Bigg Boss 7 Telugu: డాక్టర్ బాబు లొల్లి తెగేలా లేదే.. మళ్లీ మొదలైన శివాజీ, గౌతమ్ పంచాయతీ.. నామినేషన్స్ హీట్..
అమర్ ఫస్ట్ నామినేషన్.. భోలే గారు.. వీక్ కంటెస్టెంట్ అనే పదానికి మీరు రావడం నాకు నచ్చలేదని రీజన్ చెప్పాడు. ఇక భోలే మాట్లాడుతూ.. అక్కడ కొన్ని రాజకీయాలు పులుముకున్నాయని చెప్పగా.. అక్కడ ఎన్ని రాజకీయాలు జరిగిన.. కుట్రలు పన్నిన మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి అంటూ కౌంటరిచ్చాడు అమర్. ఎంత డిఫెండ్ చేయాలనేది నాకు క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు డిఫెండ్ చేయాలి..వాదించాలని చెప్పడానికి నీకెక్కడిదయ్యా హక్కు అంటూ కామెడీ చేశాడు భోలే.

శివాజీ వర్సెస్ గౌతమ్.. వీళ్లిద్దరి పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ఇప్పటికే వీకెండ్ ఎపిసోడ్లో హౌస్మేట్స్ అందరి ముందు నాగార్జున క్లారిటీ ఇచ్చినా..డాక్టర్ బాబు మాత్రం శాంతించినట్లు కనిపించడం లేదు. “తప్పులెన్నువారు తమతప్పులెరుగరు.. విశ్వదాభిరామ వినురవేమ” అని వేమన శతకం డాక్టర్ బాబుకు సరిగ్గా సూటయ్యేలా ఉంది. ముందు భోలే విషయంలో అందరిని కన్విన్స్ చేసి.. ఎవరి అభిప్రాయం సరిగ్గా తీసుకోకుండానే భోలేను తమ టీమ్ నుంచి తప్పించాడని ఇప్పటికే తన గ్రూప్ సభ్యులు నాగార్జున ముందే చెప్పేశారు. కానీ డాక్టర్ బాబు మాత్రం శివాజీ నన్ను వద్దన్నాడు.. అందరిని మార్చేశాడు అది నచ్చలేదు.. న్యాయం కావాలంటూ పట్టుబట్టాడు. ఇక నాగార్జున ముందే క్లారిటీ వచ్చేసిందని చెప్పిన గౌతమ్.. ఇప్పుడు నామినేషన్లలోనూ మళ్లీ అదే పంచాయతీ షూరు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఇంట్లో ఉన్న అందరు అమ్మాయిలను బిగ్‌బాస్ ఇంటికి రాజమాతలను చేసేసాడు బిగ్‌బాస్. ఇక నామినేట్ చేయాలనుకున్న వారు తమ రీజన్స్ చెప్పగా.. రాజమాతల తుది నిర్ణయం ప్రకారం ఉంటుందని తెలిపాడు బిగ్‌బాస్ .
ముందుగా అమర్ ఫస్ట్ నామినేషన్.. భోలే గారు.. వీక్ కంటెస్టెంట్ అనే పదానికి మీరు రావడం నాకు నచ్చలేదని రీజన్ చెప్పాడు. ఇక భోలే మాట్లాడుతూ.. అక్కడ కొన్ని రాజకీయాలు పులుముకున్నాయని చెప్పగా.. అక్కడ ఎన్ని రాజకీయాలు జరిగిన.. కుట్రలు పన్నిన మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి అంటూ కౌంటరిచ్చాడు అమర్. ఎంత డిఫెండ్ చేయాలనేది నాకు క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు డిఫెండ్ చేయాలి..వాదించాలని చెప్పడానికి నీకెక్కడిదయ్యా హక్కు అంటూ కామెడీ చేశాడు భోలే. ఇక ఆ తర్వాత మొదలెట్టిన డాక్టర్ బాబు.. యావర్, అర్జున్ గేమ్‌లో ఉండాలి.. గౌతమ్ ఎందుకు వెళ్లిపోవాలి అని గౌతమ్ అడుగుతుండగా.. నువ్వు యాక్టివ్ కెప్టెన్ అంటూ రీజన్ చెప్పేశాడు శివాజీ. నిన్ను వద్దు అనుకుంటే సందీప్ మెడలో ఎందుకు వేస్తాను. నీకెందుకు వేస్తాను అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు శివాజీ.
ఇక ఆ తర్వాత ప్రశాంత్ వచ్చి.. డాక్టర్ బాబును నామినేట్ చేస్తూ.. ఒక కెప్టెన్ ఇంకొకరి మాట పట్టుకుని మాట్లాడడం కరెక్ట్ కాదని రీజన్ చెప్పగా.. గౌతమ్ మాట్లాడుతూ… వాడికి చాలాసార్లు నువ్వు ఆల్రేడీ కెప్టన్ అయ్యావు అని పొడిచిన ప్రతిసారి హర్ట్ అయ్యి వచ్చి అందరికి రివెంజ్ నామినేషన్స్ వేస్తాడు అని అన్నాడు గౌతమ్. అక్కడ తప్పుగా అర్థం చేసుకోవడం కాదు.. ఇన్ఫ్లూయేన్స్ అనే పదం వచ్చింది అందుకే ప్రతిఒక్కరు పాయింట్ తీస్తున్నారంటూ ప్రియాంక సైతం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఆ తర్వాత యావర్.. అమర్ దీప్ ను నామినేట్ చేశాడు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం గౌతమ్, భోలే నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




