Punch Prasad: పంచ్ ప్రసాద్‌కు అండగా ఏపీ ప్రభుత్వం.. జగన్ దృష్టికి తీసుకెళ్లిన రోజా.. సాయం అందిస్తామని ఏపీ సీఎంవో ట్వీట్
ప్రసాద్ కు చాలా సీరియస్ అని.. వెంటనే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అయితే సర్జరీకి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కావడంతో దాతలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు ప్రసాద్ కుటుంబసభ్యులు. ఇదే విషయాన్ని చెబుతూ మరో కమెడియన్ నూకరాజు తన సోషల్ మీడియా ఖాతలో వీడియోస్, పోస్టర్స్ షేర్ చేస్తూ హెల్ప్ చేయాలంటూ నెటిజన్స్ ను కోరుతూ బ్యాంక్ వివరాలను కూడా షేర్ చేశారు.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన పంచ్ ప్రసాద్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన రెగ్యూలర్ గా డయాలసిస్ చికిత్స చేయించుకున్నాడు. అయితే ఇటీవల అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రసాద్ కు చాలా సీరియస్ అని.. వెంటనే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అయితే సర్జరీకి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కావడంతో దాతలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు ప్రసాద్ కుటుంబసభ్యులు. ఇదే విషయాన్ని చెబుతూ మరో కమెడియన్ నూకరాజు తన సోషల్ మీడియా ఖాతలో వీడియోస్, పోస్టర్స్ షేర్ చేస్తూ హెల్ప్ చేయాలంటూ నెటిజన్స్ ను కోరుతూ బ్యాంక్ వివరాలను కూడా షేర్ చేశారు.
మరోవైపు హైపర్ ఆది, మిగతా కమెడియన్స్ సైతం పంచ్ ప్రసాద్ కు సాయం చేయాలని బ్యాంకు వివరాలతో ఉన్న ఫోటోను షేర్ చేయగా.. ఓ వ్యక్తి దానిని షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎంవో అధికారికి ట్యాగ్ చేశాడు. ఆ పోస్ట్ కు ఏపీ సీఎంవో రిప్లై ఇచ్చింది. ఇప్పటికే పంచ్ ప్రసాద్ కుటుంబసభ్యులతో సీఎంవో టీం టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు.
అలాగే పంచ్ ప్రసాద్ కుటుంబసభ్యులతో లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఆ పని పూర్తికాగానే డాక్యుమెంట్లను పరిశీలించి సర్జరీకి అవసరమైన సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఏపీ ప్రభుత్వం తొందరగా ఆ ప్రక్రియ పూర్తి చేసి ప్రసాద్ ఆరోగ్యం బాగుపడేలా చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం పంచ్ ప్రసాద్ ఆరోగ్య సమస్యలను మంత్రి రోజా సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లగా.. సీఎం వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందించడంతో.. ఇప్పుడు యశోద ఆసుపత్రిలో ప్రసాద్ కు వైద్య సేవల్ని అందిస్తున్నట్లుగా సమాచారం. ప్రసాద్ వైద్య ఖర్చులన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తోంది. అలాగే గతంలో కంటే ప్రసాద్ ఆరోగ్యం ఇప్పుడు కాస్త మెరుగుపడిందని.. సర్జరీ జరిగితే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఇక ప్రసాద్ కు కిడ్నీ ఇవ్వడానికి డోనర్ దొరికినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు అతడికి కిడ్నీ ఇవ్వడానికి అతని భార్య ముందుకు వచ్చింది. ఇప్పుడు డోనర్ దొరకడంతో ఆ కిడ్నీని ఆపరేషన్ ద్వారా ప్రసాద్ కు పెట్టబోతున్నారు. త్వరలోనే పంచ్ ప్రసాద్ కోలుకుని పూర్తిగా ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు.
My team is following up with the family and guiding them in LOC application process. We will LOC under CMRF for renal transplantation as soon as we complete the documents verification.#YSJaganCares https://t.co/CAkeihv0VR
— Dr Hari Krishna (@HariKrishnaCMO) June 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.