Bigg Boss 7 Telugu: అమర్ దీప్ మనసుకు ఇది పరీక్షే.. బిగ్‌బాస్ కోసం రవితేజ లుక్ త్యాగం ?..
హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మొత్తం 14 మంది ఆట తీరు చూసి శోభా శెట్టి, అమర్ దీప్, ప్రిన్స్ యావర్‌లను కంటెండర్స్ పోటీదారులుగా సెలక్ట్ చేశారు బిగ్‌బాస్.. ఇక ఆ ముగ్గురిలో ఎవరు అర్హులు కాదో చెప్పాలని ఆర్డర్ వేశాడు బిగ్‌బాస్. దీంతో ప్రిన్స్ యావర్ అర్హుడు కాదంటూ దామిని, రతిక, తేజ తమ అభిప్రాయం తెలిపారు. ఈ క్రమంలోనే యావర్ కు ఓ టాస్క్ ఇవ్వగా.. మిగతా ఇంటి సభ్యులు శాడిస్టులుగా బిహేవ్ చేశారు. అయినా అన్నింటిని ఓపికగా భరించి విన్నర్ అయ్యాడు. ఇక అటు శోభాకు కఠినమైన టాస్కే ఇచ్చారు బిగ్‌బాస్.

బిగ్‌బాస్ సీజన్ అంతా ఉల్టా పుల్టాగా సాగుతుంది. ఇప్పుడంతా హౌస్ కంటెండర్ అయ్యేందుకు పోటీ పడుతున్నారు కంటెస్టెంట్స్. ఇప్పటికే శివాజీ, సందీప్ కంటెండర్స్ కాగా.. ఇప్పుడు మరో ముగ్గురు పోటీలో నిలబడ్డారు. ఇక వారిని వెనక్కు లాగేందుకు ట్రై చేస్తున్నారు మిగతా ఇంటి సభ్యులు. హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మొత్తం 14 మంది ఆట తీరు చూసి శోభా శెట్టి, అమర్ దీప్, ప్రిన్స్ యావర్‌లను కంటెండర్స్ పోటీదారులుగా సెలక్ట్ చేశారు బిగ్‌బాస్.. ఇక ఆ ముగ్గురిలో ఎవరు అర్హులు కాదో చెప్పాలని ఆర్డర్ వేశాడు బిగ్‌బాస్. దీంతో ప్రిన్స్ యావర్ అర్హుడు కాదంటూ దామిని, రతిక, తేజ తమ అభిప్రాయం తెలిపారు. ఈ క్రమంలోనే యావర్ కు ఓ టాస్క్ ఇవ్వగా.. మిగతా ఇంటి సభ్యులు శాడిస్టులుగా బిహేవ్ చేశారు. అయినా అన్నింటిని ఓపికగా భరించి విన్నర్ అయ్యాడు. ఇక అటు శోభాకు కఠినమైన టాస్కే ఇచ్చారు బిగ్‌బాస్.
స్పైసీ చికెన్ ముక్కలు ముందు పెట్టి తినాలని టాస్క్ ఇచ్చాడు. మంట భరించలేక అల్లాడిపోయింది శోభాశెట్టి. కన్నీళ్లు పెట్టుకుంటూ ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఇక ఆ తర్వాత ఆమెను అర్హురాలు కాదు అన్న ప్రశాంత్, శుభ శ్రీ, గౌతమ్ లను పిలిచి స్పైసీ చికెన్ తినాలని టాస్క్ ఇచ్చారు. ఎవరైతే ముందుగా తింటారో వారే శోభా స్థానంలో కంటెండర్ అవుతారని చెప్పగా.. ఈ ముగ్గురు పోటీ పడి మరీ చికెన్ తింటున్నారు.
ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో జానకి, రామా అదేనండీ అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య ఫిట్టింగ్ పెట్టేశాడు. అమర్ దీప్ కంటెండర్ అనర్హుడు అని ప్రియాంక చెప్పగా.. ఇప్పుడు వీరిద్దరికి కలిపి టాస్క్ ఇచ్చాడు. అందులో ఎవరైతే తమ హెయిర్ త్యాగం చేస్తారో వారే కంటెండర్ అయ్యేందుకు పోటీలో ఉంటారని అనౌన్స్ చేశాడు. అయితే ప్రోమోలో చూపిస్తున్నట్లుగా అంటే అమర్ దీప్ పూర్తిగా గుండు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రియాంక చెవుల వరకు హెయిర్ కట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ వీరిద్దరు మాత్రం టాస్క్ చేసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమర్ దీప్ కు తన హెయిర్ అంటే ఇష్టమని.. గతంలో రవితేజ సైతం తన జుట్టుపై చెయి వేసి నాలాగే ఉందని కంప్లీమెంట్ ఇచ్చారని చెబుతూ ఫీల్ అవుతున్నాడు అమర్ దీప్. అయితే అమర్ దీప్‌ను టాస్క్ చేసేందుకు ట్రై చేస్తున్నారు ఇంటి సభ్యులు. అయితే మరీ వీరిద్దరిలో ఎవరు విజేత అయ్యారనేది ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.