Bigg Boss 5 Telugu: ఆమె అంత గుర్తొస్తే వెళ్ళిపో.. ఆ కంటెస్టెంట్‌కు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పీక్ స్టేజ్‌కు చేరుతున్నాయి. ముఖ్యంగా హౌస్‌లో ఉన్న సిరి షణ్ముఖ్ మధ్య ఏం జరుగుతుందో

Bigg Boss 5 Telugu: ఆమె అంత గుర్తొస్తే వెళ్ళిపో.. ఆ కంటెస్టెంట్‌కు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..
Nag
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 21, 2021 | 11:45 AM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పీక్ స్టేజ్‌కు చేరుతున్నాయి. ముఖ్యంగా హౌస్‌లో ఉన్న సిరి షణ్ముఖ్ మధ్య ఏం జరుగుతుందో అర్ధంకాక ఆడియన్స్ తలలు పట్టుకుంటున్నారు. అప్పటివరకు ప్రేమగా మాట్లాడుకుంటారు.. సడన్ గా గొడవలకు దిగుతారు. ఎందుకు ఏడుస్తారో అర్ధం కాదు. ఇప్పటివరకు హౌస్ లో ఉన్న వాళ్ళ మధ్య మరీ ఇంతగా గొడవలు అయినట్టు ఎప్పుడు చూడలేదు. సిరి ఎందుకు ఏడుస్తుందో.. షణ్ముఖ్ ఎందుకు అలుగుతున్నాడో ప్రేక్షకులకు అర్ధం కానీ పరిస్థితి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో వారాంతం వచ్చిందంటే చాలు కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తారు. హౌస్ మెట్స్ తో కావాల్సినంత ఫన్ చేసి ఆ తర్వాత ఒక్కొక్కళ్ళకి క్లాస్ తీసుకుంటారు నాగ్. ఈ వారం కూడా అదే జరిగింది.

ఇక సిరి, షన్నుల పరిస్థితిపై నాగార్జున వీకెండ్‌లో ప్రశ్నించారు నాగార్జున. సిరి తనని తాను గాయపర్చుకోవడం, అలా చేసేలా ప్రేరేపించిన షన్ను ప్రవర్తన మీద ప్రశ్నించారు. మీరు ఎవరితో ఎలా ఉన్నా నేను అడగను.. కానీ మీది మీరు హర్ట్ చేసుకోకండి, గాయపర్చుకోకండి అని నాగార్జున అన్నారు.ఇక నాగార్జున  సిరిని పిలిచి నీ బాధ ఏంటి? ఏమైంది? ఎందుకు అలా తలను బాదుకున్నావ్ అని నాగార్జున అడిగారు. నేను వెరీ ఎమోషనల్ పర్సన్.. ఆ ఎమోషన్ ఎందుకు వస్తోందో కూడా ఎందుకో అర్థం కావడం లేదు.. ఎదుటి వాళ్లను నేను హర్ట్ చేయను.. ఎవ్వరు నన్ను చేసినా నేనే హర్ట్ అవుతాను. అంటూ ఎదో చెప్పుకొచ్చింది. తప్పు అని తెలిసినా కూడా చేసేస్తున్నా.. ఎలా రిసీవ్ చేసుకుంటారు అని కూడా ఆలోచించడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. దానికి నాగార్జున. నువ్ ఎలా ఉన్నా, ఏం చేశావ్ అని అడగడం లేదు కానీ నువ్ మాత్రం ఇంకోసారి ఇలా నీది నువ్ గాయపర్చుకోవద్దని సిరికి నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత షన్నుని పిలిచి సిరి అలా చేసుకోవడంలో ఎవరిది తప్పు అని అడిగారు. దానికి అది నా తప్పే సర్.. నేను అంతలా రియాక్ట్ అవ్వకపోయి ఉంటే.. సిరి అలా చేసి ఉండేది కాదు. ఇకపై అలా జరగనివ్వను అన్నాడు. దీప్తి అంత గుర్తుకు వస్తుంటే.. వెళ్లిపో అంటూ నాగార్జున అన్నారు. నీ ఆట నువ్ ఆడుకో అని షన్నును వార్న్ చేశారు నాగ్.

మరిన్ని ఇక్కడ చదవండి ; 

Hyderabad: ఇకపై థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

ఇండియాలో మొట్టమొదటి ‘లేడీ సూపర్ హీరో’ చిత్రం.. 3డిలో అదరగొట్టనున్న మాజీ మిస్‌ ఇండియా..

Varshini Sounderajan: తన ఒంపుసొంపులతో ఫిదా చేస్తున్న వర్షిణి లేటెస్ట్ పిక్స్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!