AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ హౌస్‌లో సిరి, షణ్నులది లవ్‌ సిరీస్‌ను తలపిస్తోందా..?

Bigg Boss Telugu 5: సిరి, షణ్నులను చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ ఆట గుర్తొస్తుందని కొంతమంది..! కాదు కాదు వీరి ఎపిసోడ్‌.. మంచి లవ్ సిరీస్‌ను తలపిస్తుందని మరికొంత..

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ హౌస్‌లో సిరి, షణ్నులది లవ్‌ సిరీస్‌ను తలపిస్తోందా..?
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 18, 2021 | 4:56 PM

Share

Bigg Boss Telugu 5: సిరి, షణ్నులను చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ ఆట గుర్తొస్తుందని కొంతమంది..! కాదు కాదు వీరి ఎపిసోడ్‌.. మంచి లవ్ సిరీస్‌ను తలపిస్తుందని మరికొంత మంది…! లేదు లేదు.. వీరి కథ సీరియల్ లా సాగుతుందని ఇంకొంతమంది.! ఇలా ఎన్నో రకాలుగా బయట ఉన్న వాళ్లు అనుకుంటున్నా… అనుకుంటారని అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న వారిద్దరు కూడా అనుకుంటున్నా.. సిరి, షణ్ను కు ఏమాత్రం ఫిఖర్ లేదు. అందుకే వారి పని వారు చేస్తున్నారు. వారి లోకంలో వారు విహరిస్తున్నారు. అలకలు హగ్గులతో.. టైం స్పెండ్ చేస్తున్నారు. ఆవెంటనే కలిసి మెలిసి అల్లరి చేస్తున్నారు… ఈ మధ్యలో గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక రీసెంట్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌ చూపించిన జెర్నీ చూసి ఎమోషనల్‌ అయింది సిరి. ఆ జెర్నీ వీడియోలో చోటు ఎంట్రీ అప్పుడు .. షణ్నును గట్టిగా హగ్ చేసుకున్నప్పుడు… ఆమె మదర్‌ హగ్గుల గురించి మాట్లాడినప్పుడు..! ఈ మూడు సందర్భాల్లో ఎమోషనల్ అయిన సిరి… వాటి తాళూకు ప్రభావాన్ని ఎప్పటిలాగే షణ్నుపై చూపించారు. చూపించడమే కాదు మరో సారి అతడితో గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు.

అర్థరాత్రి గార్డెన్‌ ఏరియాలో.. చలిలో.. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న సిరిని చూసిన షణ్ను… ఏదో మాట్లాడదామని వస్తే.. సిరి మాత్రం షణ్నును పరిచయం లేనివాడిలా బిహేవ్‌ చేసింది. పక్కన కూర్చుందామని జరుగు అంటే ఇక్కడే కూర్చోవాలా… పక్కన ప్లేస్ ఉంది కదా అంటూ మాడిపోయిన మోహం తో చెప్పింది. దీంతో ఫీల్ అయిన షణ్ను ఎప్పటిలాగే గతాన్ని తవ్వి మరీ పాత విషయాలు తీశాడు.

‘ఉన్నదే మూడు నాలుగు రోజులే… ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావ్.. ఎందుకు సీన్ చేస్తున్నావ్ అని షణ్న సిరితో అనగా.. ఆ మాటలు నేను అనాలి.. నా పేరు చింపేశావ్.. నీ పేరు చింపితే నీకు తెలిసేది అంటూ అలిగింది సిరి. దీంతో ‘చాల్లేరా.. అలిగింది’ అని షణ్ను సిరిని ప్లీజ్‌ చేసే ప్రయత్నం చేశాడు. అంతలోనే సిరి ‘అంతా నీ ఇష్టమే..నీకు నచ్చినప్పుడు మాట్లాడతావ్.. నీకు నచ్చినట్టు చేస్తావ్.. కానీ నేను ఇప్పుడు ట్రిప్ లో ఉన్నా.. చిరాకుగా ఉన్నా.. కొత్త కొత్తగా ఉంది అని చెప్పుకొచ్చింది సిరి. దీంతో ఎందుకు అలిగావ్ అని షణ్ముఖ్ అడగ్గానే.. నేను అలగలేదు.. ఆలోచిస్తున్నా అని చెప్పింది సిరి. ఫ్యుచర్ గురించి ఆలోచిస్తున్నావా అని అంటే నా గురించి నీకెందుకు అని అంటుంది సిరి. దీంతో షణ్ముఖ్.. ‘నా ఆలోచనలు చెత్త.. పొసిసివ్ అని అదీ ఇది అని రాస్తున్నారు.. వాటికి నీకేం నొప్పి ఉండదు’ అంటాడు. అప్పుడు సిరి నేను రాశానా.. నాకు తెలుసా అంటూ బదులిచ్చింది సిరి.

నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నానా అని షణ్ను సిరిని అడగ్గా.. నేను కూడా కంట్రోల్ అవుతున్నా అంటే నా తప్పు కూడా ఉంది అంటూ బదులిచ్చింది సిరి. కంట్రోల్ చేయడం.. కంట్రోల్ కావడం రెండూ తప్పేగా అని షణ్ముఖ్ అనగా.. నువ్వు ఇచ్చిన వస్తువును నీ ముందే చింపేస్తే ఎలా ఉంటుంది అని సిరి షణ్నును అడిగింది. దానికి షణ్ను అసలు నువ్వు ఏం ఇచ్చావు అని అడిగాడు. దీంతో నీ పేరు పక్కన నా పేరు రాసుకున్నా.. నువ్వు నా పేరు చింపేశావు.. నా బెడ్ దగ్గర నా పేరు లేదు.. నేను ఎలా ఫీల్ అవుతాను అంటూ ఫీల్ అయ్యింది సిరి.

ఇవి కూడా చదవండి:

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్5 ఫినాలేకు బడా స్టార్స్.. గెస్ట్‌లుగా రాబోతుంది వీళ్లేనా.?

Bigg Boss Telugu 5: ఫైనల్‌కు వేళాయెరా.. బిగ్ బాస్5 విజేత ఆ ఇద్దరిలో ఒకరు అంటున్నారే..