాకు చెప్పాడు శివాజీ. “నువ్వేమనుకుంటావో నాకు తెలియదు.. నామినేషన్స్ లో నీ టాలెంట్ చూపించు. ఆలోచించుకొని అవతలి వాడు నిన్ను డిఫెండ్ చేసేటప్పుడు నిన్ను ప్రశ్నించే పరిస్థితి రాకుండా చూసుకో.. అక్కడి నుంచి మొదలుపెట్టుడితే గేమ్ ఎండ్ వరకు ఆపకు” అని సలహా ఇచ్చాడు. దాంతో రతికా రెచ్చిపోయింది. నామినేషన్స్ మొదలవగానే శోభా శెట్టి పై చిందులేసింది రతికా..
నామినేషన్స్ వేసే వారు నామినేట్ చేసి అందుకు కారణాలు చెప్పి బాటిల్ ను తలపై పగల గొట్టాలని చెప్పాడు. దాంతో ముందుగా రతికా శోభా శెట్టిని, ప్రియాంకను టార్గెట్ చేసింది. శోభా శెట్టిని నామినేట్ చేస్తూ క్యాప్టెన్ అయిన తర్వాతిహా నువ్వు ఎంతవరకు నీ 100 పర్సెంట్ ఇచ్చావ్ అని అడిగింది రతికా.. దానికి శోభా నేను 200 పర్సెంట్ ఇచ్చా అని చెప్పింది. ఆతర్వాత నువ్వే ఎం చేశావో చెప్పు అని రతికా అడగటంతో శోభా ఎదో చెప్పేలోగానే నోరు పెంచి అరిచి గోల చేసింది. క్యాప్టెన్ అంటే బ్యాడ్జ్ పెట్టుకోవడం కాదు అంటూ రాక్ చేసింది.
ఆతర్వాత అర్జున్ కూడా శోభా శెట్టిని నామినేట్ చేసి నువ్వు కిచన్ లో ఉన్నావా అని ప్రశ్నించాడు.? అసలు వీఐపీ రూమ్ దాటి వచ్చావా.? అని అడిగాడు దానికి శోభా ఎదో సమాధానం చెప్తే ఈ తింగర సమాధానాలే వద్దు అని అన్నాడు. ఆతర్వాత అమర్ చాలా వరకు చెప్పిన పనులు ఎవ్వరూ చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఆతర్వాత రతికా ప్రియాంకాను నామినేట్ చేసింది. దానికి రతికా పిచ్చిపట్టిన దానిలా ప్రియంకా ఆన్సర్ టు మై పాయింట్ అంటూ అరిచి గోల చేసింది. మొత్తానికి రతికా శివాజీ అండ చూసుకొని గట్టిగానే రెచ్చిపోయిందని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. ఆతర్వాత అర్జున్ ప్రశాంత్ పై రెచ్చిపోయాడు. ఒక్కసారైన నీ సొంతంగా నామినేషన్ వేశావా.? అని ప్రశ్నించాడు. చివరిలో పుష్ప స్టైల్ లో ప్రశాంత్ ను ఇమిటేట్ చేశాడు అర్జున్.
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..