Gully Rowdy Pre Release Event: థియేటర్లలో సందడి చేయనున్న రౌడీ.. ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో..
Gully Rowdy Pre Release Event LIVE: సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా 'గల్లీ రౌడీ' అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎం.వి.వి సత్యనారాయణ నిర్మాతగా...
Gully Rowdy Pre Release Event LIVE: సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా ‘గల్లీ రౌడీ’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎం.వి.వి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 17న విడుదల చేయనున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.
ముఖ్యంగా సినిమా ట్రైలర్ విడుదల తర్వాత ఈ అంచనాలు మరీ పెరిగాయి. కారణం.. సినిమాలో ఫన్, యాక్షన్‌కు అధిక ప్రాధానత్య ఉండడం. వంశపారపంర్యంగా వచ్చిన రౌడీయిజాన్ని భుజానికెత్తుకున్న గల్లీ రౌడీగా సందీప్ ఏం చేశాడన్నదే ఈ సినిమా ఇతివృత్తం. ఇక ఈ సినిమాలో బాబీ సింహా పోలీస్ అధికారిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించారు. రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ తండ్రిగా అతి భయస్తుడి పాత్రలో కనిపిస్తున్నారు.
ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడ్డ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్‌లో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. బుధారం హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు యూవీ యూనిట్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. ఈవెంట్ లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..
Also Read: Priya: తెలుగు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ ప్రియ ఫోటో గ్యాలరీ