Lenovo Yoga 7I: సూపర్ ఫాస్ట్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసిన లెనోవో.. యోగా 7ఐతో ఆ సమస్యలకు చెక్

తాజాగా ప్రముఖ కంపెనీ లెనోవో సూపర్ స్పీడ్ ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. లెనోవో యోగా 7 ఐ 2 ఇన్ 1 భారతదేశంలో కన్వర్టిబుల్ ఫారమ్ ఫ్యాక్టర్‌తో రిలీజ్ చేసింది. ల్యాప్‌టాప్‌లో 120 హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో 14 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ అమర్చి వస్తుంది. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 5, కోర్ అల్ట్రా 7 సీపీయూతో 32 జీబీ+1టీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది.

Lenovo Yoga 7I: సూపర్ ఫాస్ట్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసిన లెనోవో.. యోగా 7ఐతో ఆ సమస్యలకు చెక్
Lenovo Yoga
Follow us

|

Updated on: Apr 28, 2024 | 4:30 PM

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ల్యాప్‌టాప్‌ల వినియోగాన్ని ఇష్టపడుతున్నారు. దీంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ సరికొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ కంపెనీ లెనోవో సూపర్ స్పీడ్ ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. లెనోవో యోగా 7 ఐ 2 ఇన్ 1 భారతదేశంలో కన్వర్టిబుల్ ఫారమ్ ఫ్యాక్టర్‌తో రిలీజ్ చేసింది. ల్యాప్‌టాప్‌లో 120 హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో 14 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ అమర్చి వస్తుంది. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 5, కోర్ అల్ట్రా 7 సీపీయూతో 32 జీబీ+1టీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 71 డబ్ల్యూహెచ్‌ఆదర్ బ్యాటరీతో రావడం వల్ల ఒక్కసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 22.5 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

భారతదేశంలో లెనోవో యోగా 7 ఐ 2-ఇన్-1 (2024) ధర రూ. 1,01,990గా ఉంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 సీపీయూ, డబ్ల్యూయూఎక్స్‌జీఏ రిజల్యూషన్‌తో ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్‌తో వేరియంట్ కోసం రూ.1,19,990గా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లు కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, ఇతర రిటైల్ ఛానెల్‌ల ద్వారా స్టార్మ్ గ్రే మరియు టైడల్ టీల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్‌లో విండోస్ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో నడుస్తుంది. ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌తో పాటుగా ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సీపీయూల ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 32 జీబీ వరకు ర్యామ్‌తో వస్తుంది. 600 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 14 అంగుళాల స్క్రీన్‌‌తో ఓఎల్ఈడీ మోడల్‌‌ ఈ ల్యాప్ టాప్ ప్రత్యకత. 

ఈ ల్యాప్‌టాప్‌లో 1 టీబీ వరకు పీసీఈఈ ఎం.2జెన్ 4 ఎస్ఎస్‌డీ నిల్వతో వస్తుంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌లో 2 మెగాపిక్సెల్ ఫుల్-హెచ్‌డి+ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా, రెండు బిల్ట్-ఇన్ మైక్రోఫోన్‌లు కూడా ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లోని కనెక్టివిటీ ఆప్షన్‌లలో వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2, వంటి ఫీచర్లు ఉన్నాయి. లెనోవో యోగా 7 ఐ 2 ఇన్ 1 71 డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీని రాపిడ్ ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ సపోర్ట్‌తో వస్తుంది. అందువల్ల ఇది 15 నిమిషాల ఛార్జ్‌తో మూడు గంటల వినియోగాన్ని అందిస్తుంది అని కంపెనీ తెలిపింది. లోకల్ వీడియో ప్లేబ్యాక్ సమయంలో ల్యాప్‌టాప్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22.5 గంటల వరకు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..