AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: లుంగీతోనే అదరగొట్టేశాడు.. కన్నడ బిగ్ బాస్ విన్నర్‌గా రైతు బిడ్డ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ముగిసింది. సుమారు 120 రోజుల పాటు కొనసాగిన ఈ రియాలిటీ షోకు ఆదివారం (జనవరి 27)తో ఎండ్ కార్డ్ పడింది. 20 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ హనుమంత బిగ్ బాస్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.

Bigg Boss: లుంగీతోనే అదరగొట్టేశాడు.. కన్నడ బిగ్ బాస్ విన్నర్‌గా రైతు బిడ్డ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Bigg Boss Kannada
Basha Shek
|

Updated on: Jan 27, 2025 | 11:33 AM

Share

ఈసారి బిగ్ బాస్ లోకి మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో 19 మందిని కాదని వైల్డ కార్ట్ ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ హనుమంత బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకున్నాడు. కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంత.. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాడు. తన సొంతూరులోనే డిగ్రీ వరకు చదివిన ఆయన సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మంచి గుర్తింపు పొందాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోనూ తన దైన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించాడు. దీనికి తోడు ఆనకేరు హనుమంతరావుకు భారీగా ఓట్లు పడ్డాయి. మొత్తానికి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రజల అభిమానాన్ని చూరగొన్న హనుమంతుడికి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా హనుమంతుడు చాలా కష్టాలు చూశాడు. అతను కొన్ని రియాల్టీ షోలలో కనిపించాడు. అయితే ఎక్కడా విజేతగా నిలవలేదు. కేవలం లుంగీ షర్ట్‌లో కనిపించిన అతను తన సింప్లిసిటీతో బిగ్ బాస్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.

కాగా బిగ్ బాస్ కన్నడ విజేత హనుమంతకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ తో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన త్రివిక్రమ్‌కు రూ. 10 లక్షలు గెలుచుకున్నారు. హనుమంతుడు లుంగీ, చొక్కా ధరించి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. అది కూడా వైల్డ్ కార్డ్ ద్వారా. ఇప్పుడు ఏకంగా కప్పును ఎగరేసుకుపోయాడీ రైతు బిడ్డ. కాగా ‘బిగ్ బాస్’ తర్వాత హనుమంత ‘గర్ల్స్ వర్సెస్ బాయ్స్’ షోకి ఎంపికయ్యారు. దీని షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

హనుమంతును బిగ్ బాస్ విజేతగా ప్రకటిస్తోన్న అద్భుత క్షణాలు.. వీడియో

ఇక తెలుగు బిగ్‌బాస్ 8 విన్నర్‌గా నిలిచిన నిఖిల్ రూ. 55 లక్షల ప్రైజ్‌ మనీతో పాటు ఒక కారు కూడా గెలుచుకున్న విషయం తెలిసింది.

  లుంగీతోనే చరిత్ర సృష్టించాడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి