వంద మంది డ్యాన్సర్లు.. మధ్యలో కంగనా

వంద మంది డ్యాన్సర్లు.. మధ్యలో కంగనా

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో తాజాగా ఓ పాటను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. అందులో వంద మంది డ్యాన్సర్లతో కంగనా కలిసి పనిచేస్తుండగా.. ప్రముఖ నృత్య దర్శకురాలు రఘరామ్ గాయత్రి ఆ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 04, 2019 | 12:57 PM

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో తాజాగా ఓ పాటను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. అందులో వంద మంది డ్యాన్సర్లతో కంగనా కలిసి పనిచేస్తుండగా.. ప్రముఖ నృత్య దర్శకురాలు రఘరామ్ గాయత్రి ఆ పాటకు కొరియోగ్రఫీ చేస్తోంది. ఇందుకోసం కంగనా భరతనాట్యం కూడా నేర్చుకుందట.

కాగా చిన్నప్పటి నుంచి సంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందిన జయలలిత.. హీరోయిన్ అవ్వకముందు పలు ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే సినిమాల్లోకి వచ్చాక అద్భుతమైన డ్యాన్సులు చేశారు. ఇక రాజకీయాల్లోనూ తనదైన ముద్రను వేశారు. వీటన్నింటిని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, మరో హిందీ రచయిత రజత్ అరోరా కథను అందిస్తున్నారు. విష్ణు ఇందూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu