Fake Bank Apps: బాప్ రే యాప్! వీటిని నమ్మితే అంతే సంగతులు.. నకిలీ బ్యాంక్ యాప్‌ల లిస్ట్ ఇదే..
భారతీయ ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటువంటి హానికరమైన యాప్‌ల గురించి ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. వారి బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ములను దొంగిలించడానికి ఈ యాప్‌ల ద్వారా అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వ నిర్వహణలోని సైబర్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ అవేర్ నెస్ హ్యాండిల్స్ కు సంబంధించిన సైబర్ దోస్త్ వీటిని గుర్తించింది.
టెక్నాలజీ పెరగడంతో బ్యాంకింగ్ లావాదేవీలు చాలా సులభమై ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి పనికీ బ్యాంకుల చుట్టూ తిరగకుండా తక్కువ సమయంలో పనులు చేసుకునే వీలు కలిగింది. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్ల వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి ఖాతాలలో సొమ్ములు మాయమవుతున్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, బ్యాంకు ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్ల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
వినియోగదారులకు హెచ్చరిక..
భారతీయ ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటువంటి హానికరమైన యాప్‌ల గురించి ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. వారి బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ములను దొంగిలించడానికి ఈ యాప్‌ల ద్వారా అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వ నిర్వహణలోని సైబర్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ అవేర్ నెస్ హ్యాండిల్స్ కు సంబంధించిన సైబర్ దోస్త్ వీటిని గుర్తించింది. ఈ హానికరమైన యాప్‌ల ద్వారా జరిగే ప్రమాదాలపై వినియోగదారులను హెచ్చరించింది.
నకిలీ బ్యాంకింగ్ యాప్‌లు..
యూనియన్-రివార్డ్స్.ఏపీకే పేరుతో నకిలీ యూనియన్ బ్యాంక్ యాప్ ను గుర్తించారు. ఇది యూనియన్ బ్యాంక్ అధికారిక ఆండ్రాయిడ్ యాప్‌గా మారి వినియోగదారులకు రివార్డ్‌లను అందిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న వారి ఖాతాలలో సొమ్ములు మాయమవుతున్నాయి.
స్టాక్ ట్రేడింగ్ యాప్ మోసాలు..
ఇటీవల స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య బాగా పెరిగింది. దీని ఆసరాగా చేసుకునే అనేక మోసపూరిత యాప్ లు తయారయ్యాయి. వీటివల్ల దేశవ్యాప్తంగా అమాయక పౌరులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. గ్రూప్-లు అనే మోసపూరిత యాప్ గురించి భారత ప్రభుత్వ సైబర్ సెల్ ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. ఈ యాప్ ను చూ చీ క్యో హుయ్ (chu chi quoc huy) పేరుతో రూపొందించారు. వినియోగదారులను అనాలోచిత స్టాక్ ట్రేడింగ్ కార్యకలాపాలలో పాల్గొనేలా ఈ యాప్ మోసం చేస్తుంది.
అనధికారికంగా..
సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కింద నమోదు కాని అనేక యాప్ లు ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి. వాటిలో ఐఎన్ఎస్ఈసీజీ (INSECT), సీహెచ్ఎస్-ఎస్ఈఎస్ (CHS-SES), ఎస్ఏఏఐ (SAAI), ఎస్ఈక్యూయూఓఐఏ (SEQUOIA), గూమీ (GOOMI)తో సహా అనేక మోసపూరిత యాప్‌లను గుర్తించారు. ఇవి వినియోగదారులకు తప్పుడు వాగ్దానాలు చేసి స్టాక్‌లో పెట్టుబడి పెట్టేలా ఆకర్షిస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. బాధితులు తరచుగా డిజిటల్ వాలెట్లలో ప్రదర్శించబడే నకిలీ లాభాల కోసం మోసగాళ్లు పేర్కొన్న బ్యాంకు ఖాతాలలో నిధులను జమ చేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
ఆన్ లైన్ లో ఇటువంటి స్కామ్ లు పెరిగిపోవడంతో వినియోగదారులకు సెబీ (SEBI) హెచ్చరికలు జారీ చేసింది. వివిధ స్టాక్ మార్కెట్ లలో , ఇతర వాటిలో పెట్టుబడి పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సోషల్ మీడియా మెసేజ్‌లను అనుసరించడం మానుకోవాలని హితవు పలికింది. వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానెళ్లు, అనధికార స్టాక్ మార్కెట్ యాక్సెస్‌ను అందించే యాప్‌లు తదితర పెట్టుబడి కార్యకలాపాలలో పాల్గొనే ముందు ఫైనాన్సిల్ ప్లాట్‌ఫారమ్‌ల ఆధారాలను ధ్రువీకరించాలి సూచించింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..