Brahmamudi, November 6th episode: కనకాన్ని వెళ్లగొట్టిన స్వప్న.. ఆవేశంతో ఊగిపోతున్న రాజ్, అపర్ణలు.. కావ్య కన్నీరు!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్న దగ్గరకు వస్తుంది కనకం. అప్పటికే స్వప్న నెయిర్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది. స్పప్నా అని గట్టిగా అరుస్తుంది కనకం. మళ్లీ వచ్చావేంటి? అమ్మా.. నాలుగు రోజులు ఇక్కడ ఉండే సరికి.. ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా.. కోడలు మాత్రమే ఇక్కడ ఉండాలి అని అంటుంది కనకం. చేసిన పనికిమాలిన పనికి సిగ్గు పడాల్సింది పోయి.. రంగులు వేసుకుంటున్నావా.. అని కొడుతుంది. కొట్టడం కాదే.. చంపేయాలి నిన్ను.. లేని కడుపుతో నాటకం ఆడటం..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్న దగ్గరకు వస్తుంది కనకం. అప్పటికే స్వప్న నెయిర్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది. స్పప్నా అని గట్టిగా అరుస్తుంది కనకం. మళ్లీ వచ్చావేంటి? అమ్మా.. నాలుగు రోజులు ఇక్కడ ఉండే సరికి.. ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా.. కోడలు మాత్రమే ఇక్కడ ఉండాలి అని అంటుంది కనకం. చేసిన పనికిమాలిన పనికి సిగ్గు పడాల్సింది పోయి.. రంగులు వేసుకుంటున్నావా.. అని కొడుతుంది. కొట్టడం కాదే.. చంపేయాలి నిన్ను.. లేని కడుపుతో నాటకం ఆడటం కాకుండా.. అందులో కావ్యని కూడా ఇరికిస్తావా అని కనకం అంటుంది. మరి ఏం చేయమంటావే.. అందరూ కలిసి నా మీద పడుతుంటే.. చూస్తూ ఊరుకోమంటావా.. అయినా నీ చిన్న కూతురు నువ్వు అనుకునేంత గొప్పదేం కాదులే. తనకు ఎక్కడ సమస్య వస్తుందేమోనని నిజం దాచిందని స్వప్న అంటుంది. నోరు మూయ్.. కావ్య మీద నిందలు వేస్తే పుట్ట గతులు ఉండవు అని కనకం.. ఆవేశంతో ఊగిపోతుంది. చీపురు కట్టతో స్వప్నని వాయించేస్తుంది. అయినా తగ్గని స్వప్న.. కనకాన్ని కూడా ఎదరించి మాట్లాడుతుంది. అంతే కాకుండా మాటలతో బాధ పెడుతుంది. నీ చిన్న కూతురు లైఫ్ బావుండాలని.. నా లైఫ్ నాశనం అయి పోయినా పర్వాలేదని అనుకుంటున్నావ్ అంతే కదా అని స్వప్న అంటుంది. నువ్వు అందలంలో ఉండాలని.. దాన్ని పాతాళంలోకి తొక్కేసాను. అది కష్ట పడుతుంటే దాని సొమ్ము అంతా నీకే తగల పెట్టాను. ఏమన్నావ్.. నేను నాటకం ఆడానా.. నా కోసం ఆడానా నువ్వు బావుండాలనే కదా. కానీ నీ స్వార్థంతో నీ దారి చూసుకుని, మమ్మల్ని గాలికి వదిలేసావ్. అలాగే కావ్య బతుకుని నాశనం చేస్తున్నావ్ అని కనకం బాధ పడుతుంది.
నాకు అడ్డు వస్తే ఎవ్వరినైనా వదలను.. కనకాన్ని గదిలోనుంచి తోసేసిన స్వప్న:
అవును చేస్తాను అని స్వప్న అంటుంది. కావ్యనే కాదు నా దారికి అడ్డు వస్తే ఎవ్వర్నీ అయినా అలాగే చేస్తాను. ఆఖరికి అది నువ్వు అయినా సరే అని స్వప్న అంటుంది. నీకు దండం పెట్టి అడుగుతున్నా.. కావ్యను జీవితాన్ని పాడు చేయకు అని కనకం అడిగితే.. అమ్మా ఇవన్నీ నాకు కాదు.. నీ చిన్న కూతురికి చెప్పుకో.. నా దారికి అడ్డు రాకుండా దూరంగా ఉండమని చెప్పు అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది. నువ్వు మారవే.. నిన్న ఇక్కడ పెట్టడంలో అర్థం లేదు.. నువ్వు ఇక్కడే ఉంటే కావ్యని ఏదో ఒకటి చేస్తూనే ఉంటావ్. ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడికే తీసుకెళ్లి పోతాను.. పదా అని కనకం లాక్కెళ్తుంటే.. స్వప్న అడ్డుకుంటుంది. నా లైఫ్ లో నీ క్యారెక్టర్ అయిపోయింది. నాకు సంబంధించినంత వరకూ ఇకపై ఇదే నా ఇల్లు. నేను ఇక్కడే నా మొగుడితో ఉంటాను. నువ్వు ఎక్కడి వరకూ ఉండాలో అక్కడి వరకే ఉండు అని అంటుంది స్వప్న. ఈ మాటలకు కనకం షాక్ అవుతుంది. వెళ్లు అని తోసేస్తుంది స్వప్న.
కావ్యకి ఎదురు పడిన కనకం.. ఆవేశంతో ఊగిపోయిన అప్పు:
అటు నుంచి కనకం వెళ్తుంటే.. కావ్య ఎదురు పడుతుంది. అమ్మా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావ్? నిన్ను చూడలేదు అని కావ్య అడుగుతుంది. నీకు జీవితంలో అన్యాయం చేశానమ్మా.. వీలైతే నన్ను క్షమించు అని కనకం అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత కనకం ఇంటికి వెళ్తుంది. ఏంటే నాకు చెప్పకుండా వాళ్ల ఇంటికి ఎందుకు వెళ్లావ్ అని అడుగుతాడు కృష్ణ మూర్తి. స్వప్న కోసం వెళ్లాను.. రాత్రి మీరు చెప్పాక నాకు కూడా నిజం అనిపించి, దాన్ని ఇంట్లో నుంచి తీసుకొచ్చేద్దామని వెళ్లాను అని కనకం చెప్తే.. నేను ఏదో కోపంలో రాత్రి అంటే తీసుకొచ్చేద్దామని వెళ్లి పోయావా అని కృష్ట మూర్తి అంటాడు. నాన్నా అమ్మ చెప్పింది కరెక్టే.. అలాంటిది అక్కడ ఉండకూడదని అప్పూ కూడా అంటుంది. న్ను అవమానించి పంపించేసింది. గదిలో నుంచి బయటకు తోసేసి, తలుపు వేసేసిందని కనకం చెప్తుంది. కనకం మాటలకు అప్పూ ఆవేశ పడుతూ వెళ్ల బోతుంటే.. కనకం ఆపుతుంది. ఇక కావ్య జీవితాన్ని ఆ దేవుడే కాపాడాలి అని కనకం అంటుంది.
అపర్ణకు నచ్చజెప్తున్న ఇందిరా దేవి, ధాన్య లక్ష్మి.. ఒప్పుకోను అపర్ణ:
ఆ తర్వాత కావ్య.. కనకం ఫోన్ చేస్తుంది. ఎందుకు వచ్చావ్? ఎందుకు వెళ్లి పోయావ్ అని అడుగుతుంది. స్వప్నకి సర్ది చెప్పడానికి వచ్చాను.. కానీ అది వినిపించుకోలేదని అంటుంది. నా గురించి నువ్వేం బాధ పడకు. నా గురించి నేను చూసుకుంటాను అని కావ్య అంటుంది. ఇక రాత్రి అవుతుంది. ఇందిరా దేవి, అపర్ణ, ధాన్య లక్ష్మి కూర్చుంటారు. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్లను క్షమించకూడదని అపర్ణ అంటుంది. నువ్వు చెప్పింది నిజమే అక్కా.. కానీ స్వప్న చేసిన పనికి.. కావ్యపై పగ తీర్చుకుంటామనిపిస్తుందని ధాన్య లక్ష్మి అంటుంది. సరిగ్గా చెప్పావ్ ధాన్యలక్ష్మి అని ఇందిరా దేవి అంటుంది. ఆ స్వప్న ఎంత గొడవ చేసిందో అందరం చూశాం. తప్పు చేసి కూడా తల వంచుకోలేదు. కానీ కావ్య మాత్రం మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కావ్య ఎప్పుడూ నోరు జారి మాట్లాడలేదని ఇందిరా దేవి, ధాన్య లక్ష్మి అంటారు. తప్పు చేసింది అంటుంటే.. ఆ కావ్యని పొగుడుతున్నారేంటి అని అపర్ణ అంటుంది. గొప్పలు కాదు అపర్ణ.. నిజం చెప్తున్నాం.. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయమే ఆ పిల్ల జీవితం ఆధారపడి ఉంది. వాళ్లను ఇంటి నుంచి తరిమేస్తే సమస్య తీరిపోతుందా.. కావ్యని ఇంటి నుంచి తరిమేసి రాజ్ కి ఇంకో పెళ్లి చేస్తే.. వచ్చే అమ్మాయి మంచిగా ఉంటుందని నమ్మకం ఉందా అని ఇందిరా దేవి అంటుంది. మీరు ఎన్ని చెప్పినా ఒప్పుకోను అత్తయ్యా.. ఆ కావ్య ముఖం చూడలేక పోతున్నా. మీరు మావయ్య గారితో మాట్లాడి ఏదో ఒకటి తేల్చండి అని అపర్ణ అని వెళ్లి పోతుంది.
ఆవేశంతో ఊగిపోతున్న రాజ్.. బాధ పడుతున్న కావ్య:
ఆ తర్వాత రాజ్ జరిగినవన్నీ గుర్తుకు తెచ్చుకుని బాధ పడతాడు. ఆ తర్వాత కావ్యపై కోపం తెచ్చుకుంటాడు. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటో తీసుకుని కాల్చేస్తాడు. అంతలో రాజ్ చేయి కాలుతుంది. అప్పుడే కావ్య వస్తుంది. అయ్యే ఏమైందండి.. అని అడుగుతుంది. నేను అబద్ధం చెప్పలేదు. నన్ను తప్పు పడుతున్నారు. మీరు చాలా దూరం వెళ్లిపోయారని కావ్య అంటుంది. రేపు తాతయ్య ఈ విషయం తేల్చేస్తే ఆ దూరం శాశ్వతంగా ఉండిపోతుందని రాజ్ అంటాడు. రాజ్ మాటలకు కావ్య బాధ పడుతూ ఉంటుంది.







