Bigg Boss 5 Telugu: మాట మార్చిన కాజల్.. షాక్ తిన్న మానస్.. చివరకు సన్నీ విన్..
బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పైగా బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు కూడా అదే విధంగా ఉంటున్నాయి.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పైగా బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు కూడా అదే విధంగా ఉంటున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ కూడా హౌస్ మేట్స్ మధ్య చిచ్చుపెట్టేలా ఉంది. 75వ రోజు ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న వాళ్లకు ఏవేవో ప్లాన్స్ వేసుకున్నారు. సన్నీ, కాజల్, మానస్, ప్రియాంకలు ఒక ప్లాన్ వేసుకున్నారు. శ్రీరామచంద్ర, రవిలు కూడా ఎదో ప్లాన్ చేశారు. రింగ్ ఈజ్ కింగ్ అనే కెప్టెన్సీ టాస్క్‌లో మానస్ గెలిచి ఇంటి కెప్టెన్‌గా మారాడు. మానస్ కెప్టెన్ కావడంతో సన్నీ, కాజల్ తెగ సంబర పడిపోయారు. కెప్టెన్ అయిన తర్వాత సన్నీ కాజల్ దగ్గరకు వచ్చి కాజల్ ను ఏ డిపార్ట్మెంట్ కావలి అని అడిగితే ఏది ఇచ్చిన చేస్తా అంటుంది.
ఆతర్వాత ఫైర్ ఇంజన్, ఇళ్లు కాలిపోవడం అంటూ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. సైరన్ మ్రోగిన తర్వాత ఫైర్ ఇంజన్‌లోకి ఇద్దరు ఎక్కాల్సి ఉంటుంది. వారి ముందు రెండు ఫోటోలు ఉంచగా.. ఏకాభిప్రాయంతో ఒకరిని కాపాడాల్సి ఉంటుంది. చివరి వరకు ఎవరి ఫోటో అయితే కాలిపోకుండా ఉంటుందే వారికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతమవుతుందని తెలిపాడు బిగ్ బాస్. మొదటి సైరెన్‌కు రవి, సన్నీలు ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కారు. వారికి శ్రీరామచంద్ర, మానస్ ఫోటోలు వచ్చాయి. శ్రీరామచంద్రను సేఫ్ చేసి.. మానస్ ఫోటోను కాల్చేశారు. ఆ తరువాత మానస్ సన్నీలు ఎక్కారు. వారిద్దరు ఆనీ మాస్టర్, రవిలోంచి.. ఆనీ మాస్టర్‌ను సేఫ్ చేశారు. రవి ఫోటోను కాల్చేశారు. ఆ తరువాత సిరి, షన్ను ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కారు. సన్నీ, ప్రియాంకలోంచి.. సన్నీని కాపాడారు.. ప్రియాంక ఫోటోను కాల్చారు. ఆ తరువాత ఆనీ, శ్రీరామ ఫైర్ ఇంజన్ ఎక్కేసి..సిరి, షన్నులోంచి సిరిని సేఫ్ చేశారు.. ఆ తరువాత కాజల్ ప్రియాంక ఎక్కి.. సిరి, శ్రీరామలోంచి సిరిని సేఫ్ చేశారు. ఆ తరువాత ఆనీ, ప్రియాంక ఫైర్ ఇంజన్ ఎక్కి.. సన్నీ, కాజల్‌లోంచి..సన్నీని సేఫ్ చేశారు కాజల్ ఫోటోను కాల్చేశారు. ఆతరువాత మానస్, కాజల్ ఫైర్ ఇంజన్ ఎక్కుతారు. వారికి ఆనీ, సిరిలోంచి ఒకరిని కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది.. ఇద్దరూ ఏకాభిప్రాయం లేకపోవడంతో రెండు ఫోటోలు కాలిపోతాయి. మానస్ ఆనీ మాస్టర్ కు సపోర్ట్ చేస్తే కాజల్ సిరి సపోర్ట్ చేసింది..సరే కదా అని మానస్ కూడా సిరి సపోర్ట్ చేస్తే వెంటనే కాజల్ మాట మార్చి ఆనీ మాస్టర్ కు సపోర్ట్ చేస్తున్నా అంటూ షాక్ ఇచ్చింది. దాంతో రెండు ఫోటోలు కాలిపోయాయి. చివరకు సన్నీ మిగిలిపోతాడు. సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుంది. అయితే కాజల్ ఆట పై ఆనీ మాస్టర్ రాద్ధాంతం చేసింది. తొండి ఆడుతున్నారంటూ చిర్రుబుర్రులాడింది.
మరిన్ని ఇక్కడ చదవండి :