AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాప్సీకి బంపరాఫర్‌.. కింగ్‌ఖాన్‌తో జోడీ..!

ఒకప్పుడు బాక్సాఫీస్‌ వద్ద  వరుస విజయాలతో టాప్‌లో ఉన్న బాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్‌కి.. గత ఆరేళ్లుగా డీలా పడుతూ వస్తున్నారు

తాప్సీకి బంపరాఫర్‌.. కింగ్‌ఖాన్‌తో జోడీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 16, 2020 | 4:50 PM

Share

Shah Rukh Taapsee: ఒకప్పుడు బాక్సాఫీస్‌ వద్ద  వరుస విజయాలతో టాప్‌లో ఉన్న బాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్‌కి.. గత ఆరేళ్లుగా డీలా పడుతూ వస్తున్నారు. 2014లో హ్యాపీ న్యూ ఇయర్ చిత్రంతో షారూక్ చివరిసారిగా హిట్‌ని ఖాతాలో వేసుకున్నారు. ఇక రెండేళ్ల క్రితం భారీ అంచనాల మధ్య వచ్చిన జీరో భారీ ఫ్లాప్‌ అవ్వడంతో.. సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అంతేకాదు కాస్త బ్రేక్ తీసుకోవాలని ఉందని, ఇప్పట్లో సినిమాల్లో నటించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఆయనను బాగా మిస్‌ అవుతున్నారు. త్వరగా సినిమాలను చేయండి. ఇంకెన్ని రోజులు ఎదురుచూడాలి సర్‌ అంటూ సోషల్ మీడియాలో అతడికి మెసేజ్‌లు చేస్తున్నారు.

ఇక మరోవైపు ఈసారి వరుస విజయాలను ఖాతాలో వేసుకోవాలనుకుంటోన్న షారూక్‌.. ఆచితూచి స్క్రిప్ట్‌లు ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ముగ్గురు, నలుగురు దర్శకులను షారూక్ ఫైనల్ చేసుకున్నారట. వారిలో అట్లీ, సిద్ధార్థ్‌ ఆనంద్‌, రాజ్ కుమార్ హిరాణీ ఉన్నారట. ఇక రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించబోయే చిత్రంలో హీరోయిన్‌గా రింగు వెంట్రుకల బ్యూటీ తాప్సీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఆమెతో సంప్రదింపులు జరపడం, ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయని సమాచారం. అంతేకాదు దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే తాప్సీ మొదటిసారిగా షారూక్‌తో జత కట్టనుంది. కాగా అమితాబ్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన బద్లాను షారూక్ నిర్మించిన విషయం తెలిసిందే.

Read More:

దీపావళికి ‘లక్ష్మీ బాంబ్’.. ఎలా పేలుతుందో..!

భారీ రెమ్యునరేషన్ డిమాండ్‌ చేస్తోన్న సాయి పల్లవి..!

Follow Us
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి
వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి
కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం
కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం
భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
పిల్లలను కొడుతున్నారా? వారిలో కలిగే ఈ భయంకరమైన ప్రభావాలు తెలిస్తే
పిల్లలను కొడుతున్నారా? వారిలో కలిగే ఈ భయంకరమైన ప్రభావాలు తెలిస్తే
బంగారం దిగుమతులపై కఠిన ఆంక్షలు!
బంగారం దిగుమతులపై కఠిన ఆంక్షలు!