RRR: ఆర్ఆర్ఆర్ సెకండ్ లిరికల్ ప్రోమో వచ్చేసింది.. నాటు నాటు వీర నాటు అదుర్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు

RRR: ఆర్ఆర్ఆర్ సెకండ్ లిరికల్ ప్రోమో వచ్చేసింది.. నాటు నాటు వీర నాటు అదుర్స్..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 09, 2021 | 11:20 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ఆర్ఆర్ఆర్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు.

ఇదిలా ఉంటే … తాజాగా ఈ సినిమా నుంచి నాటు నాటు.. వీరు నాటు సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ప్రోమోలో.. నా పాట సూడు.. నాటు.. నాటు.. నాటు.. నాటు.. వీర నాటు అంటూ సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. రాహుల సిప్లిగంజ్, కాలబైరవ ఆలపించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక నాటు నాటు వీర నాటు పాటను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది  చిత్రయూనిట్. డీవీవీ పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు జక్కన.. ప్రస్తుతం షూటింగ్ అనంతరం పనులు జరుపుకుంటుంది ఈ సినిమా.  జనవరి 7 న ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read: Samantha: అరుదైన గౌరవం అందుకున్న సమంత.. సౌత్ ఇండియా సినీపరిశ్రమలోనే తొలి మహిళగా..

Puneeth Rajkumar: పునీత్ ఫోటో చూస్తూ దీనంగా పెంపుడు కుక్కలు.. వాటికెలా తెలిసేది ఇక ఆయన రాడని..

Ashu Reddy: అందం కూడా అసూయపడే అమ్మాయి.. వారెవ్వా అనిపిస్తున్న అషు రెడ్డి వయ్యారాలు ..