Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్.. షో లాంచింగ్ ఎప్పుడంటే?

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు చాలా మంది ఆడియెన్స్ టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కు పోతారు. అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టీవీ షోకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యింది రియాలిటీ షో. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్.. షో లాంచింగ్ ఎప్పుడంటే?
Big Boss Telugu 8
Follow us
Basha Shek

|

Updated on: Jul 01, 2024 | 6:20 PM

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు చాలా మంది ఆడియెన్స్ టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కు పోతారు. అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టీవీ షోకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యింది రియాలిటీ షో. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి. మరీ ముఖ్యంగా గత సీజన్‌కు రికార్డు స్థాయిలో టీఆర్పీలు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సీజన్ 8 కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారని. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈఏడాది నెట్టింట బాగా వైరలైన వారిని బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ షో స్టార్ట్ అయ్యేవరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బిగ్‏బాస్ లీకులు వస్తుంటూనే ఉంటాయి. అలా ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే నంటూ కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

 అమృతా ప్రణయ్ కూడా..

బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 ఆగస్టు 4న లేదా 11వ తేదీల్లో ప్రారంభం కానుందట. గతంలో లాగే ఈ సారి కూడా వంద రోజుల పాటు బిగ్ బాస్ షో సాగేలా ప్లాన్ చేశారట మేకర్స్. అలాగే సుమారు 20 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగుపెట్టనున్నారట. వీరిలో బర్రెలక్క, హేమ, సురేఖావాణి, హీరో రాజ్ తరుణ్, యాంకర్ రీతూ చౌదరి, కమెడియన్ కిరాక్ ఆర్పీ, కుమారీ ఆంటీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పరువు హత్యతో సంచలనంగా మారిన అమృతా ప్రణయ్ ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరికి తోడు యూట్యూబ్, ఇన్ స్టా వీడియోలతో ఫేమస్ అయిన స్టార్స్ ను హౌజ్ లోకి తీసుకురాబోతున్నారట. కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి

శివాజీ కూడా.. కంటెస్టెంట్ గా కాదండోయ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.