Bigg Boss 5 Telugu Promo: అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన జెస్సీ.. గుక్కపెట్టి ఏడ్చిన సిరి, షణ్ముఖ్..
బిగ్‌బాస్ సీజన్ 5.. ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ఒకేసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో సీజన్ 5లో వైల్డ్ కార్డ్
బిగ్‌బాస్ సీజన్ 5.. ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ఒకేసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో సీజన్ 5లో వైల్డ్ కార్డ్ ఉంటుందా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇక ఈసారి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో సగం మంది ముఖాలు జనాలకు అంతగా తెలియనే తెలియవు.. అందులో మోడల్ జస్వంత్ ఒకరు. బిగ్‌బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చేవరకు జస్వంత్ గురించి తెలిసిన వారు చాలా తక్కువ. అప్పుడే ఎక్కువగ జెస్సీ గురించి ఇంటర్నెట్లో సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్.
మోడల్‍గా ఎంట్రీ ఇచ్చిన జెస్సీ.. టాస్కులలో ఎంతో స్ట్రాంగ్‌గా ఆడుతూ.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.. అయితే ఎంతో యాక్టివ్‍గా గేమ్ ఆడుతున్న జెస్సీ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. మొదల్లో కాలికి తగిలిన దెబ్బను సైతం లెక్కచేయకుండా ఫిజికల్ టాస్కులలో తనవంతూ పర్ఫామెన్స్ ఇచ్చాడు జెస్సీ. ఇక కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా ఇంటి నుంచి జెస్సీ అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చేస్తాడంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన బిగ్‌బాస్ ప్రోమోలో జెస్సీని నిజాంగానే బయటకు వచ్చేసిన సంగతి రివీల్ చేశారు మేకర్స్.
జెస్సీ అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుండడం వలన.. అతనికి సరైన చికిత్స అవసరమని.. అందుకే తనను ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నట్లుగా చెప్పాడు బిగ్‌బాస్. దీంతో షణ్ముఖ్, సిరి గుక్కపెట్టి ఏడ్చారు.. జెస్సీ అలా ఆకస్మాత్తుగా వెళ్లిపోవడంతో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉంటే.. జెస్సీ వెర్టిగో అనే సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే.. తల తిరగడం.. చెమటలు పట్టడం.. వాంతులు కావడం.. వినికిడి లోపం.. సరిగ్గా నిల్చోలేకపోవడం వంటి లక్షణాలుంటాయి. ఈ సమస్య మరింత పెద్దది కావడంతో జెస్సీని సరైన చికిత్స కోసం ఇంటి నుంచి బయటకు పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే జెస్సీ చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి ఇంట్లోకి రీఎంట్రీ ఇస్తాడా ? లేదా ? అనేది చూడాలి.
అయితే ఇలా అనారోగ్య సమస్యలతో ఇంటి నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం ఇది మొదటి సారికాదు.. గత సీజన్లలో చాలాసార్లు జరిగింది. సీజన్ 4లో గంగవ్వ, నోయల్ అనారోగ్య సమస్యలతో ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అంతకు ముందు సీజన్లో సంపూర్ణేష్ బాబు సైతం ఇలాగే అనారోగ్య సమస్యతో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
Also Read: Kajal: ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించిన కాజల్ అగర్వాల్.. అసలు విషయం బయటపెట్టిన ముద్దుగుమ్మ
RRR: ఆర్ఆర్ఆర్ సెకండ్ లిరికల్ ప్రోమో వచ్చేసింది.. నాటు నాటు వీర నాటు అదుర్స్..