Brahmamudi, December 29th episode: కావ్యకు తెలిసిన అప్పూ ప్రేమ.. అనామిక ఫ్యామిలీ గుట్టు రట్టు!
బ్రహ్మముడి, నువ్వూ నేను ప్రేమ సీరియల్స్ 'మహా సంగ్రామం' ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. గత వారం రోజులుగా సాగుతున్న మహా సంగ్రామం ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. కళ్యాణ్, అనామికల పెళ్లి సందర్భంగా రెండు సీరియల్స్‌కి సంబంధించిన నటులు కలిసి సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్, అనామిక ల హల్దీ ఫంక్షన్, మెహిందీ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా జరిగాయి. ఆ తర్వాత పెళ్లిలో గాజులు వేసుకునే సంప్రదాయం కూడా బాగానే..

బ్రహ్మముడి, నువ్వూ నేను ప్రేమ సీరియల్స్ ‘మహా సంగ్రామం’ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. గత వారం రోజులుగా సాగుతున్న మహా సంగ్రామం ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. కళ్యాణ్, అనామికల పెళ్లి సందర్భంగా రెండు సీరియల్స్‌కి సంబంధించిన నటులు కలిసి సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్, అనామిక ల హల్దీ ఫంక్షన్, మెహిందీ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా జరిగాయి. ఆ తర్వాత పెళ్లిలో గాజులు వేసుకునే సంప్రదాయం కూడా బాగానే ముగిసింది. ఇక చివరిగా సంగీత్ ఫంక్షన్ లో మాత్రం రచ్చ జరుగుతుందేమోనన్న సస్పెన్స్ కొనసాగుతుంది.
ఈ సస్పెన్స్‌లు చూస్తుంటే కళ్యాణ్ – అనామికల పెళ్లి ఎలా జరుగుతుందో.. అసలు జరుగుతుందో లేదో అన్న టెన్షన్ నెలకొంది. ఒక వైపు కళ్యాణ్.. అనామికను ఇష్ట పడుతూ పెళ్లికి సిద్ధమయ్యాడు. మరోవైపు అప్పూపై ప్రేమను కూడా చూపిస్తున్నాడు. దీంతో అనామికను కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాలి. ఇక నాలుగు రోజుల నుంచి ఎపిసోడ్స్‌ని రివీల్ చేయకుండా ప్రేక్షకులను సస్పెన్స్‌లో ఉంచుతున్నారు.
కావ్యకు తెలిసిన అప్పూ ప్రేమ విషయం..
ఎలాగోలా అప్పూ ప్రేమ విషయం కళ్యాణ్ కి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు బంటి. కళ్యాణ్ అసలు విషయం తెలీకూడదని బంటీకి వార్నింగ్ కూడా ఇస్తుంది అప్పూ. అయినా బంటీ పట్టించుకోడు. ఈలోపు కనకానికి ఎదురు పడతాడు బండి. నువ్వేం చేస్తున్నావ్ రా ఇక్కడ అని అడుగుతుంది. అప్పుడే కావ్య, పద్మావతిలు అటు నుంచి వెళ్తారు. అప్పూ అక్క కళ్యాణ్ ని ప్రేమిస్తున్న విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. అది విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.
చివరికి ఏం జరుగుతుందో..
అమ్మా ఏంటి వీడు అనేది.. అప్పూ కళ్యాణ్ ని ప్రేమించడం ఏంటి? అని అడుగుతుంది. అవును కావ్య అని కనకం అంటుంది. ఈ పెళ్లి జరగదు.. అక్క ప్రేమ విషయం ఎలాగైనా కళ్యాణ్ కి తెలియాలనే లెటర్ రాసి పెట్టాను అని చెప్పగానే.. పద్దూ, కావ్య, కనకంలు షాక్ అవుతారు. ఇలా క్షణం క్షణం కళ్యాణ్ పెళ్లిలో ఏం జరుగుతుందో అని ప్రేక్షకులను సస్పెన్స్ లో పెట్టారు.
ఇక నిన్నటి ఎపిసోడ్‌లో..
అరవింద విక్కీని కొట్టగానే.. అక్కడి నుంచి వెళ్లిన విక్కీ బాధ పడతాడు. మరోవైపు విక్కీని కొట్టినందుకు అరవింద కూడా బాధ పడుతూ ఉంటుంది. అరవిందను కావ్య, పద్మావతిలు ఓదార్చుతారు. మురళి చేస్తున్న తప్పులు ఇప్పుడు కాకపోయినా.. తర్వాత అయినా తెలుస్తాయని నువ్వు బాధ పడొద్దని చెప్పి విక్కీని కన్విన్స్ చేస్తాడు రాజ్.
మరోవైపు సుభాష్, నారాయణ, ప్రకాష్, ఆర్యలు కలిసి సీక్రెట్ పార్టీ చేసుకుంటారు. అక్కడికి అనామిక తండ్రితో పాటు మార్వాడీ కూడా వస్తాడు. కూల్ డ్రింక్ అనుకుని మార్వాడీ మందు తాగుతాడు. మందులో నిజం ఎక్కడ చెబుతాడా అని సుబ్రమణ్యం కంగారు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత సంగీత్ వేడుకల్ని గ్రాండ్‌గా చేసే బాధ్య కావ్య, పద్మావతిలు తీసుకుంటారు.
పద్దూకి హెల్ప్ చేయాలని భావించిన కావ్య, స్వప్నలు.. మురళి తాగే డ్రింక్ లో ట్రూత్ సిరప్ కలుపుతారు. ఈ విషయం పద్మావతికి చెప్తే కంగారు పడుతుంది. కానీ మురళి తెలివితే ఆ జ్యూస్ తాగడు. ఇక కావాలనే మురళి యాక్టింగ్ మొదలు పెట్టి.. నేను నీకు ద్రోహం చేశాను.. నేను రాక్షసుడిని అంటూ ఏదో చెప్పాలని ట్రై చేసి.. మందు తాగుతానని చెప్తాడు. ఇక చివరిగా అనామిక, కళ్యాణ్‌లు కలిసి డ్యాన్స్ చేయాలని కావ్య, పద్మావతి అనౌన్స్ చేస్తారు. స్టేజ్ పైకి వచ్చిన కళ్యాణ్.. అప్పూని రమ్మని పిలిస్తే రాదు.
ఇది గమనించిన పద్మావతి.. స్వప్న తగ్గర ట్రూత్ సిరప్ తీసుకుని.. జ్యూస్ లో కలిపి అప్పూకి ఇస్తుంది. అది తాగిన అప్పూ స్టేజ్ పైకి వస్తుంది. అప్పూని చూసిన అనామిక కుళ్లుకుంటుంది. ఇక ముగ్గురూ కలిసి డ్యాన్స్ చేస్తారు. అది చూసి కనకం కంగారు పడి.. పద్మావతిని పిలిచి నిజం చెప్తుంది. దీంతో అప్పూని ఆపడానికి ట్రై చేస్తుంది కనకం. జ్యూస్ మత్తులో కళ్యాణ్ కు ఐలవ్‌యూ చెప్తుంది అప్పూ. అది విన్న అందరూ షాక్ అవుతారు.








