Breaking: ఈడీ చరిత్రలో భారీ జరిమానా

భారత ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ చరిత్రలోనే అతి భారీ జరిమానా విధించిన పరిణామం మంగళవారం చోటుచేసుకుంది. విదేశీ సంస్థలతో అక్రమ లావాదేవీలు నిర్వహించిన ఓ జ్యువెల్లరీస్ సంస్థకు, దాని యజమానికి ఈడీ భారీ జరిమానా విధించింది.

Breaking: ఈడీ చరిత్రలో భారీ జరిమానా
Follow us

|

Updated on: Nov 03, 2020 | 4:52 PM

Big fine in ED history:  భారత ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ చరిత్రలో ఓ సంస్థ మీద, ఓ వ్యక్తి మీద భారీ జరిమానా విధించిన పరిణామం మంగళవారం చోటుచేసుకుంది. హాంకాంగ్‌కు డైమండ్స్ ఎగుమతి ఫెమా కేసులో ఈడీ ఈ జరిమానా విధించింది. ఎంబీఎస్ జ్యువెల్లరీస్, దాని యజమాని సుఖేశ్ గుప్తాలకు ఈడీ మంగళవారం భారీ జరిమానా విధించింది.

హాంకాంగ్‌కు డైమండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ఫెమా కేసులో ఈడీ పెద్ద నిర్ణయం తీసుకుంది. భారీ జరిమానా విధించింది. దీంతో ప్రముఖ వ్యాపారి సుఖేష్‌ గుప్తాకు భారీ షాక్ తగిలింది. ఎంబీఎస్‌ జ్యువెలర్స్, సుఖేష్‌గుప్తాకు జరిమానా విధించింది. ఎంబీఎస్‌ జ్యువెలర్స్‌కు రూ.222.44 కోట్ల భారీ జరిమానా విధిస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. సుఖేష్‌గుప్తాకు 22 కోట్ల రూపాయల జరిమానా విధిచింది.

ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీతో వ్యాపార లావాదేవీలు నిర్వహించిన కేసులో ఈడీ ఈ జరిమానా నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌కు చెందిన లింక్‌ ఫై కంపెనీతో డైమండ్ల సరఫరా లావాదేవీలు కొనసాగించింది ఎంబీఎస్ జ్యువెల్లరీస్. తద్వారా విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించాడు సుఖేష్‌ గుప్తా. సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిపిన ఈడీ చివరికి సంస్థ చరిత్రలో అతి భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం వెలువరించింది.

ALSO READ: కల్లు ప్రియులకు షాకింగ్ న్యూస్

ALSO READ: రెవెన్యూ అధికారిని చితక్కొట్టిన మహిళా రైతు

ALSO READ: అమితాబ్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

ALSO READ: భూమా ఫ్యామిలీలో భగ్గుమన్న విభేదాలు