Dhanush: బ్రిక్స్‌ పురస్కారం అందుకున్న తమిళ స్టార్‌ ధనుష్‌.. ఎందుకంటే..

తమిళ స్టార్‌ ధనుష్‌ నటించిన చిత్రాల్లో 'అసురన్‌'కు ఒక ప్రత్యేక స్థానముంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో మంజు వారియర్‌ కీలక పాత్ర పోషించింది

Dhanush:  బ్రిక్స్‌ పురస్కారం అందుకున్న తమిళ స్టార్‌ ధనుష్‌.. ఎందుకంటే..
Follow us
Basha Shek

|

Updated on: Nov 29, 2021 | 2:00 PM

తమిళ స్టార్‌ ధనుష్‌ నటించిన చిత్రాల్లో ‘అసురన్‌’కు ఒక ప్రత్యేక స్థానముంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో మంజు వారియర్‌ కీలక పాత్ర పోషించింది. కలైపులి కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరించారు. సమాజంలోని అసమానతలు, అంటరానితనాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఏకంగా 3అవార్డులు సొంతం చేసుకుంది. అంతేకాదు 78 వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో ‘ఉత్తమ విదేశీ చిత్రం’ కేటగిరీ కింద ఈ సినిమాను ప్రదర్శించారు. ఇక ఈ చిత్రంలో అద్భుతంగా నటించి ఎన్నో అవార్డులు తన ఖాతాలో వేసుకున్న ధనుష్‌ తాజాగా మరో పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల జరిగిన బ్రిక్స్‌ (BRICS) ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘అసురన్‌’ చిత్రానికి గాను ధనుష్‌ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు.

నాకిది పరిపూర్ణ గౌరవం.. ఇటీవల గోవాలో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (IIF)తో పాటు బ్రిక్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కూడా జరిగింది. ఈ వేడుకలోనే అవార్డు అందుకున్నాడు ధనుష్‌. కాగా ఈ సంతోషకర విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడీ స్టార్‌ హీరో. ‘నాకు ఇది ఒక పరిపూర్ణ గౌరవం’ అని క్యాప్షన్‌ పెట్టాడు. దీంతో అభిమానులు, నెటిజన్ల నుంచి ధనుష్‌కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ‘అసురన్‌’ సినిమాను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. వెంకటేశ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ధనుష్‌ విషయానికొస్తే అతను చివరిగా ‘జగమేతంత్రం’ సినిమాలో కన్పించాడు. ప్రస్తుతం ‘మారన్‌’, ‘తిరుచిత్రంబళం’ సినిమాల్లో నటిస్తున్నాడు.

Also Read:

Samantha : ఆహా అవార్డు అందుకోనున్న అందాల సమంత.. అసలు విషయం ఏంటంటే..

Mehreen Pirzada : సీనియర్ హీరోతో రోమన్స్ కు సై అన్న హనీ.. నాగ్ సినిమాలో మెహరీన్..

Nandamuri Balakrishna: జోరు పెంచిన బాలయ్య.. అనీల్ రావిపూడి సినిమా పట్టాలెక్కేది అప్పుడేనా..?