ఘనంగా సుధా కొంగర తనయ వివాహం.. హాజరైన మణిరత్నం, సూర్య

టాలెంటెడ్‌ డైరెక్టర్ సుధా కొంగర తనయ ఉత్తర వివాహం చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో ఘనంగా జరిగింది. విఘ్నేష్‌తో సుధా వివాహం జరగ్గా

ఘనంగా సుధా కొంగర తనయ వివాహం.. హాజరైన మణిరత్నం, సూర్య
Follow us

| Edited By:

Updated on: Nov 03, 2020 | 3:02 PM

Sudha Kongara daughter: టాలెంటెడ్‌ డైరెక్టర్ సుధా కొంగర తనయ ఉత్తర వివాహం చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో ఘనంగా జరిగింది. విఘ్నేష్‌తో సుధా వివాహం జరగ్గా.. మణిరత్నం, సుహాసిని మణిరత్నం, సూర్య, జీవీ ప్రకాష్‌, భవానీ శ్రీ తదితరులు ఈ శుభకార్యానికి హాజరైన వధూవరులకు తమ అభినందనలు అందించారు. (అడివి శేషుకి అరుదైన గౌరవం)

కాగా మణిరత్నం దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన సుధా కొంగర.. ద్రోహి అనే చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఆ తరువాత మాధవన్‌తో ఆమె తెరకెక్కించిన ‘ఇరుదై సుత్రు’తో సుధాకు మంచి ఫేమ్‌ వచ్చింది. ఆ తరువాత సూర్యతో సూరారై పొట్రు(తెలుగులో ఆకాశమే నీ హద్దురా) అనే మూవీని తెరకెక్కించారు. దీపావళి కానుకగా నవంబర్ 12న ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుంది. టీజర్‌, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.(మూడేళ్ల డేటింగ్‌.. ఏడేళ్ల ఫ్రెండ్‌షిప్‌.. కాజల్ ప్రేమ కథ ఇదే)