కొత్త చట్టం మహేష్ మూవీకి చుట్టమా..!

కొత్త చట్టం మహేష్ మూవీకి చుట్టమా..!

యాక్సిడెంట్లను నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. ‘మోటార్ వాహనాల చట్టం 2019’కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5వేలు.. మైనర్లు వాహనం నడిపితే రూ.10వేలు.. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10వేలు.. డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను అతిక్రమించే ట్యాక్సీవాలాలకు రూ.1 లక్ష.. ఓవర్ స్పీడ్‌కు రూ.1వేయి నుంచి రూ.2వేలు.. సీట్ బెల్టు లేకుండా కారు నడిపినా, హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపితే రూ.1వేయి.. ఇలా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 05, 2019 | 10:22 AM

యాక్సిడెంట్లను నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. ‘మోటార్ వాహనాల చట్టం 2019’కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5వేలు.. మైనర్లు వాహనం నడిపితే రూ.10వేలు.. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10వేలు.. డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను అతిక్రమించే ట్యాక్సీవాలాలకు రూ.1 లక్ష.. ఓవర్ స్పీడ్‌కు రూ.1వేయి నుంచి రూ.2వేలు.. సీట్ బెల్టు లేకుండా కారు నడిపినా, హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపితే రూ.1వేయి.. ఇలా భారీ ఫైన్లను విధించారు. అంతేకాదు సెప్టెంబర్ 1నుంచి ఈ చట్టం అమల్లోకి రాగా.. ఇప్పటికే వేలకు వేలు ఫైన్లు కడుతున్నారు వాహనాదారులు. కాగా దీనికంతటికి కారణం మహేష్ సినిమానే అంటున్నాడు ఓ మాజీ జర్నలిస్ట్ రాహుల్ రౌషన్.

ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసిన రాహుల్.. ట్రాఫిక్ ఫైన్లు ఇంతలా పెరిగినందుకు తెలుగు మూవీ ఇండస్ట్రీనే కారణం అంటూ ఓ కామెంట్ పెట్టారు. కాగా కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రంలో ట్రాఫిక్ రూల్స్‌పై ఓ సన్నివేశం ఉంటుంది. అందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి భారీగా జరిమానాలు విధించాలని ముఖ్యమంత్రి పాత్రలో ఉన్న మహేష్.. అధికారులకు సూచిస్తారు. ఇక ఆ తరువాత అవి అమల్లోకి వస్తాయి. ఇప్పుడు ఇదే సీన్ నెట్టింట్ట వైరల్ అవుతోంది.

కాగా గతంలో మోదీ రూ.500నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు కూడా ఓ సినిమాలోని క్లిప్పింగ్ బాగా వైరల్‌గా మారింది. విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ సినిమాలో నల్ల ధనాన్ని రూపుమాపేందుకు రూ.500నోట్లను రద్దు చేయాలని ఓ బిచ్చగాడు తన అభిప్రాయాన్ని చెప్తాడు. దాన్ని ప్రేరణగా తీసుకున్న మోదీ.. నిజ జీవితంలో అమలు చేశారంటూ పలువురు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu