AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమితాబ్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు.. ఎందుకంటే?

బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడో బీజేపీ ఎమ్మెల్యే. సీనియర్ బచ్చన్‌పై తక్షణం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాడాయన. అమితాబ్ బచ్చన్‌తోపాటు...

అమితాబ్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు.. ఎందుకంటే?
Rajesh Sharma
|

Updated on: Nov 03, 2020 | 4:54 PM

Share

BJP MLA complaint against Amitabbachhan: బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడో బీజేపీ ఎమ్మెల్యే. సీనియర్ బచ్చన్‌పై తక్షణం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాడాయన. అమితాబ్ బచ్చన్‌తోపాటు కౌన్ బనేగా కరోడ్‌పతి నిర్వాహకుల మీద కూడా చర్య తీసుకోవాలంటూ సదరు బీజేపీ ఎమ్మెల్యే పట్టుబడుతున్నాడు. ఇంతకీ ఎందుకో తెలుసా?

అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్ ప్రస్తుతం పన్నెండో సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో అడుగుతున్న ప్రశ్నలు హిందువుల సెంటిమెంటును హర్ట్ చేస్తున్నాయంటున్న బీజేపీ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అభిమన్యు పవార్ ‌అనే బీజేపీ ఎమ్మెల్యే మహారాష్ట్రలోని అవుసా నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా ఆయన లాతూర్ జిల్లా ఎస్పీకి కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో అడుగిన ప్రశ్న ఆధారంగా ఈ ప్రోగ్రామ్ నిర్వాహకులపైనా, దానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్‌పైనా, ప్రోగ్రామ్‌ని టెలికాస్ట్ చేస్తున్న సోనీ టీవీపైనా ఫిర్యాదు చేశాడు. గత శనివారం కర్మ వీర్ స్పెషల్ పేరిట టెలికాస్ట్ చేసిన కౌన్ బనేగా కరోడ్‌పతి ఎపిసోడ్‌లో అడిగిన ఓ ప్రశ్నపై అభిమన్యు పవార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

సామాజిక కార్యకర్త బెజ్వాడ విల్సన్, నటుడు అనుప్ సోనీలిద్దరు హాట్ సీటులో కూర్చున్న సందర్భంలో 6.4 లక్షల బహుమానానికిగాను అమితాబ్ అడిగిన ప్రశ్న హిందువులు, బౌద్ధుల మధ్య చిచ్చు రేపేదిగా వుందన్నది అభిమన్యు పవార్ వాదన. 1927 డిసెంబర్ 25వ తేదీన డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఏ పుస్తక ప్రతులను తగుల బెట్టారన్నది ప్రశ్న కాగా.. దానికి నాలుగు ఆప్షన్ల కింద విష్ణు పురాణం, భగవద్గీత, రుగ్వేదం, మనుస్మృతిలను పేర్కొన్నారు. ఇచ్చిన మొత్తం నాలుగు ఆప్షన్లు హిందువులు పవిత్రంగా భావించే గ్రంథాలు. ఇది హిందూ మతాన్ని అవమాన పరచడమేనంటున్న అభిమన్యు పవార్.. హిందువుల సెంటిమెంట్‌ను హర్ట్ చేసిన అమితాబ్ బచ్చన్‌పై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.

ALSO READ: ఈడీ చరిత్రలో భారీ జరిమానా

ALSO READ: భూమా ఫ్యామిలీలో భగ్గుమన్న విభేదాలు

ALSO READ: కల్లు ప్రియులకు షాకింగ్ న్యూస్

ALSO READ: రెవెన్యూ అధికారిని చితక్కొట్టిన మహిళా రైతు