Vivo T3x Vs Realme C65 5G: అతి తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన కొత్త ఫోన్లు ఇవి.. ఏది బెస్ట్ అంటే..

ఈ రియల్ మీ సీ 65 స్మార్ట్ ఫోన్ కు వివో టీ3ఎక్స్ 5జీ నుంచి గట్టిపోటీనిస్తోంది. ఈ వివో స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే లంచ్ అయ్యింది. 5జీ వేరియంట్ గా వచ్చిన ఈ ఫోన్ కూడా బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 6 జెన్1 చిప్ సెట్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఈ క్రమంలో కొనుగోలుదారులకు ఏది బెస్ట్?

Vivo T3x Vs Realme C65 5G: అతి తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన కొత్త ఫోన్లు ఇవి.. ఏది బెస్ట్ అంటే..
Vivo T3x Vs Realme C65 5g
Follow us

|

Updated on: Apr 28, 2024 | 4:14 PM

రియల్ మీ ఇటీవల అతి తక్కువ బడ్జెట్లో ఓ సూపర్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. రియల్ మీ సీ65 పేరుతో వచ్చిన ఫోన్ రూ. 10,499 నుంచి ప్రారంభమవుతోంది. దీనిలో హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, మీడియా టెక్ చిప్ సెట్, 50ఎంపీ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్ ఉంటుంది. ఇది మూడు వేరియంట్లతో వస్తుంది. మూడింటిలోనూ వేరు వేరు ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యాలతో వస్తాయి. అలాగే రెండు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ రియల్ మీ సీ 65 స్మార్ట్ ఫోన్ కు వివో టీ3ఎక్స్ 5జీ నుంచి గట్టిపోటీనిస్తోంది. ఈ వివో స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే లంచ్ అయ్యింది. 5జీ వేరియంట్ గా వచ్చిన ఈ ఫోన్ కూడా బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 6 జెన్1 చిప్ సెట్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఈ క్రమంలో కొనుగోలుదారులకు ఏది బెస్ట్? ఈ రెండింటిలో ఏది కొనుగోలు చేస్తే వినియోగదారులకు మేలు జరుగుతుంది. రెండింటి మధ్య పూర్తి సారూప్యతలు ఇప్పుడు చూద్దాం..

ధర..

  • వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ 4జీబీ, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో రూ. 13,499 నుంచి ప్రారంభమవుతుంది. 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,999, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499 ఉంటుంది.
  • రియల్మీ సీ65 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ. 12,499గా ఉంటుంది.

డిస్ ప్లే వివరాలు..

  • వివో టీ3ఎక్స్ 5జీ డిస్ ప్లే 6.72 అంగుళాల 120హెర్జ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ అల్ట్రా విజన్ డిస్ ప్లే ఉంటుంది.
  • రియల్మీ సీ65 5జీ ఫోన్ 6.67 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.

ప్రాసెసర్ సామర్థ్యం..

  • వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ఉంటుంది.
  • రియల్మీ సీ65 5జీ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ఉంటుంది.

కెమెరాలు వివరాలు..

  • వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెకండరీ కెమెరా, 2ఎంపీ బొకే కెమెరా ఉంటుంది. ముందువైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది.
  • రియల్మీ సీ65 5జీ ఫోన్లో 50ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ముందువైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది.

ఆపరేటింగ్ సిస్టమ్..

  • వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్లో ఫన్ టచ్ ఓఎస్ 14 ఆధారితమైన ఆండ్రాయిడ్ 14 ఉంటుంది.
  • రియల్మీ సీ65 5జీ ఫోన్లో రియల్ మీ యూఐ 5.0తో కూడిన ఆండ్రాయిడ్ 14 ఉంటుంది.

స్పెషల్ ఫీచర్స్..

  • వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్లో ఎక్స్ టెండెడ్ ర్యామ్ 3.0, 4కే వీడియో రికార్డింగ్(8జీబీ వెర్షన్లో మాత్రమే), హిడెన్ ఫోటోస్ సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది.
  • రియల్మీ సీ65 5జీ ఫోన్లో రెయిన్ డ్రాప్ స్మార్ట్ టచ్ ఫీచర్ 96శాతం కచ్చితత్వంతో పనిచేస్తుంది. ఐపీ54 రేటింగ్ ఉంటుంది.

ఏది బెస్ట్ అంటే..

వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్లో పెద్ద డిస్ ప్లే ఉంది. ర్యామ్ సైజ్ కూడా పెద్దగానే ఉంటోంది. అధిక బ్యాటరీ సామర్థ్యంతో పాటు ఫాస్టా చార్జింగ్ సపోర్టు ఉంటుంది. మరోవైపు రియల్ మీ సీ65 5జీ స్మార్ట్ ఫోన్ అధిక రిఫ్రెష్ రేట్ తో పాటు అనువైన బడ్జెట్ ధరలో లభిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే
తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే
ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.
ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.
ఎలుగుబంట్లు చకచకా చెట్టు ఎక్కడం చూశారా.? వీడియో వైరల్..
ఎలుగుబంట్లు చకచకా చెట్టు ఎక్కడం చూశారా.? వీడియో వైరల్..
కొండలు ఎక్కి, గుట్టలు దాటొచ్చి ఓటు వేసిన గిరిజనులు.. వైరల్ వీడియో
కొండలు ఎక్కి, గుట్టలు దాటొచ్చి ఓటు వేసిన గిరిజనులు.. వైరల్ వీడియో