ఆర్ఆర్ఆర్‌కి ఎన్టీఆర్, చెర్రీలు ఎంత తీసుకుంటున్నారో తెలుసా..?

దర్శకధీరుడు రాజమౌళి తాజాగా.. తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇద్దరి పెద్ద బడా హీరోలతో.. అదీ చారిత్రాత్మక యోధుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్‌లు యాక్ట్ చేస్తున్నారు. ఇద్దరి జీవితాలను ఒకే కథలో.. మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి. రాజమౌళి.. ఎంచుకు ఏ కథనైనా ఓ కొత్తదనంతో.. ఉంటుంది. ఆయన సినిమాలో నటిస్తే.. హిట్ గ్యారెంటీ.. అనే పదాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. అలాగే.. రాజమౌళితో […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:27 pm, Wed, 4 September 19
ఆర్ఆర్ఆర్‌కి ఎన్టీఆర్, చెర్రీలు ఎంత తీసుకుంటున్నారో తెలుసా..?

దర్శకధీరుడు రాజమౌళి తాజాగా.. తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇద్దరి పెద్ద బడా హీరోలతో.. అదీ చారిత్రాత్మక యోధుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్‌లు యాక్ట్ చేస్తున్నారు. ఇద్దరి జీవితాలను ఒకే కథలో.. మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి.

రాజమౌళి.. ఎంచుకు ఏ కథనైనా ఓ కొత్తదనంతో.. ఉంటుంది. ఆయన సినిమాలో నటిస్తే.. హిట్ గ్యారెంటీ.. అనే పదాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. అలాగే.. రాజమౌళితో సినిమా అంటే.. డేట్స్ కూడా ఎక్కువగానే తీసుకుంటారు. ఆయన సినిమా అయ్యేదాక.. వేరే సినిమా ఒప్పుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. రెబల్ స్టార్‌‌ ప్రభాస్‌తో… బాహుబలి సినిమా తీసి.. ప్రపంచవ్యాప్తంగా.. టాలీవుడ్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టారు దర్శకధీరుడు రాజమౌళి.

అయితే.. సహజంగానే.. హీరో.. హీరోయిన్లు రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటారో.. అని అభిమానుల్లో ఓ ప్రశ్న మెదులుతూనే ఉంటుంది కదా..!. మరి ఆ వివరాలేంటో.. తెలుసుకుందామా.. ఈ మూవీ యూనిట్ టీం నుంచి ఓ కొత్త విషయం లీకైయ్యింది. అదే.. ఎన్టీఆర్.. చెర్రీల రెమ్యునరేషన్ వివరాలు. సాధారణంగా.. ఒక సినిమా.. 10 నుంచి 15 కోట్లు తీసుకుంటారు ఎన్టీఆర్, చరణ్‌లు. కానీ.. ఇది రాజమౌళి సినిమా.. అందులోనూ.. డేట్స్ ఎక్కువగా ఉన్న కారణంగా.. ఒక్కొక్కరు దాదాపు రూ.25 కోట్లు తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. కాగా.. సీతగా అలియా భట్.. చరణ్ సరసన నటిస్తోంది. ఈ సినిమా జులై 30న 2020లో రిలీజ్ ‌చేయనున్నట్లు.. రాజమౌళి ఇప్పటికే తెలిపారు. ఇంత్ బజ్‌ని క్రియేట్ చేసే ఈ సినిమా.. ఎన్ని రికార్డులను నెలకొల్పుతుందో.. చూడాలి మరి..!

do you know how much ramcharan and ntr getting for rajamouli movie