AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal: ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించిన కాజల్ అగర్వాల్.. అసలు విషయం బయటపెట్టిన ముద్దుగుమ్మ…

సుధీర్ఘ కాలంగా టాలీవుడ్ చిత్రపరిశ్రమలో అగ్రకథనాయికగా కొనసాగుతుంది కాజల్ అగర్వాల్. తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం

Kajal: ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించిన కాజల్ అగర్వాల్.. అసలు విషయం బయటపెట్టిన ముద్దుగుమ్మ...
Kajal
Rajitha Chanti
|

Updated on: Nov 09, 2021 | 11:51 AM

Share

సుధీర్ఘ కాలంగా టాలీవుడ్ చిత్రపరిశ్రమలో అగ్రకథనాయికగా కొనసాగుతుంది కాజల్ అగర్వాల్. తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది ఈ చందమామ. పెళ్లి తర్వాత కూడా కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. రోజు రోజుకీ తన ఫాలోయింగ్ మరింత రెట్టింపు చేసుకుంటోంది కాజల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించింది. అటు వెండితెరపైనే కాకుండా..సోషల్ మీడియాలోనూ తన సత్తా చాటుకుంటుంది కాజల్. ప్రస్తుతం వరుస చిత్రాలను చేస్తూ బిజీగా ఉన్న కాజల్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కాజల్ ప్రెగ్నెంట్ అంటూ పలు వెబ్ సైట్స్ కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో కాజల్ తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించింది.

కాజల్ మాట్లాడుతూ.. ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. అయితే ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా మాట్లాడతాను. మాతృత్వం అనేద గొప్ప విషయం. నాకు సంబంధించినంత వరకు ఓ వైపు ఎగ్జయిట్‌మెంట్‌ను క‌లిగిస్తూనే నెర్వస్‌గానూ అనిపిస్తుంది. నేను నా చెల్లెలు నిషా తల్లి అయిన్పుడు తనెలాంటి ఫీలింగ్స్ ఫేస్ చేసిందో దగ్గర నుంచి గమనించాను. ఇప్పుడు తనెలా ఫీల్ అవుతుందో కూడా గమనిస్తున్నాను.. నిషా పిల్లలు ఇషాన్, కబీర్‏లతో ఎక్కువ సమయం గడిపాను. ఆ సమయంలో నేను వారికి తల్లిలాగా భావనలో ఉంటూ గడిపాను.. వీరు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా గుండెలో సరికొత్త భావన కలిగింది. అదే ఇప్పుడు నాకు పిల్లలు పుడితే ఎలా ఉంటుందనే భావన మరింత ఎమోషన్‏ను పెంచుతుందని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ప్రస్తుతం కాజల్.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమాలో నటించింది . ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇదే కాకుండా.. ఇంకా తమిళంలో, హిందీలోనూ కాజల సినిమాలు చేస్తుంది. ఇక తాజాగా కాజల్ ఉమ అనే సినిమాలో నటించింది. బాలీవుడ్‏లో తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: RRR: ఆర్ఆర్ఆర్ సెకండ్ లిరికల్ ప్రోమో వచ్చేసింది.. నాటు నాటు వీర నాటు అదుర్స్..

Samantha: అరుదైన గౌరవం అందుకున్న సమంత.. సౌత్ ఇండియా సినీపరిశ్రమలోనే తొలి మహిళగా..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్