AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకంటే పిల్లోల్లే నయం.. ఫైనల్లో, అది కూడా భారీ టార్గెట్‌ని ఎలా ఛేజ్ చేయాలో చూపించారుగా..!

India U19 Wins Asia Cup vs Pakistan in Thriller: భారత అండర్-19 జట్టు ఆసియా కప్‌ను గెలుచుకుని చారిత్రాత్మక విజయం సాధించింది. చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌పై ఒక వికెట్ తేడాతో గెలిచింది. ఈ అద్భుతమైన ప్రదర్శన, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సీనియర్ జట్టు పేలవ ప్రదర్శనకు భిన్నంగా నిలిచి, యువ జట్టు పోరాట స్ఫూర్తిని చాటింది.

మీకంటే పిల్లోల్లే నయం.. ఫైనల్లో, అది కూడా భారీ టార్గెట్‌ని ఎలా ఛేజ్ చేయాలో చూపించారుగా..!
Ind Vs Pak U19 Asia Cup
Venkata Chari
|

Updated on: Nov 15, 2026 | 8:44 AM

Share

India U19 Wins Asia Cup vs Pakistan in Thriller: భారత అండర్-19 జట్టు ఆసియా కప్‌ను గెలుచుకొని చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో, చివరి బంతి వరకు నరాల తెగే ఉత్కంఠతో సాగిన పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఒక వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత కుర్రాళ్లు అద్భుతంగా ఛేదించి, గత ఆసియా కప్ ఫైనల్ ఓటమికి దిమ్మ తిరిగే ప్రతికారం తీర్చుకున్నారు.

338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. లక్ష్య రాజేష్ 80 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కీలక హాఫ్ సెంచరీతో పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అయితే, వీరిద్దరూ అవుట్ కావడంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. సరిగ్గా ఇదే సమయంలో అసలైన గేమ్ స్టార్ట్ అయ్యింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతమైన పోరాటం చేశారు. మోహిత్ ఉల్వా 49 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్‌తో, అలాగే మన్నన్ చౌహాన్ 47 పరుగుల అసాధారణ పోరాటంతో పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. వీరిద్దరి వీరోచిత పోరాటంతో భారత్ సంచలన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది.

ఈ విజయంపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. వివిఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ, “మీరు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తీరు గర్వంగా ఉంది. పాకిస్తాన్‌పై ఫైనల్లో అద్భుతంగా పోరాడి విజయం సాధించి ట్రోఫీ గెలవడం ఆనందంగా ఉంది” అని అన్నాడు. సౌరబ్ గంగూలి మాట్లాడుతూ, “యంగ్ సెహ్వాగ్ టోర్నమెంట్‌లో అద్భుతంగా అదరగొట్టాడు. జట్టులోని ప్రతి ఒక్కరు బాగా ఆడారు” అని కొనియాడాడు. ఇర్ఫాన్ పఠాన్ సైతం, “పాకిస్తాన్‌పై మన కుర్రాళ్లు నిజమైన పోరాట పటిమను ప్రదర్శించారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది” అని ప్రశంసించాడు.

సీనియర్లకు సవాలు విసిరిన యువ జట్టు..

ఇదిలా ఉండగా, ఈ అద్భుత విజయం సీనియర్ జట్టు ప్రదర్శనతో పోల్చినప్పుడు మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీం ఇండియా సీనియర్ ఆటగాళ్లు దారుణమైన ప్రదర్శన చేశారు. న్యూజిలాండ్ విధించిన 333 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమై, అనవసరంగా వికెట్లను పారేసుకొని కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ నేపథ్యంలో, అండర్-19 యువ ఆటగాళ్లు పాకిస్తాన్ విధించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదించారో చూడాలి.

యువ జట్టు ఆరంభం నుంచి నెమ్మదిగా ఆడుతూ, కేవలం ఐదు రన్ రేట్‌తో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, వికెట్లను కాపాడుకుంటూ ముందుకు సాగింది. ఆ తర్వాత క్రమక్రమంగా స్ట్రైక్ రేట్‌ను పెంచుకుంటూ, చివరి వరకు పోరాడి విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై నాలుగో వన్డేలో టీం ఇండియా సీనియర్ ఆటగాళ్లు ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ, వికెట్లను కాపాడుకుంటూ బ్యాటింగ్ కొనసాగించి ఉంటే ఖచ్చితంగా ఆ మ్యాచ్‌లో గెలిచి ఉండేవాళ్లు. కానీ అలా చేయకుండా స్ట్రీట్ క్రికెట్ లాగా ఆడారు. అండర్-19 యువ ఆటగాళ్లు మాత్రం అందుకు భిన్నంగా చివరి వరకు ఓపికతో, చాలా అద్భుతంగా పోరాడి చివరి బంతికి విజయం సాధించి, భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదించాలో సీనియర్ జట్టుకు సవాల్ విసిరినట్టు అయింది. ఈ విజయం భారత క్రికెట్‌కు ఒక నూతన ఆశాకిరణాన్ని చూపింది, యువ ప్రతిభకు గొప్ప ప్రోత్సాహాన్ని అందించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us