Brahmamudi, December 20th episode: రెండు కోట్లు కొట్టేసేందుకు అనామిక తండ్రి ప్లాన్.. కళ్యాణ్ కంగారు!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. విక్రమాదిత్యను తినమని చెబుతుంది పద్మావతి. కానీ నాకు ఇప్పుడు టైమ్ లేదు తర్వాత తింటాను అని చెప్తాడు విక్రమ్. మీరు టైమ్ కి భోజనం చేయాలి కదా.. ఇలా అయితే ఎలా సారూ రండి అని అంటుంది పద్మావతి. సరే అయితే.. నువ్వు ఈ రోజు మా బాస్ వి కదా.. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అవకాశం మాకు ఉందా అని అడుగుతాడు విక్కీ. నేను మీకు బాస్ అయినా..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. విక్రమాదిత్యను తినమని చెబుతుంది పద్మావతి. కానీ నాకు ఇప్పుడు టైమ్ లేదు తర్వాత తింటాను అని చెప్తాడు విక్రమ్. మీరు టైమ్ కి భోజనం చేయాలి కదా.. ఇలా అయితే ఎలా సారూ రండి అని అంటుంది పద్మావతి. సరే అయితే.. నువ్వు ఈ రోజు మా బాస్ వి కదా.. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అవకాశం మాకు ఉందా అని అడుగుతాడు విక్కీ. నేను మీకు బాస్ అయినా.. నేను మీ భార్యనే.. రండి భోజనం చెప్పి.. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు.
సీతారామయ్య గుండె పోటు.. కళ్యాణ్ లో టెన్షన్..
ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్, అనామికల పెళ్లి గురించి దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు రుద్రాణి పుల్ల విరుపు మాటలు అంటే.. రాజ్ ఏంటిది నా పెళ్లి.. రాహుల్ పెళ్లి లక్ష గొడవల మధ్య జరిగింది. కనీసం కళ్యాణ్ పెళ్లి అయినా ప్రశాంతంగా జరిగేలా చేద్దాం అని రాజ్ అంటే.. అవును రాజ్ చెప్పింది నిజమే అని పెద్దావిడ అంటుంది. ఆ తర్వాత రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది. సరిగ్గా అప్పుడే సీతా రామయ్యకు గుండె పోటు వస్తుంది. గుండెను పట్టుకుంటూ గదికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే పడిపోబోతే.. వచ్చి రాజ్ పట్టుకుంటాడు. ఆ తర్వాత డాక్టర్ కి కాల్ చేస్తాడు రాజ్.
పద్మావతిని విక్కీకి దూరం చేసేందుకు అరవింద ప్లాన్..
ఈలోపు అరవింద.. కంపెనీలోని ఓ వ్యక్తికి ఫైల్ పంపిస్తాడు.. దాని మీద సంతకాలు పెట్టించమంటాడు. పంపిన ఫైల్ పై సంతకం చేయించేందుకు పద్మావతి దగ్గరకు వెళ్తాడు.. ఆ కంపెనీలో పని చేసే వ్యక్తి. ఇప్పుడు మీరే కదా సీఈవో.. సైన్ కావాలని పద్మావతితో ఫైల్ పై సంతకం పెట్టిస్తాడు. అయితే ఈ ఫైల్ మెయిల్ కూడా పెట్టాలి అని చెప్తారు. దీంతో పద్మావతి మెయిల్ పంపించేందుకు పాస్ వర్డ్ టైమ్ చేస్తుంది. అదంతా రికార్డ్ చేసి.. అరవిందకు పంపుతాడు ఆ వ్యక్తి.
పెళ్లి వాయిదా వేసేద్దాం అన్న కళ్యాణ్..
ఇక సీతా రామయ్యను చెక్ చేస్తాడు డాక్టర్. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచీ ఏవేవో ఆటంకాలు వస్తున్నాయి.. కొన్ని రోజులు ఈ పెళ్లి వాయిదా వేద్దామని అనామిక వాళ్లకు చెప్పేస్తానని కళ్యాణ్ బాధతో అంటాడు. వద్దు కవి గారు.. డాక్టర్ చెక్ చేస్తున్నారు కదా.. ముందు రానివ్వండి అని కావ్య అంటే.. లేదు కావ్య మావయ్య గారు ఉన్నట్టుండి కింద పడిపోయారంటే.. నాకేదో కీడు శంకిస్తుందని ధాన్య లక్ష్మి కూడా బాధ పడుతుంది. ఆవేశ పడకు కళ్యాణ్.. అని అపర్ణ, రాజ్ లు అంటాడు. ఆ తర్వాత పెద్దాయనకు ఏమైందో తెలీక కంగారు పడుతుంది ఇందిరా దేవి. డాక్టర్ కు ప్రశ్నలు వేస్తూ విసిగిస్తూ ఉంటుంది. దీంతో డాక్టర్.. బయటకు వెళ్లమని చెప్తాడు. బయటకు వచ్చిన ఇందిరా దేవి కంగారు పడుతుంది.
సంతోషంలో విక్కీ.. పద్మావతిని హగ్ చేసుకుని..
రేయ్ కళ్యాణ్.. ఆ దోషానికి పరిహారం చేశాం కదరా అని పెద్దావిడ అంటుంది. ఇప్పుడు ఆ మొక్క మార్చాం అని తెలిస్తే.. అందరూ వదినని దోషిని చేస్తారు.. నిందిస్తారని కళ్యాణ్ మనసులో అనుకుంటాడు. మరోవైపు ఈ ఒక్క రోజు సీఈవోగా నేను ఉండే టైమ్ అయిపోయి ఉండనుంది. మనం నిజ జీవితంలో కూడా ఒక్కటిగా కలిసి ఉండాలి. ఇకనైనా నా మీద ఆయనకు ప్రేమ కలిగితే చాలు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే.. ఎవరూ కనిపించరు. నెక్ట్స్ ఒక్కసారిగా వచ్చి ఎంప్లాయీస్ కంగ్రాట్స్ చెప్తారు. ఏంటా అని అనుకుంటుంది పద్మావతి. నా డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. కంగ్రాట్స్ అని చెప్తాడు విక్కీ. దీంతో పద్మావతి కూడా సంతోష పడుతుంది.
పెళ్లి ఆపడానికి వీల్లేదు..
ఇక డాక్టర్ చెక్ చేశాక.. సీతా రామయ్యను ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాలని చెప్తాడు. ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాం. వద్దని పెద్దాయన చెప్తాడు. ఈలోపు ఆర్య వచ్చి పద్మావతి చేసిన పని గురించి గొప్పగా పేపర్ లో వేశారని చెప్తాడు. ఈ విషయం తెలియగానే ఇంట్లో సంబర పడతారు. అందరూ పద్మావతిని మెచ్చుకుంటారు. మధ్యలో విక్కీకి నువ్ కరెక్ట్ జోడీ అని కావాలనే అరవింద పుల్ల పెడతాడు. మీ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నంతగా.. ఇంకెవరూ అర్థం చేసుకోలేరు అని అంటాడు. ఇక సీతా రామయ్యకు ఎలాంటి ప్రమాదం లేదని, నీరసం వల్లే ఇలా వచ్చిందని, సంతోషంగా పెళ్లి జరిపించండి అని డాక్టర్ చెప్పి వెళ్లి పోతాడు. ఈ వార్త చెప్పగానే ఇంట్లోని వాళ్లందరూ సంతోష పడతారు. బావా నీకు ఏమీ కాలేదు కదా.. ఎలాంటి సమస్య లేదని ఇందిరా దేవి సంతోష పడుతుంది.
టెంపరోడి టెంపరితనం..
ఆ తర్వాత సీతా రామయ్య మనవడి పెళ్లి ఆపేందుకు వీళ్లేదని చెప్తాడు. ఈ లోపు పద్మావతి విక్కీ దగ్గరకు వెళ్లి.. సీఈవోగా సక్సెస్ అయ్యాను అని చెప్తుంది. అయితే ఇప్పుడు ఏంటి? అని విక్కీ అంటే.. ఒక చిన్న నవ్వు నవ్వి.. ప్రేమతో కంగ్రాట్స్ అని చెప్తే చాలు అని అంటుంది పద్మావతి. ఇంట్లో వాళ్లతో సహా.. బయటి వాళ్లందరూ నిన్ను ఆకాశానికి ఎత్తేశారు కదా.. ఇక నా కంగ్రాట్స్ తో నీకేం సంబంధం ఏముంది. ఇన్నాళ్లూ ఈ కంపెనీని రన్ చేశా. నాకు చేత కానిది.. నువ్వు చేశావని మెచ్చుకోవాలి అంతేనా. ప్రేమ పేరుతో నాకు గాయం చేసి మళ్లీ అదే ప్రేమ పేరుతో దగ్గరకు రావాలి అనుకుంటున్నావ్.. అని కోపంగా అంటాడు విక్రమాదిత్య. మన మధ్య నిజంగానే ఏమీ లేదా అని పద్మావతి అంటే.. ఏమీ లేదని అంటాడు విక్కీ.
తాళి కట్టగానే రెండు కోట్లు కొట్టేసేందుకు అనామిక తండ్రి ప్లాన్..
ఇంకోవైపు పెళ్లి గురించి టెన్షన్ పడతాడు సుబ్రమణ్యం. మీరు కంగారు పడకుండా చేయాల్సిన పని గురించి చూడండి అని అంటుంది శైలు. సరిగ్గా అప్పుడే ఓ మర్వాడీ ఫోన్ చేస్తాడు. మా దగ్గర మీరు రెండు కోట్లు అప్పుగా తీసుకున్నారు. డబ్బులు ఇవ్వమంటే వంకలు చెప్తున్నారు కానీ.. డబ్బులు ఇవ్వడం లేదని అంటాడు. మా అమ్మాయి మెడలో తాళి కట్టిన తర్వాత డబ్బు ఇస్తానని చెప్తాడు సుబ్రమణ్యం. ఇవ్వకపోతే సీతా రామయ్య గారికి మొత్తం చెప్పేస్తా అని బెదిరించి ఫోన్ పెట్టేస్తాడు మార్వాడీ. మన అమ్మాయితో చెప్పింది.. రెండు కోట్లు తీసుకోవాలి అని ప్లాన్ వేస్తారు అనామిక పేరెంట్స్.
రాజ్ కి శ్వేత ఫోన్.. ఇరకాటంలో పడేసిన కావ్య..
ఆ తర్వాత రాజ్ ఫోన్ చేస్తాడు. పెళ్లికి రమ్మని చెప్తాడు రాజ్. అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం రా అని రాజ్ అంటే.. సరేనని చెప్తాడు విక్రమాదిత్య. ఇక కళ్యాణ్ పెళ్లి కోసం రమ్మని చెప్పి.. బట్టలు సర్దమని చెప్తాడు విక్రమ్. కానీ పద్మావతి రానని బెట్టు చేస్తుంది. సరేనని పద్మావతికి రిక్వెస్ట్ చేసి, సారీ, కంగ్రాట్స్ రెండూ చెప్పి ఒప్పిస్తాడు విక్కీ. సరేనని ఒప్పుకుంటుంది పద్మావతి. ఆ తర్వాత కావ్య.. చీరలు సెలెక్ట్ చేసుకుని సర్దుకుంటుంది. ఈ లోపు బట్టలు ఆరేసినవి తీయడానికి వెళ్తుంది కావ్య. సరిగ్గా అప్పుడే శ్వేత.. రాజ్ కి కాల్ చేస్తుంది. రేపు కలుద్దామని చెప్పాను కదా.. గుర్తుకు చేద్దామని కాల్ చేశానని శ్వేత అంటుంది. అయ్యో నాకు కుదరదు అని చెప్తాడు రాజ్. ఈ లోపు మధ్యలో కామెడీ జరుగుతుంది. అప్పుడే శ్వేత ఫోన్ లో నవ్వుతుంది. సరే ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శ్వేత. ఆ తర్వాత ఆ రిసార్ట్ కి వెళ్లి రాజ్ కి షాక్ ఇద్దాం అని అంటుంది శ్వేత.
పద్మావతిని చికాకు పెడుతున్న అరవింద..
ఇక దుగ్గిరాల వారి పెళ్లికి వెళ్లి టెంపరోడి తిక్క కుదర్చాలి అని పద్మావతి అనుకుంటుంది. అక్కడికి వెళ్లాక నాపై ఆయనకి ప్రేమ కలిగేలా చూడాలి అని ఆలోచిస్తుంది. సరిగ్గా అప్పుడే అరవింద వచ్చి అక్కడికి వెళ్లి అన్యోన్యంగా ఉండాలి అనుకుంటున్నారా.. మీరిద్దరూ విడి పోవడం నేను కళ్లారా చూడాలి అని అరవింద అంటే.. పద్మావతి ఆవేశంతో ఊగి పోతుంది. ఛీ నీకు అసలు సిగ్గు లేదా.. అని కొట్టేందుకు చేయి ఎత్తుతుంది పద్మావతి. నీలాంటి వాడిని ఏం చేయాలో అర్థం కావడం లేదు. మూడు నెలల్లో ఆయనకు నేను దగ్గరవుతా.. నిన్ను బయటకు పంపిస్తా.. అని వార్నింగ్ ఇచ్చి వెళ్లి పోతుంది పద్మావతి. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.