AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Season 6: వచ్చేస్తుంది నాన్‏స్టాప్ ఎంటర్టైన్మెంట్.. బిగ్‏బాస్ 6 టెలికాస్ట్ ఎప్పటినుంచంటే..

ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో, లోగో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక ఇటీవల వచ్చిన బిగ్‏బాస్ ఓటీటీ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను

Bigg Boss Season 6: వచ్చేస్తుంది నాన్‏స్టాప్ ఎంటర్టైన్మెంట్.. బిగ్‏బాస్ 6 టెలికాస్ట్ ఎప్పటినుంచంటే..
Bigg Boss6
Rajitha Chanti
|

Updated on: Aug 17, 2022 | 7:25 AM

Share

బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన అతిపెద్ద రియాల్టి షో బిగ్‏బాస్ (Bigg Boss Season 6). హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఈ షోకు మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటికే తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్‏బాస్.. సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో, లోగో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక ఇటీవల వచ్చిన బిగ్‏బాస్ ఓటీటీ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో బుల్లితెర బిగ్‏బాస్ ప్రియుల కోసం ఈసారి మరిన్ని జాగ్రత్తలు వహించనున్నట్లు తెలుస్తోంది. షో నిర్వహణ, కంటెస్టెంట్స్ ఎంపికపై మరింత శ్రద్ద పెట్టనున్నారట. అయితే ఇప్పటికే ప్రోమోతో మరోసారి హోస్ట్ నాగార్జున అని కాన్ఫార్మ్ చేసిన మేకర్స్..షో స్ట్రీమింగ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ షో టెలికాస్ట్ డేట్ ఇదేనంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

లేటేస్ట్ సమాచారం ప్రకారం బిగ్‏బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుందట. వాస్తవానికి ఆగస్ట్ చివరి వారంలో ప్రారంభం కావాల్సి ఉండగా.. అనుహ్యంగా వాయిదా పడిందని తెలుస్తోంది. అంతేకాదు.. ఈసారి బిగ్‏బాస్ బజ్ హోస్ట్ గా యాంకర్ శివ కనిపించనున్నారని సమాచారం. ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో 10 మంది అమ్మాయిలు.. 9 అబ్బాయిలు ఉండనున్నారట. ముందుగా 15 మందిని ఇంట్లోకి పంపించగా.. మిగతావారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపిస్తారని తెలుస్తోంది. ఇక ఈసారి షోలో యాంకర్ ఉదయభాను, హీరో నందు, యూట్యూబర్ ఆదిరెడ్డి, శ్రీహాన్, గలాటా గీతూ రాయల్, చలాకి చంటి, జబర్థస్త్ అప్పారావు ఉండనున్నారని.. వీరిలో అత్యధిక పారితోషికం యాంకర్ ఉదయభాను తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..