AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ ఇదే.. టైటిల్ పోస్టర్ రిలీజ్.. హీరోయిన్ ఎవరంటే..

ఈ సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్న సామ్.. అమెరికా, భూటాన్ వంటి దేశాల్లో ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుంది. ఇప్పడిప్పుడు ఈ సమస్య నుంచి కోలుకుంటుంది సామ్. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. సినిమా ఈవెంట్స్, పాడ్ కాస్ట్ అంటూ మళ్లీ అభిమానులకు దగ్గరవుతుంది.

Samantha: నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ ఇదే.. టైటిల్ పోస్టర్ రిలీజ్.. హీరోయిన్ ఎవరంటే..
Samantha
Rajitha Chanti
|

Updated on: Apr 28, 2024 | 4:28 PM

Share

ఇన్నాళ్లు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది సమంత. ఏమాయ చేశావే సినిమాతో మొదలైన సినీ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగు, తమిళం భాషలలో అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది. తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ మయోసైటిస్ కారణంగా కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు మయోసైటిస్ సమస్య వేధిస్తున్న శాకుంతలం, యశోధ చిత్రాలను పూర్తి చేసింది సామ్. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాతో మరోసారి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్న సామ్.. అమెరికా, భూటాన్ వంటి దేశాల్లో ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుంది. ఇప్పడిప్పుడు ఈ సమస్య నుంచి కోలుకుంటుంది సామ్. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. సినిమా ఈవెంట్స్, పాడ్ కాస్ట్ అంటూ మళ్లీ అభిమానులకు దగ్గరవుతుంది.

అలాగే పాడ్ కాస్ట్ ద్వారా తన ఆరోగ్యం కోసం తీసుకున్న ట్రీట్మెంట్ వివరిస్తుంది. ఇదిలా ఉంటే.. కథానాయికగానే కాకుండా నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ‘త్రాలాల మూవీంగ్ పిక్చర్స్’ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ పై కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రతిభ ఉండి సరైన అవకాశాల కోసం ఎదురుచూసే వారికి తన సంస్థ చేయూత ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈరోజు సమంత పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.

ఈ క్రమంలో తన నిర్మాతగా ఫస్ట్ మూవీ అనౌన్స్ చేసింది సామ్. తన పుట్టినరోజు సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థ నుంచి రాబోతున్న మొదటి సినిమాను ప్రకటిస్తూ టైటిల్ రివీల్ చేసింది. అలాగే ఇందులో హీరోయిన్ ఎవరనేది కూడా వెల్లడించింది. సమంత నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తనే హీరోయిన్. అలాగే ఈ చిత్రానికి మా ఇంటి బంగారం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈరోజు విడుదలైన పోస్టర్ లో సామ్ చీరలో.. మెడలో తాళిబొట్టు.. చేతిలో తుపాకీ పట్టుకుని సీరియస్ గా చూస్తుంది. ఇక పోస్టర్ చూస్తుంటే ఈ మూవీ లేడీ ఓరియెంటేడ్ అని అర్థమవుతుంది. బంగారుమయం కావాలంటే అన్నీ మెరవాల్సిన అవసరం లేదు అంటూ రాసుకొచ్చింది సామ్. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us