Bigg Boss 5 Telugu: యానీ మాస్టర్‎కు బిగ్‏బాస్ బంపర్ ఆఫర్.. ఈవారం నామినేట్ అయ్యింది ఎవరంటే..

ఎలిమినేషన్ తర్వాతి రోజే.. ఇంటి సభ్యులకు అసలైన టాస్కు. అదే నామినేషన్స్ డే. ఉదయం నుంచే తాము ఎవరెవరిని నామినేట్ చేయాలి.

Bigg Boss 5 Telugu: యానీ మాస్టర్‎కు బిగ్‏బాస్ బంపర్ ఆఫర్.. ఈవారం నామినేట్ అయ్యింది ఎవరంటే..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 09, 2021 | 6:53 AM

ఎలిమినేషన్ తర్వాతి రోజే.. ఇంటి సభ్యులకు అసలైన టాస్కు. అదే నామినేషన్స్ డే. ఉదయం నుంచే తాము ఎవరెవరిని నామినేట్ చేయాలి.. ఎందుకు అనే విషయాలపై చర్చించుకుంటారు ఇంటి సభ్యులు. అయితే బిగ్‏బాస్ ఇంట్లో ఎప్పుడు.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది కూడా తెలియదు. నామినేషన్స్ ఎలా పెడతారనేది కూడా తెలియదు. ఎప్పటిలాగే.. నిన్న కూడా నామినేషన్స్ ప్రక్రియను డిఫరెంట్‏గా ప్లాన్ చేశాడు బిగ్‏బాస్. ఇక పదవ వారంలో కెప్టన్‏గా ఉన్న యానీ మాస్టర్‏‏కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు బిగ్‏బాస్. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా.

ఇక నిన్నటి నామినేషన్స్ ప్రక్రియలో కెప్టెన్ యానీ మాస్టర్,.. నలుగురు ఇంటి సభ్యులను నేరుగా నామినేట్ చేసి జైలులో పెట్టాలని చెప్పారు బిగ్‏బాస్. దీంతో ముందుగా కాజల్.. ఆ తర్వాత.. సన్నీని.. మానస్.. షణ్ముఖ్‏ను నామినేట్ చేసింది యానీ మాస్టర్. అయితే ఈ నలుగురిని నామినేట్ సరైన కారణాలు చెప్పలేకపోయింది. సన్నీని ఇంతవరకు నామినేట్ చేయలేదు.. అందుకే ఇప్పుడు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక నామినేషన్‏లో అసలు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‏బాస్. బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న సంకెళ్లను పట్టుకుని తమకు ఇష్టమైన వాళ్లని విడిపించవచ్చని చెప్పారు. ఆ విడుదలైన సభ్యుడు ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పారు. ఆ ఇద్దరు ఒకరు నామినేట్ అయి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ముందుగా ప్రియాంక సంకెళ్లను అందుకుని మానస్‏ను జైలు నుంచి విముక్తి కల్పించింది. ఇక మానస్..జెస్సీ, రవిని నామినేట్ చేయకా.. ప్రియంక.. మానస్ మాట్లాడుకుని జెస్సీని జైలుకు పంపారు. ఆ తర్వాత సిరి.. జెస్సీని సేవ్ చేసింది. జెస్సీ తిరిగి మానస్.. ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఇక తర్వాత సిరి.. మానస్‏ను నామినేట్ చేసింది.

ఆ తర్వాత జెస్సీ.. షణ్ముఖ్‏ను కాపాడగా.. ప్రియాంక, సిరిలను నామినేట్ చేశాడు షణ్ముఖ్. అయితే జెస్సీ..సిరిని సేవ్ చేసి ప్రియాంకను జైలుకు పంపాడు. అనంతరం రవి.. సంకెళ్లు అందుకుని ప్రియాంకను జైలు నుంచి బయటకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత ప్రియాంక.. షణ్ముఖ్, జెస్సీలను నామినేట్ చేయగా.. రవి .. జెస్సీని సేవ్ చేసి షణ్ముఖ్‏ను మళ్లీ జైలుకు పంపాడు. ఆ తర్వాత శ్రీరామ్.. కాజల్‏ను సేవ్ చేయగా.. ఆమె.. సిరి, రవిలను నామినేట్ చేసింది. ఇక శ్రీరామ్.. రవిని సేవ్ చేసి.. సిరిని నామినేట్ చేసి జైలుకు పంపాడు. ఇక ఆ తర్వాత కాజల్..షణ్ముఖ్‏ను సేవ్ చేసింది. ఇక ఆ తర్వాత షణ్ముఖ్.. రవి, శ్రీరామ్ లను నామినేట్ చేయగా.. కాజల్.. రవిని జైలుకు పంపింది. ఇక చివరికి జైలులో మిగిలిన మానస్, సిరి , సన్నీ, రవిలు నామినేట్ కాగా.. బిగ్‏బాస్ మరోసారి యానీ మాస్టర్ కు లక్కీ ఛాన్స్ ఇచ్చాడు. ఇంటి సభ్యులలో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో ఆమె మరో ఆలోచన లేకుండా కాజల్‏ను నామినేట్ చేసింది. మొత్తంగా.. పదవ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిరి, మానస్, సన్నీ, రవి, కాజల్ నామినేట్ అయ్యారు.

Also Read: Saanve Megghana : ఓరకంటితో గుండెల్ని పిండేస్తున్న సొగసుల శాన్వి మేఘన.. లేటెస్ట్ ఫొటోస్..