Bigg Boss 7 Telugu: నాలుగు అనుకున్నాడు.. తొమ్మిది వారాలు ఉన్నాడు.. టేస్టీ తేజ ఎంత సంపాదించాడో తెలుసా ?..
మొదటి నాలుగు అసలు తేజ ఉన్నాడా లేడా ? అనేట్లుగా తేజ ఆట తీరు సాగింది. నాలుగో వారం హౌస్ నుంచి రతిక ఎలిమినేట్ కావడం.. ఆ సమయంలో నాగార్జున చివాట్లు పెట్టడంతో తన కామెడీ టైమింగ్తో ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. బుర్రకు పదునుపెట్టే టాస్కులలో అదరగొట్టేశాడు. దీంతో తేజను జీనియస్ అనుకున్నారంత. కానీ అంతకు మించి టాస్కులలో అతని పర్ఫామెన్స్ మాత్రం మిగతా ఇంటి సభ్యుల కంటే తక్కువే.

నాలుగు వారాలు అనుకున్నాను.. కానీ తొమ్మిది వారాలు ఉన్నాను.. చాలు అంటూ ప్రశాంతంగా హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు టేస్టీ తేజ. కేవలం ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రమే టేస్టీ తేజ .. అంతేకానీ టాస్కులలో అంతగా పర్ఫామెన్స్ చూపించింది లేదు. ఇక మొదటి నాలుగు అసలు తేజ ఉన్నాడా లేడా ? అనేట్లుగా తేజ ఆట తీరు సాగింది. నాలుగో వారం హౌస్ నుంచి రతిక ఎలిమినేట్ కావడం.. ఆ సమయంలో నాగార్జున చివాట్లు పెట్టడంతో తన కామెడీ టైమింగ్తో ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. బుర్రకు పదునుపెట్టే టాస్కులలో అదరగొట్టేశాడు. దీంతో తేజను జీనియస్ అనుకున్నారంత. కానీ అంతకు మించి టాస్కులలో అతని పర్ఫామెన్స్ మాత్రం మిగతా ఇంటి సభ్యుల కంటే తక్కువే. అందుకే నాలుగు వారాలు ఉంటాననుకున్నాడట.. కానీ తొమ్మిదివారాల దాకా వచ్చేసి.. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాడు. ఇక ఇంట్లో ఉన్నన్ని రోజులు శోభాశెట్టితో తిరిగడం.. ప్రేమ, పెళ్లీ అంటూ ఆమెకు ప్రపోజ్ చేయడంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ అనే సందేహాలు వచ్చాయి. కానీ శోభా మాత్రం తేజతో స్నేహంగా ఉంటూనే లిమిట్ మెయింటెన్ చేసింది.
ఇక హౌస్ లో ఐరన్ లెగ్ శాస్త్రి అనే పేరును కూడా తేజ సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే.. మొదటి వారం నుంచి ఇప్పటివరకు అతడు నామినేట్ చేసిన వాళ్లు ఖచ్చితంగా హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఎనిమిదో వారం తేజ నామినేట్ చేయడంతో సందీప్ బయటకు వచ్చాడు. ఇక ఇప్పుడు తేజ వంతు అయ్యింది. తేజ చెప్పిన రీజనే అతడికి చెప్పి శివాజీ నామినేట్ చేయగా.. నిన్నటి ఎపిసోడ్ లో తేజ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తెలిసో తెలియకో గేమ్ పరంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి అంటూనే కన్నీళ్లు పెట్టించాడు.
View this post on Instagram
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తేజ రెమ్యూనరేషన్ గురించి వైరలవుతుంది. తొమ్మిది వారాలకు గానూ మొత్తం రూ. 13 లక్షలు తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అంటే వారానికి 1.50 లక్షలు తీసుకున్నాడట. ఇక తేజ ఎలిమినేట్ కావడంతో శోభా శెట్టి బోరున ఏడ్చేసింది. నువ్వు లేకుండా నేనుండలేను.. నీతో ఒక్కరోజు మాట్లాడకపోతేనే ఉండలేకపోయాను… ఇప్పుడు రోజూ ఎలా ఉండాలి.. నువ్వు లేకుండా ఈ ఇంట్లో ఉండాలంటే భయమేస్తుంది అంటూ ఏడ్చేసింది. దీంతో స్టేజ్ పై ఉన్న తేజ సైతం ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




