AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌కు బిగ్ షాక్ ఇచ్చిన హాట్ బ్యూటీ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా

ఈ వారం ఎలిమినేషన్ పూర్తయితే హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగులు తారు. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై అప్పుడే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశా నాలుగో వారం లేదా ఐదో వారంలో మరికొంత మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్ట వచ్చని తెలుస్తోంది. ఇందులో ప్రముఖ బుల్లితెర నటి..

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌కు బిగ్ షాక్ ఇచ్చిన హాట్ బ్యూటీ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా
Bigg Boss 8 Telugu
Basha Shek
|

Updated on: Sep 15, 2024 | 9:01 AM

Share

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభమై రెండు వారాలు పూర్తి కావోస్తోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ లో ఇప్పటికే బేబక్క బయటకు వెళ్లిపోయారు. అలాగే ఈ ఆదివారం (సెప్టెంబర్ 15) మరొకరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించి నామినేషన్స్ లో విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నాగమణికంఠ, శేఖర్‌ భాషా, పృథ్వీరాజ్‌, నిఖిల్‌, సీతా, నైనికా ఉన్నారు. అయితే వీరిలో పృథ్వీ రాజ్, కిర్రాక్ సీత డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం సూట్ కేసు సర్దుకోనున్నారని తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ పూర్తయితే హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగులు తారు. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై అప్పుడే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశా నాలుగో వారం లేదా ఐదో వారంలో మరికొంత మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్ట వచ్చని తెలుస్తోంది. ఇందులో ప్రముఖ బుల్లితెర నటి జ్యోతి రాయ్ అలియాస్ జగతి మేడం పేరు బాగా వినిపిస్తోంది. తెలుగు, కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న జ్యోతి రాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే షో మరింత కలర్ ఫుల్ గా ఉంటుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై జగతి మేడమ్ క్లారిటీ ఇచ్చారట. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం లేదని చెప్పారట. ప్రస్తుతం తాను నాలుగు తెలుగు సినిమాలు చేస్తున్నానని, అందుకే ఏ రియాల్టీ షోకు వెళ్లడం లేదని కరాఖండిగా చెప్పేశారట.

కాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ముందు జ్యోతిరాయ్‌ని సంప్రదించారట నిర్వాహకులు. అయితే అప్పటికే ఆమె తన షూటింగుల్లో బిజీగా ఉండడంతో రెగ్యులర్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి రాలేనన్నారట. తన పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత బాస్ హౌస్ లోకి వస్తానన్నారట. అయితే ఇప్పుడు షూటింగ్స్ పూర్తి కాకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో కూడా హౌస్ లోకి రాలేనంటున్నారట జగతి మేడమ్. మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ముక్కు అవినాశ్, రోహిణీ, శోభా శెట్టి, నయని పావని, హరితేజ వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. మరి వీరిలో ఎవరు వస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

టీవీ షోలో జగతి మేడమ్..

జగతి మేడమ్ లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్
Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్
వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే..
వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే..
ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
వేసవిలో మీ కరివేపాకు మొక్క ఎండిపోతోందా? గుబురుగా పెరగాలంటే ఇలా
వేసవిలో మీ కరివేపాకు మొక్క ఎండిపోతోందా? గుబురుగా పెరగాలంటే ఇలా
నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!
నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!
వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!
వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!
మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..
కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌
ఆ రెండే కాదు.. టెన్త్ తర్వాత మీ ఫ్యూచర్ కోర్సులు
ఆ రెండే కాదు.. టెన్త్ తర్వాత మీ ఫ్యూచర్ కోర్సులు