Bigg Boss 7 Telugu: హౌస్‏లో ఆఖరి కెప్టెన్సీ టాస్క్.. కేజీఎఫ్ స్టైల్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్..

గౌతమ్, యావర్, ప్రశాంత్, శివాజీ, అర్జున్, ప్రియాంక కెప్టెన్స్ అయ్యారు. ఇక రతిక, అమర్ దీప్, అశ్విని మాత్రమే కెప్టెన్స్ కాలేకపోయారు. కానీ ఈ వారం చివరి కెప్టెన్సీ కావడంతో ఇంటి సభ్యులందరికీ ఛాన్స్ ఇచ్చాడు బిగ్‏బాస్. నిన్నటి వరకు పోలీసులు, సీరియల్ కిల్లర్ అంటూ గేమ్ నడిపించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో మరోసారి హౌస్మేట్స్ మధ్య చిచ్చు పెట్టాడు. లాస్ట్ కెప్టెన్సీ అంటూనే మరోసారి నిర్ణయాన్ని హౌస్మేట్స్ నెత్తిన పెట్టాడు. మీలో మీరు నిర్ణయించుకుని కెప్టెన్ ను సెలక్ట్ చేయండి అంటూ అసలు ట్విస్ట్ ఇచ్చాడు.

Bigg Boss 7 Telugu: హౌస్‏లో ఆఖరి కెప్టెన్సీ  టాస్క్.. కేజీఎఫ్ స్టైల్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్..
Bigg Boss 7 Telugu Promo
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 24, 2023 | 1:05 PM

బిగ్‏బాస్ చివరి కెప్టెన్సీ టాస్క్ వచ్చేసింది. ఇప్పటివరకు పదకొండు వారాలుగా సాగిన ఈ షో.. ఇప్పుడు చివరి కెప్టెన్సీ కోసం పోటీ పెట్టాడు బిగ్‏బాస్. ప్రస్తుతం హౌస్ లో మొత్తం పదిమంది మిగిలారు. అందులో గౌతమ్, యావర్, ప్రశాంత్, శివాజీ, అర్జున్, ప్రియాంక కెప్టెన్స్ అయ్యారు. ఇక రతిక, అమర్ దీప్, అశ్విని మాత్రమే కెప్టెన్స్ కాలేకపోయారు. కానీ ఈ వారం చివరి కెప్టెన్సీ కావడంతో ఇంటి సభ్యులందరికీ ఛాన్స్ ఇచ్చాడు బిగ్‏బాస్. నిన్నటి వరకు పోలీసులు, సీరియల్ కిల్లర్ అంటూ గేమ్ నడిపించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో మరోసారి హౌస్మేట్స్ మధ్య చిచ్చు పెట్టాడు. లాస్ట్ కెప్టెన్సీ అంటూనే మరోసారి నిర్ణయాన్ని హౌస్మేట్స్ నెత్తిన పెట్టాడు. మీలో మీరు నిర్ణయించుకుని కెప్టెన్ ను సెలక్ట్ చేయండి అంటూ అసలు ట్విస్ట్ ఇచ్చాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో అసలు ఏం జరిగిందో చూద్దాం.

ప్రోమోలో ముందుగా.. ఇదే బిగ్‏బాస్ ఇంట్లో జరిగే ఆఖరి కెప్టెన్సీ అని చెప్పాడు. కేజీఎఫ్ సినిమాలోని పెద్దమ్మ గన్ మాదిరిగా ఓ గన్ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. గన్ షూటింగ్ సౌండ్ వినపడిన ప్రతిసారి గార్డెన్ ఏరియాలోని మిషన్ గన్ ఉన్న బాక్స్ పై ఏ ఇద్దరు నిలబడతారో వారు కిల్లింగ్ జోన్ లో ఉన్న ఇద్దరి ఫోటోలలో ఎవరు కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాలో వారి ఫోటోను షూట్ చేయాల్సి ఉంటుందని అన్నాడు. ఈ క్రమంలో ముందుగా గౌతమ్, ప్రియాంక మిషన్ గన్ దగ్గరకు రాగా… వారిద్దరి ముందు అర్జున్, శోభా ఫోటోస్ వచ్చాయి. అయితే వీరిద్దరి కలిసి శోభా ఫోటోను కాల్చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో శోభా వర్సెస్ గౌతమ్ మధ్య వాదన జరిగింది. శోభా కంటే అర్జున్ ఫెయిర్ గేమ్ అని చెప్పడంతో ఫెయిర్ అంటే అని తిరిగి క్వశ్చన్ చేసింది శోభా. దీంతో అమర్ ను గెలిపించేందుకు నువ్వు అందరిని ఇన్ఫ్లుయేన్స్ చేశావని అనడంతో పక్కకు తీసుకెళ్లి చెబితే నీవరకు ఇన్ఫ్లుయేన్స్ అంటూ వాదించింది శోభా.

ఇక తర్వాత ప్రశాంత్, శోభా.. వారిద్దరి ముందు అమర్, అశ్విని ఫోటోస్ రాగా.. ఇద్దరు కలిసి అశ్విని ఫోటోను కాల్చేశారు. ప్రశాంత్ సైతం అమర్ కు సపోర్ట్ చేయడంతో అశ్విని హర్ట్ అయ్యింది. నువ్వు నన్ను తీసేయడం నచ్చలేదంటూ బాధపడింది. ఇక తర్వాత యావర్, రతిక రాగా.. శివాజీ, ప్రశాంత్ ఫోటోస్ కిల్లింగ్ ఏరియాలోకి వచ్చాయి. ఇక ఈ సమయంలో రతిక, ప్రశాంత్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచింది. చివరకు అందరి ఫోటోస్ కాలిపోగా.. శివాజీ, అమర్, అర్జున్ మిగిలినట్లు తెలుస్తోంది. అయితే ఈ గేమ్ లో అమర్ గెలిచి చివరి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు కెప్టెన్సీ టాస్క్ రద్దయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?