Google Meet: మీటింగ్ అవాంతరాల నుంచి ఈజీగా ‘స్విచ్’ అయిపోండి.. సూపర్ ఫీచర్..

వర్చువల్ మీటింగ్ సమయంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డివైజ్ లను మార్చడానికి గూగుల్ మీట్ కొత్ ఫీచర్ తీసుకొచ్చింది. అదే ‘స్విచ్ హియర్’. దీని సాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు వర్చువల్ మీటింగ్ కొనసాగుతూనే మరొక డివైజ్ లోకి మీటింగ్ ను మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Google Meet: మీటింగ్ అవాంతరాల నుంచి ఈజీగా ‘స్విచ్’ అయిపోండి.. సూపర్ ఫీచర్..
Google Meet
Follow us

|

Updated on: Apr 26, 2024 | 5:22 PM

కరోనా మహమ్మారి ప్రజా జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చింది. కొత్త కల్చర్ ను అలవాటు చేసింది. ముఖ్యంగా ఉద్యోగులకు కొత్త మార్గాలను అన్వేషించేలా చేసింది. అలాంటి ఓ మార్గం వర్క్ ఫ్రం హోమ్ లేదా రిమోట్ వర్కింగ్ వ్యవస్థ. ఇది గత కొంత కాలంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా టెక్ కంపెనీలు ఈ వ్యవస్థను ఇప్పటికీ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీల నుంచి ఉద్యోగులకు సమాచార మార్పిడికి ఓ మాధ్యమం అవసరం అవుతోంది. గ్రూప్ మీటింగ్ కోసం ప్రత్యేకమైన ప్లాట్ ఫారాలు బాగా ఉపయుక్తంగా మారాయి. అలాంటి ఓ ప్లాట్ ఫారం గూగుల్ మీట్. క్లారిటీకి, క్వాలిటీకి ఇది పెట్టింది పేరు. ఆన్ లైన్ మీటింగ్ లకు ఇది బాగా ఉపకరిస్తోంది. ఇప్పుడు మరో అద్భుతమైన ఫీచర్ ను గూగుల్ దీనినిలో తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ గూగుల్ మీట్ వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పిస్తుంది. ఇంతకీ ఎంటా ఫీచర్? దాని ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుందాం రండి..

ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా..

వర్చువల్ మీటింగ్ సమయంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డివైజ్ లను మార్చడానికి గూగుల్ మీట్ కొత్ ఫీచర్ తీసుకొచ్చింది. అదే ‘స్విచ్ హియర్’. దీని సాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు వర్చువల్ మీటింగ్ కొనసాగుతూనే మరొక డివైజ్ లోకి మీటింగ్ ను మార్చుకోవచ్చు. సాధారణంగా మీటింగ్ జరుగుతున్న సమయంలో ఒక డివైజ్ నుంచి మరొక డివైజ్ లోకి మారాలంటే కొన్ని నిమిషాలు పడుతుంది. ఆ సమయంలో మీటింగ్ నుంచి బయటకు రావాల్సి వస్తుంది. అప్పుడు మీ మీటింగ్ హెడ్ పర్మిషన్ తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా, కష్టంగా ఉంటుంది. దానికి పరిష్కారంగా కొత్త ఫీచర్‌తో, మీరు కాల్‌లో ఉన్నప్పుడే పరికరాలను మార్చడాన్ని సులభతరం చేసింది.

ఇలా పనిచేస్తుంది..

మీరు గూగుల్ మీట్ కాల్‌లో ఉన్నప్పుడు హ్యాంగ్ అప్ అయ్యి మళ్లీ చేరకుండానే పరికరాల మధ్య సాఫీగా బదిలీ చేసుకునే వెసులుబాటును ఈ స్విచ్ హియర్ ఫీచర్ అందిస్తుంది. ఉదాహరణకు, మీరు మీ మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో మీట్ కాల్ చేస్తున్నట్లయితే, మీరు మీ డెస్క్ వద్దకు వచ్చినప్పుడు మీరు మీ ల్యాప్‌టాప్‌కు సజావుగా మారవచ్చు. మీ ల్యాప్‌టాప్‌లో మీటింగ్‌ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు కొత్తగా స్విచ్ హియర్ ఎంపికను గమనించవచ్చు. ఇది కొనసాగుతున్న సంభాషణను కొనసాగిస్తూనే ముఖ్యమైన సమాచారం మిస్ అవ్వకుండా మీ పరికరాలను నుంచి కాల్‌ని మారుస్తుంది. ఈ ఫీచర్‌తో, వర్చువల్ గ్రూప్ చాట్ సమయంలో మీ కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ మధ్య మారడం చాలా సులభం.

ఇలా ఎనేబుల్ చేయండి..

ఫీచర్‌ని ఎనేబుల్ చేయడానికి, మీరు మీ కాల్ మధ్యలో ఉన్నప్పుడు, మీరు మారాలనుకుంటున్న పరికరంలో అదే మీటింగ్ లింక్‌ని తెరవవచ్చు. అప్పుడు, నీలిరంగులో “స్విచ్ హియర్” బటన్‌ను గుర్తించండి. మీరు రెండు వేర్వేరు పరికరాలలో కాల్‌కు హాజరు కావాలనుకుంటే, “అదర్ జాయినింగ్ ఆప్షన్స్” అనే బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వా వచ్చిన ఆప్షన్లలో ’జాయిన్ హియర్ టూ’ పై క్లిక్ ఎంచుకోండి. ఇప్పటికే ఈ ఫీచర్ కొంతమంది వినియోగదారులకు అందుబాటులోకి రాగా. రాబోయే వారాల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని టెగ్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles