Bigg Boss 5 Telugu: సిరి, షణ్ముఖ్ రిలేషన్ పై నాగ్ ఫైర్.. సిరి పరువు తీసి.. షణ్ముఖ్‏కు క్లాస్..

బిగ్‏బాస్ హౌస్‏‏లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్స్ ప్రకియ నుంచి ఇంట్లో జరుగుతున్న ఘటనలు ప్రేక్షకులకు

Bigg Boss 5 Telugu: సిరి, షణ్ముఖ్ రిలేషన్ పై నాగ్ ఫైర్.. సిరి పరువు తీసి.. షణ్ముఖ్‏కు క్లాస్..
Bigg Boss
Rajitha Chanti

|

Nov 20, 2021 | 5:50 PM

బిగ్‏బాస్ హౌస్‏‏లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్స్ ప్రకియ నుంచి ఇంట్లో జరుగుతున్న ఘటనలు ప్రేక్షకులకు ఏమాత్రం అర్థం కావడం లేదు. సాధారణంగా బిగ్‏బాస్ హౌస్‏‏లోకి అడుగుపెట్టిన వారు మంచి స్నేహితులుగా మారిపోవడం.. లేదా.. గొడవలతో విడిపోవడం జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన సీజన్స్‏లో స్నేహితులను ప్రేమికులుగా.. అన్నా చెల్లె అని పిలుచుకున్న కంటెస్టెంట్స్ మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్టు చూపించేందుకు తెగ కష్టపడ్డారు బిగ్‏బాస్ ఎడిటర్లు. కానీ ఈ సారి మాత్రం బిగ్‏బాస్ ఎడిటర్లకు పెద్దగా పని పెట్టడం లేదు బిగ్‏బాస్ హౌస్‏‏లోని కంటెస్టెంట్స్. ఇప్పటికే ప్రియాంక మానస్ పై విపరీతమైన ప్రేమ పెంచుకుని అతనికి సపర్యలు చేస్తూ గేమ్ కాకుండా.. మానస్ కోసమే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తుంది. మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న ప్రియాంక ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉంది.

మరోవైపు గత రెండు.. మూడు వారాలుగా సిరి, షణ్ముఖ్ రిలేషన్ కూడా అర్థం కావడం లేదు. ప్రతి చిన్న విషయానికి అరుచుకోవడం.. అలగడం.. ఆ తర్వాత కలిసి పోవడం.. ముద్దులు పెట్టుకోవడం.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో చిత్రాలు చేస్తున్నారు. అయితే మొదట్లో వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నారు అంతా.. కానీ గత వారం రోజులుగా వీరి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. వీరిద్దరిది ఫ్రెండ్ షిప్ కాదని.. వేరే ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. షణ్ముఖ్ చిదరించుకున్న.. కోప్పడిన.. సిరి మాత్రం అతని వెనకే పడుతుంది. అవసరం లేని హగ్గులు.. ముద్దులతో శ్రుతి మించి ప్రవర్తిందని నెటిజన్స్ ఆమె పై ఫైర్ అవుతున్నారు. ఇక మొన్నటి ఎపిసోడ్ లో షణ్ముఖ్ సీరియస్ అయినందుకు సిరి బాత్రుంలోకి వెళ్లి తనను తను గాయపర్చుకుంది. దీంతో ఇంటిసభ్యులే కాదు… ప్రేక్షకులు సైతం షాకయ్యారు. తాజాగా ఈరోజు ఎపిసోడ్‏లో వీరిద్దరి ప్రవర్తనపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోంది..

తాజాగా విడుదలైన ఎపిసోడ్ లో నాగ్.. సిరి, షణ్ముఖ్‏లకు క్లాస్ తీసుకున్నారు. ముందుగా సిరి నిల్చోబెట్టి మరి పరువు తీశారు. నిన్ను నువ్వు ఎందుకు గాయపర్చుకున్నావు? ఇలాంటి పరిస్థితి ఇంట్లో అవసరమా అంటూ ప్రశ్నించాడు. ఏం జరుగుతుందో చెప్పమని అడిగాడు. ఇందుకు సిరి తనకు ఏం జరుగుతుందో తెలియడం లేదని… బయట తానేంటో తనకు తెలుసు అని.. అయినా ఎందుకు కనెక్షన్ వస్తుందో తెలియడం లేదని వాపోయింది. దీంతో.. కోట్ల మంది నిన్ను చూసి ఇన్‏స్పైర్ కావాలి కానీ.. నిన్ను చూసి ఇలా ఉండకూడదు అనుకోవద్దు అంటూ సిరికి క్లాస్ తీసుకున్నారు నాగ్. ఆ తర్వాత షణ్ముఖ్ ను సైతం ఇదే ప్రశ్న అడగ్గా.. మానసికంగా వీక్ అయ్యాయని తెలిపాడు. దీప్తి సునయనను మిస్ అవుతున్నవా అని అడగి.. మిస్ అయితే వెళ్లిపో అంటూ గేట్స్ ఓపెన్ చేయించాడు. మొత్తానికి షణ్ముఖ్, సిరి రిలేషన్ పై నెటిజన్లకు ఉన్న సందేహాలకు ఈరోజు నాగార్జున క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగానే తెలుస్తోంది.

ప్రోమో..

Also Read: Naga Babu: చంద్రబాబు కంటతడి పెట్టడంపై స్పందించిన మెగా బ్రదర్‌.. అసెంబ్లీ పరిణామాలపై సీరియస్ కామెంట్స్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu