Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరారీ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్.. ఇంట్లోనే రైతు బిడ్డ.. వీడియో రిలీజ్
మరోవైపు పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజేష్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని..కేసు నమోదు చేసి కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదని ఆరోపించారు. FIR కాపీ కోసం కుటుంబ సభ్యులు రావాలి అని చెబుతున్నట్లు వివరించారు.FIR కాపీ లేకపోవడంతో బెయిల్‌కు
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఫోన్ స్విఛాఫ్ చేశాడంటూ ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఐతే తాజాగా దీనిపై ప్రశాంత్ రియాక్ట్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ ఇంట్లోనే ఉన్నన్నట్లు వీడియో విడుదల చేశారు. ‘నేను ఊరు విడిచి ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు భారీగా జనాలు వచ్చారు. పోలీసుల హెచ్చరికలు నాకు సరిగ్గా వినబడలేదు’ అని తన వీడియోలో చెప్పుకొచ్చాడు రైతు బిడ్డ. కాగా ప్రశాంత్‌ప్రశాంత్ ఎక్కడికి వెళ్లలేదని నిన్న అయ్యప్ప పడిపూజకు వెళ్లాడంటున్నారు కుటుంబసభ్యులు. మరోవైపు పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజేష్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని..కేసు నమోదు చేసి కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదని ఆరోపించారు. FIR కాపీ కోసం కుటుంబ సభ్యులు రావాలి అని చెబుతున్నట్లు వివరించారు.FIR కాపీ లేకపోవడంతో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తే తెలుస్తుందన్నారు అడ్వకేట్ రాజేష్ కుమార్.
రైతు బిడ్డపై ప్రతాపమా?
మరోవైపు బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పల్లవి ప్రశాంత్‌పై కేసుల విషయమై స్పందించారు. రైతు బిడ్డ తో పాటు బిగ్ బాస్ మేనేజ్ మెంట్, హోస్ట్ నాగార్జున పై కూడా కేసు నమోదు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ‘బిగ్ బాస్ పాల్గొన్న వారిపై పోలీసులు ప్రతాపం చూపడం సరికాదు. బిగ్ బాస్ నిర్వహణ ఎవరు? హోస్ట్ ఎవరు? బిగ్ బాస్ మేనేజ్ మెంట్, హోస్ట్ నాగార్జునపై కేసులు పెట్టాలి తప్ప.. ఇందులో పాల్గొన్న ఒక రైతు బిడ్డను కేసుల పేరుతో వేధించడం, హింసించడం, ఇబ్బంది పెట్టడం తగదు. ప్రశాంత్ పరారీలోకి వెళ్లిపోయాడు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతను ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది బాధ్యత? తక్షణమే పల్లవి ప్రశాంత్ పై కేసులు ఉపసంహరించుకోవాలి. ఈ విషయాన్ని పోలీస్ డిపార్ట్ మెంట్ బహిరంగంగా ప్రకటించాలి. బాబూ.. ప్రశాంత్ నువ్వెక్కడున్నా సీపీఐ ఆఫీసుకు రా. మేం రక్షణ కల్పిస్తాం’ అని నారాయణ చెప్పుకొచ్చారు.
పల్లవి ప్రశాంత్ రిలీజ్ చేసిన వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.