AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Quiz: బాలరామయ్య విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా టీవీ9 రామాయణం క్విజ్‌.. విజేతలకు బహుమతుల అందజేత

ఇది అద్భుతం.. అద్వితీయం.. టీవీ9 శ్రీరామ కార్యక్రమాల పరంపరలో మరో సంచలనం! అదే..రామాయణం క్విజ్‌! తెలుగు మీడియాకే తలమానికంగా.. స్టూడియోలో అయోధ్య సెట్‌ వేయడంతో బాటు.. అందరిలో రామకథా చైతన్యం కల్గించే ఉద్దేశంతో రామాయణం క్విజ్‌ నిర్వహించింది టీవీ9. ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అందులో 9 మంది లక్కీ విన్నర్‌లకు బహుమతులు దక్కాయి.

Ramayana Quiz: బాలరామయ్య విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా టీవీ9 రామాయణం క్విజ్‌.. విజేతలకు బహుమతుల అందజేత
Ramayana Quiz In Tv9
Surya Kala
|

Updated on: Jan 23, 2024 | 10:23 AM

Share

అల అయోధ్యాపురిలో 500 ఏళ్ల రామభక్తుల కల సాకారమైంది. బాలరాముని ప్రాణప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా తెలుగు మీడియా చరిత్రలోనే వినూత్నంగా ఆలోచించి రామయణంపై జనంలో చైతన్యం నింపేలా.. టీవీ9 నిర్వహించిన క్విజ్ కాంటెస్ట్‌కి ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. టీవీ9 ఇచ్చిన ఆరు ప్రశ్నలకు మూడు రోజుల్లో కొన్ని వేల మంది జవాబులు పంపారు. అందులో 9 మంది లక్కీ విన్నర్స్‌ బహుమతులు దక్కించుకున్నారు. టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షప్రసారంలో ఆ లక్కీ విన్నర్స్‌ని డ్రా ద్వారా ప్రకటించి.. లైవ్‌లోనే ఆ లక్కీ విన్నర్స్‌తో మాట్లాడించింది టీవీ9 టీమ్.

రామాయణంలో సౌమిత్రి అని ఎవరిని అంటారనే ప్రశ్నకు లక్కీ డ్రాలో గుంటూరుకు చెందిన ఏడుకొండలు లక్కీ విన్నర్‌గా నిలిచారు. శ్రీరాముడి విల్లు పేరేమిటి అనే ప్రశ్నకు విశాఖపట్నానికి చెందిన మౌనిక విజేతగా నిలిచారు. సీతారామ లక్ష్మణులను నది దాటించిన మత్స్యకారుడి పేరేమిటి? అనే ప్రశ్నకు హైదరాబాద్‌కి చెందిన సురభి యాదగిరిరావుకు బహుమతి దక్కింది. రాముడి వనవాసం ఎన్నేళ్లు? అనే ప్రశ్నకు విజయవాడకు చెందిన అనంతకృష్ణకు బహుమతి వరించింది.

ఇవి కూడా చదవండి

రామాయణ కథప్రకారం.. ఎక్కువ కాలం నిద్రలో గడిపిన వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నకు మల్కాజ్‌గిరికి చెందిన సుహాసిని విజేతగా ఎంపికయ్యారు. రావణుడు సీతను ఎత్తుకుపోవటానికి కారకురాలైన స్త్రీ ఎవరనే ప్రశ్నకు హైదరాబాద్‌కి చెందిన లావణ్య లక్కీ విజేతగా నిలిచారు. ఈ ఆరుగురితో పాటు మరో ముగ్గురు లక్కీ విన్నర్స్‌కి సైతం బహుమతులు ప్రకటించింది టీవీ9.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..