Bigg Boss 8 Telugu: నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావ్.. యష్మీ ఏడుపు.. సోనియా ఓదార్పు..

ఆ తర్వాత విష్ణును నామినేట్ చేస్తూ నువ్వు గుడ్లు తినేశావ్ అంటూ వింత రీజన్ చెప్పింది. ఐదు గుడ్లు ఉంటే అడక్కుండానే రెండు ఎగ్స్ తినేశావ్ అంటూ రీజన్ చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఆ తర్వాత విష్ణుప్రియ, మణికంఠలను నామినేట్ చేశాడు ఆదిత్య. అలాగే సోనియా, ప్రేరణలను నామినేట్ చేసింది నైనిక.

Bigg Boss 8 Telugu: నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావ్.. యష్మీ ఏడుపు.. సోనియా ఓదార్పు..
Bigg Boss 8
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 17, 2024 | 7:29 AM

హౌస్‏లో మూడో వారం నామినేషన్స్‏లో మణికంఠ, యష్మీ మధ్య హీటెక్కించే డిస్కషన్ నడిచింది. ఇక ఆ తర్వాత నువ్వు గేమ్ కు కావాల్సినదానికంటే ఎక్కువ ఎమోషనల్ అవుతున్నావంటూ సీతను నామినేట్ చేసింది. దీంతో సీత తనను తాను గట్టిగానే డిఫైండ్ చేసుకుంది. ఆ తర్వాత విష్ణును నామినేట్ చేస్తూ నువ్వు గుడ్లు తినేశావ్ అంటూ వింత రీజన్ చెప్పింది. ఐదు గుడ్లు ఉంటే అడక్కుండానే రెండు ఎగ్స్ తినేశావ్ అంటూ రీజన్ చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఆ తర్వాత విష్ణుప్రియ, మణికంఠలను నామినేట్ చేశాడు ఆదిత్య. అలాగే సోనియా, ప్రేరణలను నామినేట్ చేసింది నైనిక. ఇక ఆ తర్వాత మణికంఠను నామినేట్ చేసింది యష్మీ.

సీజన్ మొత్తం నామినేట్ చేస్తా.. హార్ట్ బ్రేక్ చేశావ్..

మణికంఠకు రివెంజ్ నామినేషన్ చేసింది యష్మీ. చాక్లెట్ బాయ్ హౌస్ లో ఎన్ని వారాలు ఉంటానో అన్ని వారాలు నిన్ను నామినేట్ చేస్తాను.. నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావు.. నేను ఫ్రెండ్ షిప్ కు చాలా విలువ ఇస్తాను. అలాంటిది నువ్వు నన్ను మోసం చేశావ్.. నువ్వు ఈ హౌస్ కు చాలా డేంజర్ అనిపిస్తుంది.. అందుకే నామినేట్ చేస్తున్న అంటూ చెప్పింది యష్మీ. దీంతో ఫ్రెండ్ షిప్, గేమ్ వేరు అంటూ కౌంటరిచ్చాడు మణికంఠ. ఆ తర్వాత నైనికను నామినేట్ చేసింది. నబీల్, ప్రేరణ మధ్య ఓ రేంజ్ డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత యష్మీని నామినేట్ చేశాడు నబీల్. ఇక పృథ్వీ.. సీత, నైనికలను నామినేట్ చేశాడు. ఇక నైనిక చీఫ్ గా ఫెయిల్ అయ్యావంటూ నామినేట్ చేసింది సోనియా.

ఇవి కూడా చదవండి

ఇక ఆ తర్వాత యష్మీని నామినేట్ చేస్తూ.. నువ్వు పాజిటివ్ గా ఉంటే బాగుండు.. కానీ ఎప్పుడు నెగిటివ్ గా చేస్తావు.. అది అంతా స్ప్రెడ్ అవుతుంది. నీతోపాటు ఈ హౌస్ కు కూడా చాలా ప్రమాదం అంటూ చెప్పుకొచ్చింది సోనియా. నీకులా నేను గేమ్ లైట్ తీసుకోను.. అంటూ యష్మీ చెప్పగా.. అందుకే టాస్కు ఉందంటే డ్రెస్ ఛేంజ్ చేసుకోని రాలేదు నేను అంటూ కౌంటరిచ్చింది సోనియా. నా డ్రెస్ నా కంఫర్ట్.. మీ కంఫర్ట్ కోసం నేను రాలేదు.. నాకు బుర్రలేదు అంటూ యష్మీ చెప్పింది. మీరు పృథ్వీ, అభయ్, నిఖిల్ మీద చూపించిన ఇంట్రెస్ట్ గేమ్ పై చూపించలేదు.. ఏ గేమ్ లో నేను ఆడతా అంటూ మీరు రాలేదు.. నువ్వు ఆడి చీఫ్ అవ్వు.. అప్పుడు నీకు నామినేట్ చేస్తా అంటూ సీరియస్ అయ్యింది యష్మీ. ఇక తన సీట్లో కూర్చొని ఏడ్చింది. సోనియా చాలా ఫేక్ పర్సన్.. ప్రతి దానికి మా ఇంట్లో అలా పెంచలేదు అంటుంది.. మరి మా ఇంట్లో అలా నేర్పించారా..మినిమం కామన్ సెన్స్ ఉంది.. అంటూ ఏడ్చింది. దీంతో సోనియా వచ్చి హగ్ చేసుకోగా.. వద్దంటూ ఏడ్చింది సోనియా. చివరగా ఇద్దరు చీఫ్స్ లో ఒకరు నేరుగా నామినేట్ కావాలని బిగ్ బాస్ చెప్పగా.. అభయ్ నామినేట్ అయ్యాడు. మొత్తానికి ఈ వారం యష్మీ, ప్రేరణ, మణికంఠ, అభయ్, పృథ్వీ, నైనిక, విష్ణు ప్రియ, సీత నామినేట్ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.