Shruti Das: ‘నువ్వు బ్లాక్ బోర్డ్.. కమిట్మెంట్ ఇచ్చినందుకే నీకు ఛాన్స్’… దారుణంగా ట్రోల్స్.. ఫిర్యాదు చేసిన నటి..
సాధారణంగా హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో చాలా రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు కొందరు ఆకతాయిలు.. ముఖ్యంగా వాళ్ల స్కీన్ టోన్ గురించి...
సాధారణంగా హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో చాలా రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు కొందరు ఆకతాయిలు.. ముఖ్యంగా వాళ్ల స్కీన్ టోన్ గురించి… వ్యక్తిగత విషయాలను ఎత్తిచూపడమే పనిగా పెట్టుకుంటారు. అయితే ఇలాంటి విషయంలో కొందరు తారలు పెద్గగా పట్టించుకోకపోయిన.. మరికొందరు స్ట్రాంగ్‌గా సమాధానాలు చెబుతుంటారు. అలాగే కొందరు నటీనటులు పోలీసులను ఆశ్రయిస్తారు. తాజాగా బెంగాలీ పాపులర్ నటి శ్రుతి దాస్ కూడా తన స్కీన్ టోన్ పై దారుణంగా కామెంట్స్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత రెండు సంవత్సరాలుగా తన మేనీ ఛాయపై కామెంట్స్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కోంది. సీరియల్స్‌లో అవకాశాల కోసం దర్శకులకు కమిట్మెంట్స్ ఇస్తున్నావని.. అందుకే తనకు ఛాన్స్ వస్తుందని కొందరు నెటిజన్లు ఆమె ట్రోల్ చేస్తున్నారని పేర్కోంది.
ఓ ఆంగ్ల పత్రికతో శ్రుతిదాస్ మాట్లాడుతూ.. ” బ్లాక్ బోర్డ్, నలుపు అమ్మాయి అనే పేర్లతో నన్ను వేధిస్తున్నారు. అసలు నీలాంటి వాళ్లను హీరోయిన్లుగా ఎలా పెట్టుకుంటున్నారంటూ కించపరుస్తున్నారు. అంతేకాదు.. మెయిన్ రోల్స్ కోసం నేను దర్శకులకు కమిట్మెంట్ ఇస్తున్నానని.. అందుకే నాకు లీడ్ రోల్స్ వస్తునాయని దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నేను ఓ డైరెక్టర్‍తో రిలేషన్ షిప్ లో ఉన్నానని.. అందుకే నాకు ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. కానీ అవన్ని నిజం కావు. నా ప్రతిభే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. ఎవరివల్లనో నాకు అవకాశాలు రావడం లేదు. ప్రేక్షకులు నన్ను అంగీకరించకపోతే ఇక్కడివరకు వచ్చేదాన్ని కాదు.. గత రెండేళ్లుగా నాపై ఇలాంటి మాటలు వస్తూనే ఉన్నాయి. అందుకే వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను ” అంటూ చెప్పుకోచ్చింది శ్రుతిదాస్.