
బిగ్‌బాస్ తెలుగు 9లోకి సెకండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు సుపరిచితమే. చాలా సంవత్సరాల క్రితం నువ్వు నాకు నచ్చావ్, నరసింహా, చాలా బాగుంది చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా లక్స్ పాప లక్స్ పాప పాటతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. 1999లో విడుదలైన ప్రేమ కోసం సినిమాతో అరంగేట్రం చేసింది. అలాగే వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆశ పాత్రలో కనిపించింది. వెంకటేష్, బాలకృష్ణ, సుదీప్, శివరాజ్‌కుమార్, విజయకాంత్, ప్రభు, కార్తీక్, జగపతి బాబు వంటి హీరోలతో స్క్రీన్ పై షేర్ చేసుకుంది.
చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల స్త్రీ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ చిత్రంలో స్త్రీ అనే టైటిల్ పాత్రను పోషించింది. మీటూ ఉద్యమం సమయంలో తన మాజీ ప్రియుడు గౌరంగ్ దోషి చేతిలో వేధింపులకు గురైంది. అతడు తనను రాత్రంతా కొట్టేవాడని.. తన దవడ సైతం విరగొట్టాడని తెలిపింది. తనకు ఆ సమయంలో తల్లిదండ్రులు మాత్రమే అండగా నిలిచారని చెబుతూ భావోద్వేగానికి గురైంది.
ఇటీవలే ఈ అమ్మడు ఇటీవల రానా నాయుడు సిరీస్ లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. అలాగే చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే నెట్టింట వరుస పోస్టులతో సందడి చేసింది.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?