AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Irani: మళ్లీ బుల్లితెరపై స్మృతి ఇరానీ! స్వయంగా క్లారిటీ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి

కాగా లోకసభ ఎన్నికల్లో భాగంగా అమేధీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు స్మృతి ఇరానీ. అయితే కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్‌ శర్మ చేతిలో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు. ఈక్రమంలోనే స్మృతి మళ్ల నటనవైపు మొగ్గుచూపనున్నారని ప్రచారం జరుగుతోంది.

Smriti Irani: మళ్లీ బుల్లితెరపై స్మృతి ఇరానీ! స్వయంగా క్లారిటీ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి
Smriti Irani
Basha Shek
|

Updated on: Oct 17, 2024 | 9:40 PM

Share

హిందీ సీరియల్స్‌లో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీకి ఎంతో క్రేజ్ ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఆమె నటిగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సీరియల్స్‌లో నటించడం మానేశారు. అయితే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఓడిపోయారు. అందుకే ఆమె మళ్లీ సీరియల్స్‌లో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఐతే ఇది నిజమేనా? కాదా? ఈ విషయంపై స్వయంగా స్మృతి ఇరానీ క్లారిటీ ఇచ్చారు. ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’ సీరియల్ 2000 నుండి 2008 వరకు ప్రసారం ప్రసారమైంది. ఇందులో స్మృతి ఇరానీ కీలక పాత్ర పోషించింది. ఈ ధారావాహికలో స్మృతి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పట్లో ‘క్యుంకీ సాస్‌ భీ కభీ బహు థీ’ అనే సీరియల్‌ కూడా బాగా ప్రేక్షకాదరణ పొందింది. ఈ క్రేజ్ తోనే స్మృతి ఇరానీ 2003లో రాజకీయాల వైపు దృష్టి సారించారు. అయితే గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆమె ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆమె మళ్లీ సీరియల్స్ వైపు మొగ్గు చూపుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై స్పంపదించిన స్మృతి తాను ఏ సీరియల్‌లోనూ నటించనని స్పష్టం చేసింది.

హిందీ సీరియల్ ‘అనుపమ’లో స్మృతి ఇరానీ అతిథి పాత్రలో మెరవనున్నారని ‘టెలీ చక్కర్’ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయబడింది. ఇది స్వయంగా స్మృతి ఇరానీ దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్‌పై స్మృతి ఇరానీ స్పందిస్తూ.. అది తప్పుడు వార్త అని క్లారిటీ ఇచ్చారు. తద్వారాతనపై వస్తోన్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.

ఇవి కూడా చదవండి

దసరా ఉత్సవాల్లో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.