కథ నచ్చాలే గానీ.. ఏ పాత్రకైనా సిద్ధం

కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా తాను ఆసక్తిని చూపుతానని ప్రముఖ నటి టబు అన్నారు. ఇలాంటి పాత్రలే చేయాలని తనకు ప్రత్యేక ప్రణాళికలు ఉండవని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘కథ నచ్చితే ఏ పాత్ర అయినా ఆసక్తిగా పనిచేస్తా. కారెక్టర్ ఎంపికలపై ఎలాంటి నియమాలు పాటించకపోయినా ఎంత ఆనందంగా చేస్తున్నాననేది నాకు ముఖ్యం’’ అని టబు తెలిపారు. కాగా ఇటీవల కాలంలో సహాయక పాత్రలు చేస్తూ మళ్లీ బిజీ అయిన.. దాదాపు 11ఏళ్ల తరువాత టాలీవుడ్‌కు రీఎంట్రీ […]

కథ నచ్చాలే గానీ.. ఏ పాత్రకైనా సిద్ధం
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 12:29 PM

కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా తాను ఆసక్తిని చూపుతానని ప్రముఖ నటి టబు అన్నారు. ఇలాంటి పాత్రలే చేయాలని తనకు ప్రత్యేక ప్రణాళికలు ఉండవని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘కథ నచ్చితే ఏ పాత్ర అయినా ఆసక్తిగా పనిచేస్తా. కారెక్టర్ ఎంపికలపై ఎలాంటి నియమాలు పాటించకపోయినా ఎంత ఆనందంగా చేస్తున్నాననేది నాకు ముఖ్యం’’ అని టబు తెలిపారు.

కాగా ఇటీవల కాలంలో సహాయక పాత్రలు చేస్తూ మళ్లీ బిజీ అయిన.. దాదాపు 11ఏళ్ల తరువాత టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ‘అలవైకుంఠపురము’లో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. నవదీప్, సుశాంత్, నివేథా పేతురాజ్, రావు రమేష్, జయరామ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. రాధా కృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.